మీ రాశికి ఉత్తమఫలితాన్నిచ్చే లక్ష్మీ మంత్రమిదే

Posted By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

దేవుడు వివిధరూపాల్లో కొలువై ఉన్నాడు. ప్రతి దేవుడికి తగిన ప్రాముఖ్యం ఉంది. వివిధ అవసరాలకు అలాగే కారణాలకు ఆయా దేవుళ్ళని మనం ప్రార్థిస్తాము. ఆయా అవసరాలకు అనుగుణంగా ఆయా దేవుళ్లను కొలిస్తే ఉత్తమ ఫలితాలు లభిస్తాయి.

ఈరోజు, ఈ ఆర్టికల్ లో శ్రీ లక్ష్మీ అమ్మవారి మంత్రాలను పొందుపరచాము. ప్రతి రాశికి ప్రత్యేకమైన లక్ష్మీ మంత్రం వివరాలను ఇందులో వివరించాము.

12 రాశులకు తగిన లక్ష్మీ మంత్రాలివి. ఆయా రాశులవారు వారికి ప్రత్యేకంగా అందించబడిన ఈ లక్ష్మీ మంత్రాలను పఠిస్తే ఆశించిన ఫలితాలను పొందుతారు. లక్ష్మీ మాత కటాక్షాన్ని త్వరగా పొందుతారు.

మేషరాశి: మార్చ్ 21 - ఏప్రిల్ 19

మేషరాశి: మార్చ్ 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారు 'శ్రీమ్' అనే పదాన్ని 10,008 సార్లు ఉచ్చారణ చేస్తే వారి సంపద పెరుగుతుంది. ఈ పవిత్ర పదాన్ని ఉచ్చారణ చేస్తూ వారు భోగభాగ్యాలను పొందవచ్చు. మంగళకరమైన ఫలితాలను అందించే ఈ పవిత్ర పదాన్ని ఉచ్చరిస్తే వారి రాశికి సానుకూల ఫలితాలు లభిస్తాయి. సాధారణ విషయాలనేవి ఈ రాశివారిని సంతృప్తి పరచవు. కాబట్టి, ఈ పవిత్ర పదాన్ని ఉచ్చరించడం ద్వారా వారు సంపదను పెంపొందించుకోగలుగుతారు.

వృషభరాశి: ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి: ఏప్రిల్ 20 - మే 20

"ఓం సర్వబాధ వినిర్ముక్తో, ధన్ ధాన్య: సుతాన్వితః, మానుష్యో మత్ప్రసాదేన్ భవిష్యతి నా సంశాయాహ్ ఓం" అనే ఈ మంత్రాన్ని ఈ రాశికి చెందిన వారు పఠించాలి. తద్వారా, వీరు తమ సామజిక బాధ్యతలను సరిగ్గా నిర్వహించగలుగుతారు. వీరి కుటుంబంతో వీరు సంతోషంగా గడపగలిగి సమాజంలో తమకైన గుర్తింపును పొందగలుగుతారు.

మిథునరాశి: మే 21 - జూన్ 20

మిథునరాశి: మే 21 - జూన్ 20

"ఓం శ్రీన్గ్ శ్రియే నమః" అనే మంత్రాన్ని ఈ రాశి వారు పఠిస్తే మంచిది. ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా ప్రతికూల పరిస్థితులను కూడా సానుకూలంగా మార్చుకోగలుగుతారు. ఆలా మార్చుకోగలిగే విజ్ఞత వారికి ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా లభిస్తుంది.

కర్కాటక రాశి: జూన్ 21 - జూలై 22

కర్కాటక రాశి: జూన్ 21 - జూలై 22

"ఓం శ్రీ మహాలక్ష్మయై చా విద్మహే విష్ణు పత్నాయై చా ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్ ఓం" అనే ఈ మంత్రాన్ని ఈ రాశికి చెందిన వారు పఠించాలి. ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా ఈ రాశివారు తమ మానసిక స్థితిని మెరుగుపరచుకోవచ్చు. వారి ఇంద్రియాలు ప్రశాంతపడి వారి సంపద మెరుగవుతుంది.

సింహరాశి: జూలై 23 - ఆగస్టు 23

సింహరాశి: జూలై 23 - ఆగస్టు 23

"ఓం శ్రీమ్ మహా లక్ష్మియై నమః" అనే మంత్రం ఈ రాశివారికి ఆశించిన ఫలితాలను అందిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారు సహజంగానే బెరుకు లేని వారు. అలాగే, సాహసోపేతమైన వారు. కొంచెం అహంభావం కూడా కలిగి ఉన్నవారు. అధర్మానికి ఎదురుతిరిగే మనస్తత్వం కలిగిన వారు. ఈ లక్షణం వలన వారు బంధుమిత్రులలో పేరుపొందుతారు.

కన్యారాశి: ఆగస్ట్ 24 - సెప్టెంబర్ 23

కన్యారాశి: ఆగస్ట్ 24 - సెప్టెంబర్ 23

"ఓం హ్రీమ్ శ్రీమ్ క్లిమ్ మహా లక్ష్మి నమః" అనే మంత్రం ఈ రాశివారికి ఉత్తమమైనది. సహజంగానే ఈ రాశివారు బంధాలను నిలుపుకోవడంలో ముందుంటారు. నిజాయితీతో పాటు కష్టపడి పనిచేసే తత్త్వం వీరిని ప్రత్యేకంగా నిలుపుతుంది. జీవితాన్ని సరైన దిశగా ముందుకు నడిపేందుకు ఈ మంత్రం వీరికి అమితంగా ఉపయోగపడుతుంది.

తులారాశి: సెప్టెంబర్ 24 - అక్టోబర్ 23

తులారాశి: సెప్టెంబర్ 24 - అక్టోబర్ 23

"ఓం శ్రీమ్ శ్రీయై నమః" అనే మంత్రం ఈ రాశివారికి అద్భుత ఫలితాలను అందిస్తుంది. ఈ రాశివారు ఆకర్షణీయంగా, అందంగా అలాగే ఆవేశపూరితంగా ఉంటారు. ధర్మం అలాగే నిజాయితీ అనేవి వీరు నమ్మే సిద్ధాంతాలు. ఈ మంత్రాన్ని పఠించడం వలన వీరు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకుని తమ వ్యక్తిత్వాన్ని మరింత మెరుగుపరచుకునే అవకాశం ఉంది.

వృశ్చికరాశి: అక్టోబర్ 24 - నవంబర్ 22

వృశ్చికరాశి: అక్టోబర్ 24 - నవంబర్ 22

"ఓం హ్రీమ్ శ్రీమ్ లక్ష్మీభయో నమః" అనే మంత్రం ఈ రాశివారికి మంచి ఫలితాలను అందిస్తుంది. జీవితం ప్రారంభ దశలో ఈ రాశి వారు అనేక కష్టాలను ఎదుర్కొంటారు. కాబట్టి, ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా వారు ఆ కష్టాలను సులభంగానే గట్టెక్కుతారు. ఈ మంత్రం ఈ రాశివారికి అద్భుత ఫలితాలను అందిస్తుంది.

ధనూరాశి: నవంబర్ 23 - డిసెంబర్ 22

ధనూరాశి: నవంబర్ 23 - డిసెంబర్ 22

"ఓం శ్రీమ్ హ్రీమ్ శ్రీమ్ కమలే కమలలాయే ప్రసీద ప్రసీద ఓం శ్రీమ్ హ్రీమ్ శ్రీమ్ మహాలక్ష్మయే నమః" అనే మంత్రాన్ని పఠించడం ద్వారా ఈ రాశివారు ఆశించిన ఫలితాలను పొందవచ్చు. దేవగురు బృహస్పతికి చెందిన లక్షణాలన్నీ ఈ రాశివారిలో గమనించవచ్చు. ఈ మంత్రాన్ని ఈ రాశివారు పఠిస్తే వారి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి.

మకరరాశి: డిసెంబర్ 23 - జనవరి 20

మకరరాశి: డిసెంబర్ 23 - జనవరి 20

"ఓం శ్రీన్గ్ హ్రీంగ్ క్లింగ్ అయింగ్ సౌంగ్ ఓం హ్రీంగ్ కా ఎ ఏ ల హ్రీంగ్ హ స క హ ల హ్రీంగ్ సకల హ్రీంగ్ సౌంగ్ అయింగ్ క్లింగ్ హ్రీంగ్ శ్రీన్గ్ ఓం" అనే ఈ మంత్రాన్ని ఈ రాశివారు పఠిస్తే సంపద అనేది వారిని వెతుక్కుంటూ వస్తుంది. అలాగే, ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా వీరిని అదృష్టం వరిస్తుంది.

కుంభరాశి: జాన్ 21 - ఫిబ్రవరి 18

కుంభరాశి: జాన్ 21 - ఫిబ్రవరి 18

"అయిం హ్రీమ్ శ్రీమ్ అష్టలక్ష్మియే హ్రీమ్ రిం సిద్వయే మం గ్రిహే ఆగచ్ఛగచ్ నమః స్వాహా" అనే ఈ మంత్రం ఈ రాశివారికి అద్భుత ఫలితాలను అందిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారు స్వతంత్ర వైఖరి కలిగిన వారు అలాగే పట్టుదల కలిగిన వారు. అసంపూర్ణంగా ఉండే వాటిని వీరు ఇష్టపడరు. ఈ మంత్రం వారిని తమ లక్ష్యం వైపుగా నడిపిస్తుంది. అలాగే, వారికి ప్రశాంతతనిస్తుంది.

మీనరాశి: ఫిబ్రవరి 19 - మార్చ్ 20

మీనరాశి: ఫిబ్రవరి 19 - మార్చ్ 20

"ఓం శ్రీమ్ హ్రీమ్ శ్రీమ్ కమలే కమలలాయే ప్రసీద ప్రసీద ఓం శ్రీమ్ హ్రీమ్ శ్రీమ్ మహాలక్ష్మయే నమః" అనే ఈ మంత్రం ఈ రాశివారికి ఉత్తమ ఫలితాలను అందిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారు అత్యంత సున్నిత స్వభావం కలిగిన వారు. దానం చెసే లక్షణం వీరిలో అధికంగా కనిపిస్తుంది. ఓర్పు, శ్రద్ధ అలాగే ప్రేమతో వీరు పనులను పూర్తిచేస్తారు.

English summary

Laxmi Mantras Best Suited For Zodiac Signs

Laxmi Mantras Best Suited For Zodiac Signs,Do you know that these Laxmi mantras are best suited according to each zodiac sign. These mantras will increase the luck and prosperity chances if chanted in the right way.