For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రావణుడి భార్య మండోదరికి సీతాదేవి ఎలా పుట్టింది? మండోదరి శివుడితో శృంగారం చేసింది, మరిదితో పెళ్లి

|

రావణుడి భార్యగానే మండోదరి మనందరికీ తెలుసు. కాస్త నీతినియామలున్నా క్యారెక్టర్ అని తెలుసు. ఎందుకంటే సీతను రావణుడు అపసంహరించుకుని వచ్చినప్పుడు మండోదరి ఇది తప్పని భర్తను వారించిందట. నీతిగా పరిపాలించాలని నిరంతరం పట్టుబట్టేదట.

ఇక రావణుడు యుద్ధంలో చనిపోయాక మండోదరి ఎవరిని వివాహం చేసుకుంది? విభీషణుడు లంకకు రాజుగా సింహాసనాన్ని అధిష్టించిన తర్వాత ఏం జరిగింది? మండోదరి పార్వతికి తెలియకుండా శివుడితో శృంగారం చేయడంతో ఏం జరిగింది? మండోదరి జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలు..

మహా పతివ్రత

మహా పతివ్రత

మండోదరి' రామాయణంలో రావణాసురుని భార్య. ఈమె మహా పతివ్రత. మండోదరి మాయాసురుడి కుమార్తె. రావణాసురుడు ఈమెను మోహించి అపహరించి పెళ్ళాడాడు. ఇంద్రజిత్తు ఈమెకు పుట్టిన కుమారుడు. ఈమె దేవకన్యయైన హేమకు మయునికి పుట్టింది. ఈమె తన తండ్రితో కలిసి వనంలో సంచరించే వేళలో.. వేట కోసం వెళ్లిన రావణుడు ఈమెను చూస్తాడు.

మండోదరి ఎంతో సౌందర్యం గలది

మండోదరి ఎంతో సౌందర్యం గలది

తాను అవివాహితుణ్ణి కాబట్టి తనకు మండోదరిని ఇచ్చి వివాహం జరిపించమని రావణుడు కోరుకుంటాడు. రావణుడి గుణగణాలు తెలుసుకుని మండోదరి తండ్రి మయుడు ఆమెను రావణునికిచ్చి వివాహం జరిపించాడు. తర్వాత ఆమె రావణాసురుని పట్టమహిషిగా మారింది. మండోదరి ఎంతో సౌందర్యం గలది. కేవలం బాహ్య సౌందర్యరాశి మాత్రమే గాదు మండోదరి అంతర్ సౌందర్యం కూడా గొప్పదే.

మానవత్వానికి ప్రతీక

మానవత్వానికి ప్రతీక

మండోదరి నీతిని, ధర్మాన్ని కర్తవ్యాన్ని ప్రభోధం చేయగల మనస్తత్వం గలది. శ్రీమద్రామయణంలో కొన్ని పాత్రలు మానవత్వాన్ని మరచిపోయి ప్రవర్తిస్తే మరికొన్ని పాత్రలు దానవకులానికి చెందినప్పటికి మానవత్వానికి ప్రతీకలైనాయి. లంకాధినేత రావణుని పట్టమహిషి అయిన ఈ మహారజ్ఞి అలాంటి తత్వంగల స్త్రీమూర్తి.

పాపాలు పోతాయి

పాపాలు పోతాయి

మండోదరి పేరు తలచుకుంటే చాలు పాపాలు హరించ బడతాయని పురాణాలు చెబుతున్నాయి. మండోదరి రావణుని భార్యనే కాదు. ఆమె మయుడనే గొప్ప నిర్మాణ శిల్పి కుమార్తె. మండోదరి అంటే మండనం యస్యస ఉదరం. అంటే సన్నని నడుము గలది అని అర్ధం. తెలుగులో మండోదరి అంటే భూమి వంటి పొట్ట కలది. భూమి వంటి ఉదరము అంటే సంతాన సాఫల్యత గల ఉదరము అని.

పంచకన్య

పంచకన్య

మండోదరి అహల్య, తార, సీత, ద్రౌపదితో కలిసి పంచ కన్యగా ప్రసిద్ధి చెందింది. విచిత్ర మేమిటంటే, ఈ అయిదుగురు స్త్రీలు తమ భర్తలతో ఏదో విధంగా సంబంధాలు చెడిన వారే. అహల్యని గౌతమ ఋషివెళ్ళగొట్టాడు (పర పురుష సంబంధం ఉందన్న కారణంగా), తార తన భర్త వాలి చనిపోయిన తరువాత అతని సోదరుడైన సుగ్రీవుడిని వివాహమాడింది. రాముడు చెప్పుడు మాటలు విని సీతను వెళ్లగొట్టాడు. ఇక ద్రౌపది అయిదుగురు భర్తలు ఆమెను జూదంలో ఓడి ఆమెను పోగొట్టుకున్నారు. అయితే మండోదరి మాత్రం ఒక అసురుని భార్యగా మాత్రమే తెలుసు.

పార్వతి దేవి లేకపోవటంతో శివునితో రహస్యంగా శృంగారం

పార్వతి దేవి లేకపోవటంతో శివునితో రహస్యంగా శృంగారం

ఒక పురాణం కథ ప్రకారం.. మండోదరికి ముందు ఈమె మధురగా ఉండేది. మధుర ఒకసారి కైలాస పర్వతాన్ని సందర్శించింది. ఆ సమయంలో పార్వతి దేవి లేకపోవటంతో ఆమె శివునితో రహస్యంగా రతి జరిపింది. ఆ సమయంలో శివుడి విబూది ఆమెకు అంటింది. పార్వతి వచ్చాకా ఆ విషయాన్ని గమనించి 12 సంవత్సరాలు కప్పగా బతకమని మధురకు శాపం పెట్టింది. ఆ శాపాన్ని తగ్గించమని శివుడు పార్వతిని అభ్యర్ధించాడు. అప్పుడు పార్వతి 12 సంవత్సరాల కఠిన తపస్సు తర్వాత అసలు రూపం వస్తుందని చెప్పింది.

మధుర నుంచి మండోదరిగా

మధుర నుంచి మండోదరిగా

మరోవైపు అసుర రాజు మయాసుర కుమార్తె కోసం కఠినమైన తపస్సు చేసి కూతురు కావాలనే వరాన్ని పొందాడు. ఇదే సమయంలో మధుర తపస్సు కాలం ముగిసి అసలు రూపాన్ని పొందింది. మయాసుర తపస్సు వల్ల వారికి మధుర కుమార్తెగా లభించింది. మధురకు అసుర రాజు మండోదరిగా నామకరణం చేశారు.

రావణుడు ప్రేమించి పెళ్లాడాడు

రావణుడు ప్రేమించి పెళ్లాడాడు

మాయాసుర రాజ మందిరంలో ఉన్న మండోదరిని చూసి రావణుడు ప్రేమించి పెళ్లాడాడు. రావణుడిని మంచి మార్గంలో నడిపించేందుకు ఆమె ఎంతగానో తాపత్రయపడింది. సీతను అపహరించుకుని వచ్చినప్పుడు కూడా తప్పని చెప్పింది మండోదరి. సీతను రాముని వద్దకు పంపించాలని అభ్యర్థించింది. రాముడితో తన భర్త చేసేది అధర్మ యుద్దం అని తెలిసినా.. తన భర్త గెలవాలని శుభాకాంక్షలు చెప్పి పంపింది మండోదరి.

విభీషణుడి భార్యగా మండోదరి

విభీషణుడి భార్యగా మండోదరి

రావణుణ్ణి చంపాక రాముడు లంకా నగరానికి విభీషణుణ్ణి రాజుగా చేసి న్యాయంగా పాలించమని చెప్పాడు. అంతేకాదు మండోదరిని వివాహం చేసుకుని లంకకు రాణిగా చేయాలని విభీషణుడికి సూచించాడు. విభీషణుడి భార్యగా మండోదరి నీతి మార్గం వైపు లంకా రాజ్యానికి మార్గనిర్దేశం చేసింది.

సీత మండోదరి కూతురే

సీత మండోదరి కూతురే

సీత, మండోదరి మధ్య సంబందానికీ ఒక కథ ఉంది. గ్రిత్సమడ మహర్షి దర్భ గడ్డి నుంచి పాలను తీసి కుండలో నిల్వ చేసి మంత్రాలతో శుద్ది చేశాడు. కఠినమైన తపస్సు తో లక్ష్మీ దేవిని కుమార్తెగా పొందాలనేది ఆ మహర్షి కోరిక. అయితే రావణుడు గ్రిత్సమడ మహర్షిని చంపి అతడి రక్తాన్ని పవిత్రమైన పాల కుండలో కలిపాడు.

కుండలో ఉన్న రక్తాన్ని విషం అనుకుని తాగింది

కుండలో ఉన్న రక్తాన్ని విషం అనుకుని తాగింది

ఋషులను చంపి వారి రక్తాన్ని కుండలో నిల్వ చేసుకుని తాగితే అన్ని యోగ అద్వితీయ అధికారాలు వస్తాయని రావణుడి నమ్మకం. తన భర్త ఇలా చేయడం మనస్కరించని మండోదరి ఆత్మహత్య చేసుకొవాలనుకుంది. ఈ క్రమంలో విషయం తెలియక కుండలో ఉన్న రక్తాన్ని విషం అనుకుని తాగింది. అయితే ఆమె చనిపోకపోగా.. గ్రిత్సమడ మహర్షి పాలు, ఋషుల అద్వితీయ శక్తులు అన్నీ కలిపి లక్ష్మీ అవతారంతో ఉన్న ఓ బిడ్డను కన్నది.

తన కూతురు సీతాదేవిని చూసి గుర్తుపడుతుంది

తన కూతురు సీతాదేవిని చూసి గుర్తుపడుతుంది

ఆమె కంగారుగా ఆ బిడ్డను బంజరు భూమిలో పాతిపెట్టింది. ఆ తర్వాత ఆ బిడ్డ మిథిలా రాజు జనక మహారాజుకు దొరికింది. ఆమెయే శ్రీరాముడి భార్య సీతాదేవి అట. రావణుడు సీతను అపహరించి లంకకు తెచ్చినపుడు మండోదరి తన కుమార్తెను గుర్తుపట్టి, రావణుడికి కాలం చెల్లిందని తెలుసుకుంటుంది.

Image Source

English summary

lesser known facts about raavanas wife mandodari

lesser known facts about raavanas wife mandodari
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more