For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మనలో ఉత్తేజాన్ని నింపే ఆంజనేయుడి గొప్ప లక్షణాలు

By Swathi
|

హనుమంతుడు, హనుమాన్, ఆంజనేయుడు ఇలా రకరకాల పేర్లు కలిగాడు ఆ ఆంజనేయ స్వామి. ఏ పేరుతో పిలిచినా పలికే హనుమంతుడి భక్తులు చాలా ఎక్కువే. బలవంతుడు, శక్తి సామర్థ్యాలు చాలా ఎక్కువ కలిగిన దేవుడు హనుమంతుడు. అందుకే హనుమాన్ గురించి ఆలోచించగానే ముందుగా గుర్తొచ్చేది ఆయన బలం. అంతేకాదు హనుమంతుడంటే ధైర్యానికి మారుపేరు. అందుకే ఎన్నో గొప్ప గుణాలు కలిగిన హనుమంతుడి నుంచి మనం నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఎన్నో ఉన్నాయి.

READ MORE: దేవుడికి పూలు ఎందుకు సమర్పించాలి ? పూలకున్న ప్రాధాన్యతేంటి ? READ MORE: దేవుడికి పూలు ఎందుకు సమర్పించాలి ? పూలకున్న ప్రాధాన్యతేంటి ?

ఆంజనేయుడిని ఎక్కువగా పూజించడానికి ముఖ్య కారణం.. అతని నిజాయితీ, మానవత్వం, బలం, జ్ఞానం, నిజమైన భక్తిని కలిగి ఉండటమే. హనుమంతుడికి ఉన్న భక్తి పారవశ్యం ఎవరిలోనూ చూడలేం. అంతటి గొప్ప భక్తిని సీతారామ లక్ష్మణులపై ఆంజనేయుడు చూపిస్తాడు. అంతేకాదు పిల్లలు, యువతరాన్ని చాలా ఇన్స్పైర్ చేసే గొప్ప దైవం హనుమంతుడు. ఇంతటి గొప్ప గుణాలు కలిగి ఉన్న ఆంజనేయ స్వామి నుంచి మనం నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలేంటో ఇప్పుడు చూద్దాం..

బలం, వినయం

బలం, వినయం

మనందరికి తెలుసు హనుమంతుడి బలానికి ప్రతీక. కానీ ఇప్పటికీ.. హనుమంతుడంటే.. రామ భక్తుడే. ఇది మనం నేర్చుకోవాల్సిన గొప్ప సందేశం. ఎందుకంటే.. మన చేతుల్లో పవర్ ఉందంటే.. మనలోని వినయాన్ని కోల్పోతాం. కానీ.. నిజాయితీగా ఉండే వాళ్లు.. ఎంత గొప్ప స్థానంలో ఉన్నా.. వినయ, విధేయతల్లో ఎలాంటి మార్పు లేకుండా.. సాధారణంగా ఉండటమే గొప్ప లక్షణం. అలాంటి గొప్ప నీతిని హనుమంతుడి ద్వారా మనం నేర్చుకోవాలి.

ధైర్యం

ధైర్యం

శత్రువులతో పోరాడాల్సి వచ్చినప్పుడు హనుమంతుడు నిజమైన ధైర్యాన్ని చూపిస్తాడు. తన కంటే వందరెట్లు బలవంతుడైనా.. తనలోని ధైర్యాన్ని మాత్రం కోల్పోడు ఆంజనేయ స్వామి. ఈ గొప్ప లక్షణాన్ని తన భక్తులందరూ అలవరుచుకోవాలని సూచిస్తాడు.

లొంగిపోవడం

లొంగిపోవడం

నిజాయితీగా లొంగిపోవడం అనేది.. జ్ఞానోదయానికి అసలు రహస్యం. తాను ఎంత గొప్ప వ్యక్తి అయినా.. తనను తాను శ్రీరామ చంద్రుడికి అర్పించుకున్న గొప్ప భక్తుడు ఆంజనేయుడు. నిజాయితీగా ఆ తన దైవానికి లొంగిపోయినప్పుడే మనలోని అహం నాశనమవుతుంది.

సహాయ గుణం

సహాయ గుణం

తన చుట్టూ ఉన్నవాళ్లకు సహాయం చేసే గొప్ప గుణం హనుమంతుడిలో ఉంది. మనందరికీ తెలుసు.. అత్యంత బలగం కలిగిన రావణ లంకకు వెళ్లి.. వాళ్లతో పోరాడిన మహోన్నత భక్తుడు ఆంజనేయుడు.

సంధి

సంధి

శ్రీరామ చంద్రుడు, సుగ్రీవుని మధ్య సంధి కుదర్చడంలో.. హనుమంతుడు ప్రత్యేక పాత్ర పోషించాడు. ప్రస్తుత రోజుల్లో సంధి కుదిరించే లక్షణాలు కలిగి ఉండటం వల్ల మనం ఉన్నత స్థానాలకు చేరవచ్చు.

నిలకడ స్వభావం

నిలకడ స్వభావం

హనుమంతుడు సముద్రాలు దాటి లంక చేరుకున్నారు. ఈ గొప్ప కార్యం ద్వారా అతని ఓర్పు, నిలకడ స్వభావాన్ని తెలుసుకోవచ్చు. తనకు ఇచ్చిన బాధ్యత నెరవేర్చడానికి హనుమంతుడు ఎన్ని కష్టాలనైనా ఓర్పుతో ఓర్చుకునే గొప్ప లక్షణం ఉంది.

ఇది హనుమంతుడి నుంచి మనం నేర్చుకోవాల్సిన గొప్ప లక్షణాలు.

English summary

Life Lessons To Learn From Lord Hanuman

Life Lessons To Learn From Lord Hanuman. The first thing that comes to your mind when you think of Lord Hanuman is strength; immense strength! And when we think of Hanuman, we tend to feel courageous.
Desktop Bottom Promotion