For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నవంబర్ నెలలో మన దేశంలో జరుపుకునే పండుగల గురించి తెలుసా..

|

మన దేశంలో నవంబర్ నెలకు చాలా ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే ఈ నెలలో భారతదేశ వ్యాప్తంగా శీతాకాలం ప్రారంభమవుతుంది. ఈనెలలో ప్రారంభమైన చల్లని వాతావరణం దాదాపు మూడు నెలల వరకు కొనసాగుతుంది. అదొక్కటే కాదు ఇదే నెలలో విభిన్న పండుగలు కూడా ఘనంగా జరుగుతాయి.

Indian Festivals

దేశంలోని ప్రతి చోట వారి స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో పాటు వివిధ మతాలకు చెందిన వారు వేడుకలను జరుపుకుంటారు. ఈ సందర్భంగా నవంబర్ నెలలో జరుపుకోబోయే ముఖ్యమైన పండుగల గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం.

హంపి ఫెస్టివల్

హంపి ఫెస్టివల్

ఈ హంపి ఫెస్టివల్ ను విజయ్ ఉత్సవ్ అని కూడా పిలుస్తారు. ఈ ఫెస్టివల్ కర్నాటకలో ప్రతి సంవత్సరం నవంబర్ మొదటి వారంలో ఘనంగా జరుపుతారు. ఈ పండుగను తిలకించేందుకు ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు పెద్దఎత్తున తరలివస్తారు. ఈ ఉత్సవంలో తోలుబొమ్మ ప్రదర్శనలు, నాటకం, నృత్యం, సాంప్రదాయ సంగీతం, ఆచారాలు మరియు మరెన్నో చూడవచ్చు. ఇవి పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తాయి. చేతితో తయారు చేసిన అనేక వస్తువులను విక్రయించే వివిధ స్టాల్స్ నుండి షాపింగ్ చేయవచ్చు. సాయంత్రం సమయంలో, ప్రేక్షకులను అలరించడానికి లైట్ మరియు మ్యూజిక్ షో కూడా ఏర్పాటు చేస్తారు.

రాన్ ఉత్సవం..

రాన్ ఉత్సవం..

ఈ రాన్ ఉత్సవాన్ని గుజరాత్ రాష్ట్రంలో జరుపుకుంటారు. ఈ ఉత్సవంలో సంగీతం, నృత్యం, అడ్వెంచర్ స్పోర్ట్స్, హస్తకళల రూపాలు, ఫుడ్ స్టాల్స్, స్థానిక విహారయాత్రలతో పాటు మరెన్నో ఉంటాయి. రాత్రి వేళలో ఎడారిలో రంగు రంగుల ప్రాథమిక గుడారాలను ఏర్పాటు చేసి ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు. ఈ ఏడాది ఈ ఉత్సవం అక్టోబర్ 28వ తేదీన ప్రారంభమైంది. ఇది ఫిబ్రవరి 23 వరకు కొనసాగుతుంది. ఈ పండుగను తిలకించేందుకు పౌర్ణమి రాత్రులు ఉత్తమమైనవి.

ఇంటర్నేషనల్ యోగా మరియు సంగీత ఉత్సవం..

ఇంటర్నేషనల్ యోగా మరియు సంగీత ఉత్సవం..

దేశ యోగా రాజధాని రీశిక్ష్ లో ఈ పండుగను జరుపుకుంటారు. ఈ ఉత్సవాన్ని 2008లో నాడా యోగా / పాఠశాలలో మొదటిసారి జరుపుకున్నారు. ఈ ఉత్సవంలో పాల్గొనడానికి ప్రపంచవ్యాప్తంగా యోగా నిపుణులు వస్తారు. అలాగే, ఈ ఉత్సవంలో ఆయుర్వేద వైద్యులు, ఉపాధ్యాయులు, అనేక మంది తత్వవేత్తలు మరియు సంగీతకారులు పాల్గొంటారు. సాయంత్రం వేళలో ప్రజలు ఈ పండుగను ఆస్వాదించడానికి శాస్త్రీయ సంగీత కచేరీని నిర్వహిస్తారు. ఈ పండుగ తేదీలు ఇంకా నిర్ధారించబడలేదు.

వంగల పండుగ

వంగల పండుగ

వంగల పండుగ ఒక రకమైన పంట. దీనిని మేఘాలయ వంటి ప్రాంతాల్లో జరుపుకుంటారు. ఈ పండుగను 100 డ్రమ్ ఫెస్టివల్ అని కూడా అంటారు. ప్రజలు ఈ పండుగను డ్రమ్స్ కొట్టడం, కొమ్ములు కొట్టడం మరియు ఇతర ఆచారాలు చేయడం ద్వారా జరుపుకుంటారు. ఇది మాత్రమే కాదు, చేనేత ప్రదర్శన, సంగీతం మరియు నృత్య పోటీ, వంట పోటీ మరియు హస్తకళా వస్తువుల స్టాళ్లను ఏర్పాటు చేస్తారు. ఈ పండుగను 8 నవంబర్ 2019న జరుపుకుంటారు.ఈ పండుగను ఆస్వాదించడానికి ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు వస్తారు.

మత్స్య ఉత్సవం

మత్స్య ఉత్సవం

రాజస్థాన్ అద్భుతమైన చరిత్రతో సగర్వంగా నిలబడి ఉన్నందున వారసత్వ భూమిగా చెప్పబడింది. కానీ రాజస్థాన్ సందర్శించడానికి గొప్ప ప్రదేశంగా మారే మరో విషయం ఉంది. అదేంటంటే మత్స్య పండుగ. ఈ సంవత్సరం మత్స్య పండుగ నవంబర్ 25 నుండి 26వ తేదీ వరకు జరుపుకుంటారు. ఈ పండుగను ప్రైడ్ ఆఫ్ అల్వార్ అని పిలుస్తారు. ఈ పండుగను అల్వార్లో జరుపుకుంటారు. ఇది చిన్నది ఈ ఉత్సవం ఆచార కళలు, అంశాలు, క్రీడలు మరియు ప్రదర్శించడానికి ఒక వేదికను అందిస్తుంది. ఈ ఉత్సవంలోనూ జానపద నృత్యం, సాంస్కృతిక ప్రదర్శనలు, ఆటల పోటీలు, హాట్ ఎయిర్ బెలూన్ రైడ్‌లు, కామెడీ ప్రదర్శనలు మరియు సంగీత ప్రదర్శన కూడా ఉన్నాయి.

పుష్కర్ క్యామెల్ ఫెయిర్..

పుష్కర్ క్యామెల్ ఫెయిర్..

పుష్కర్‌ క్యామెల్ ఫెయిర్ ను ఒంటె ప్రదేశం అని పిలుస్తారు. ఇది ఎక్కువగా రాజస్థాన్‌లో ఎడారి ప్రాంతం. పుష్కర్ క్యామెల్ ఫెయిర్ సుమారు 30,000 ఒంటెలను వాణిజ్య ప్రయోజనాల కోసం ప్రదర్శిస్తోంది. ఈ ఉత్సవంలో ఒంటె రేసు మరియు ఒంటె పరేడ్ కూడా ఉంటాయి. ఈ ఉత్సవంలో బెలూన్ వేడుక కూడా ఉంటుంది. ఈ వేడుకను చూడటానికి ప్రతి సంవత్సరం పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తారు. ఈ ఉత్సవంలో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు పాల్గొంటారు. ఈ సంవత్సరం పండుగ నవంబర్ 4వ తేదీ నుండి నవంబర్ 12వ తేదీ వరకు జరుపుకోనున్నారు.

ఇండియన్ సర్ఫ్ ఫెస్టివల్..

ఇండియన్ సర్ఫ్ ఫెస్టివల్..

ఈ ఫెస్టివల్ ను ఒడిశా రాష్ట్రంలో జరుపుకుంటారు. సర్ఫింగ్ ఈవెంట్లలో ఇది అతిపెద్దది. ఈ సంవత్సరం ఈ పండుగను నవంబర్ 12 నుండి 14వ తేదీ వరకు జరుపుకోనున్నారు. ఈ పండుగ ఉదయం యోగాతో మొదలై సర్ఫింగ్ పోటీతో ముందుకు సాగుతుంది. ఈ పండుగలో బిగినర్స్ సర్ఫింగ్ నేర్చుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా సర్ఫర్లు ఈ పండుగలో పాల్గొని వారి సత్తా చాటడానికి ఉత్సాహంగా వస్తారు. రాత్రి సమయంలో పాల్గొనేవారు సంగీతం మరియు నృత్య ప్రదర్శనలను ఆస్వాదించడానికి వస్తారు. పండుగలో ఫోటోగ్రాఫర్‌లు అందమైన చిత్రాలను కూడా క్లిక్ చేయవచ్చు.

గురు నానక్ జయంతి..

గురు నానక్ జయంతి..

సిక్కుల మొదటి గురువు గురు నానక్ పుట్టినరోజును గురు నానక్ జయంతిగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం ఈ పండుగను నవంబర్ 12వ తేదీన జరుపుకుంటారు. ఈ సందర్భంగా అమృత్సర్‌లోని బంగారు ఆలయాన్ని దీపాలతో అలంకరించి పవిత్ర గ్రంథాన్ని ఆలయం ఆధీనంలో తీసుకుంటారు. అనేక మంది సంగీతకారులతో పాటు ప్రజలు ఈ పండుగను జరుపుకుంటారు. ఈ పండుగకు సిక్కు సమాజ జీవితంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది.

ఇండియన్ ఆర్ట్ ఫెస్టివల్..

ఇండియన్ ఆర్ట్ ఫెస్టివల్..

ఈ పండుగను ప్రతి సంవత్సరం రెండుసార్లు జరుపుకుంటార. నవంబర్ నెలలో దేశ రాజధాని ఢిల్లీలో జరుపుకుంటారు. అలాగే ఆర్థిక రాజధాని ముంబైలో జనవరి నెలలో జరుపుకుంటారు. ఈ సంవత్సరం ఈ పండుగను నవంబర్ 14 నుండి నవంబర్ 17వ తేదీ వరకు జరుపుకుంటారు. 2011లో సంవత్సరంలో ప్రారంభమైన ఈ పండుగ కళాకారులు, ఆర్ట్ డీలర్లు, ఆర్కిటెక్చర్స్, ఇంటీరియర్ డిజైనర్లు మరియు ఆర్ట్ కొనుగోలు దారులకు ఒక వేదిక లాగా ఉపయోగపడుతుంది. ఈ ఉత్సవంలో సెమినార్లు, ఆర్ట్ షోలు, కలెక్షన్ షోలు, ట్రేడ్ మరియు మరెన్నో ఉన్నాయి. ఈ పండుగ యొక్క లక్ష్యం ప్రజలలో మరియు ప్రపంచవ్యాప్తంగా కళను ప్రోత్సహించడం.

English summary

List Of Indian Festivals In The Month Of November 2019

India is known as the land of festivals, culture and traditions. Here are the list of indian festivals celebrated in the month of november 2019. Take a look
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more