For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  అయ్యప్పస్వామి: విష్ణుమూర్తి మరియు పరమశివుడి కొడుకు ఎలా అయ్యాడు, అద్భుత రహస్యం

  |

  మీరెప్పుడన్నా పరమశివుడు మరియు విష్ణుమూర్తులకి పుట్టిన కొడుకు గూర్చి ఆలోచించారా? అవును, హిందూమతంలో ఇంకా గొప్పగా పూజించబడే విష్ణుమూర్తి కొడుకుకి శివుడు తండ్రి. ప్రతి ఏడాది భక్తులు ఆయన ప్రదేశానికి యాత్రగా వెళ్ళి తమ ప్రార్థనలు చేస్తారు. ఈ తీర్థస్థలం కేరళలో ఉంది మరియు ఇక్కడికి ప్రతి సంవత్సరం 41 రోజుల కఠిన దీక్ష తర్వాత లక్షలాది భక్తులు వస్తారు. అవును మీరు సరిగానే విన్నారు, మేము శబరిమల అయ్యప్ప స్వామి గురించే మాట్లాడుతున్నాం.

  అయ్యప్పస్వామి పరమశివుడు మరియు మోహినిల (విష్ణుమూర్తి స్త్రీరూపం) కలయిక వల్ల జన్మించాడు. ఆయన బ్రహ్మవరం పొంది కల్లోలం సృష్టిస్తున్న మహిషి అనే రాక్షసిని వధించటానికి పుట్టాడు. అయ్యప్పస్వామిని మణికంఠ అని కూడా అంటారు.ఆయనని మహారాజు రాజశేఖరుడు దత్తతచేసుకుని పెంచుతాడు.

  Lord Ayyappan Story | Son Of Vishnu & Shiva | Sabarimala Ayyappan

  అయ్యప్పస్వామి ఆజన్మ బ్రహ్మచారిగా చెప్తారు, అందుకని గుర్తుగా ఆయన ఒక యోగాసనంలో కూర్చొని తన మెడ చుట్టూ ఒక రత్నాన్ని ధరించి ఉంటారు. ఈ అయ్యప్ప ఆలయం శబరిమలలో ఉంది, అక్కడే ఆయన జీవితం గడిపారు.ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధమైన తీర్థస్థలాలలో ఒకటి, ఇక్కడ భక్తులు అయ్యప్పస్వామి తనని పూజించటానికి పెట్టిన నియమాలన్నీ పాటించి, పూజించటానికి వచ్చి తమ కోరికలన్నీ తీర్చుకుంటారు.

  కానీ ఇద్దరు పురుష దేవతలకి పుట్టిన ఈ దేవుడి రహస్యం ఏమిటి? తెలుసుకోవడానికి చదవండి.

  మహిషి ; రాక్షసి

  మహిషి ; రాక్షసి

  దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించాక, అతని సోదరి మహిషి ఆగ్రహించి, తన సోదరుడి చావుకి పగ తీర్చుకోవాలనుకుంటుంది. చాలాకాలం తపస్సు చేసి బ్రహ్మను మెప్పించింది. ఒక్క శివకేశవుల కొడుకుకి తప్ప మరే ఇతర స్త్రీపురుషుల చేతిలో చావలేని విధంగా వరం కోరింది. ఇద్దరు పురుషుల కలయిక వలన బిడ్డ పుట్టడం అసాధ్యం కాబట్టి మహిషి ఆ విధంగా తనకి ఎన్నటికీ చావులేదని భావించింది. అలా ఆమె ప్రపంచంలో ప్రజల జీవితాలలో కల్లోలం సృష్టించింది.

  పరమశివుడు మరియు విష్ణుమూర్తిల కలయిక

  పరమశివుడు మరియు విష్ణుమూర్తిల కలయిక

  అందరు దేవతలు ఈ రాక్షసి బారి నుంచి రక్షణ కోసం విష్ణుమూర్తిని,శివుడ్ని సంప్రదించారు. అప్పుడు విష్ణుమూర్తి ఒక పథకాన్ని వివరించాడు. విష్ణుమూర్తి స్త్రీ రూపం మోహినిగా అవతారం ఎత్తి సముద్రమథనం సమయంలో అమృతాన్ని రాక్షసులకి దక్కకుండా కాపాడాడు. అందుకని మరోసారి ఆయన మోహిని రూపం ఎత్తితే, శివునితో పెళ్ళాడి, కలిగే బిడ్డ దుర్గాదేవి శక్తులతో మహిషిని సంహరించవచ్చు.

  యువరాజు మణికంఠ

  యువరాజు మణికంఠ

  అయ్యప్ప పుట్టిన తర్వాత అతని దేవతలైన తల్లిదండ్రులు తనకి ఒక బంగారు గంట (మణి)ని మెడకి (కంఠ) కట్టి పంపానది తీరంలో వదిలివేస్తారు. పిల్లల్లేని మహారాజు రాజశేఖరుడు నది దాటి వెళ్తూ ఈ బాబును చూసాడు. మణికంఠను దత్తతు చేసుకుని తన సొంత కొడుకులా పెంచాడు. తర్వాత ఆయనకి సొంతకొడుకు కలిగినా మణికంఠనే తన వారసుడు కావాలని భావించాడు. మహారాణికి మాత్రం ఆమె సొంతకొడుకే యువరాజు కావాలని ఆశించింది. అందుకని తనకి వ్యాధి ఉన్నదని నటించి, మణికంఠను చంపాలని ప్రయత్నించింది.ఆమె సూచనల ప్రకారం వైద్యుడు మహారాణి కోలుకోవాలంటే పులిపాలు కావాలని చెప్తాడు. అందుకని మణికంఠ రాణికి పాలు తేవడానికి వెళ్తాడు.

  అయ్యప్ప మహిషిని చంపేస్తాడు

  అయ్యప్ప మహిషిని చంపేస్తాడు

  పులి నుంచి పాలు తేవడానికి వెళ్ళేటప్పుడు మణికంఠకి రాక్షసి మహిషి ఎదురుపడుతుంది. పెద్ద పోరాటం తర్వాత మణికంఠ మహిషిని అఝుత నదీతీరం వద్ద చంపేస్తాడు. తర్వాత పులిపాలను తేవడానికి వెళ్ళి మహాదేవుడ్ని అక్కడ కలిసి తన జన్మరహస్యం తెలుసుకుంటాడు.

  శబరిమలలో అయ్యప్పస్వామి

  శబరిమలలో అయ్యప్పస్వామి

  మణికంఠ తిరిగొచ్చాక, మహారాజుకి అంతకుముందే అతనిపై జరిగిన కుట్ర తెలిసి ఉండటంతో,ఆయనని క్షమించమని కోరతాడు మరియు తనతోనే ఉండమంటాడు. కానీ మణికంఠ రాజుని ఓదార్చి శబరిమలలో తనకి ఆలయం నిర్మించమని, అలా తన వద్దనే అయ్యప్పస్వామిలా ఉంటానని చెప్తాడు. అలా ఆలయం కట్టబడింది, ప్రజలు అక్కడకి వెళ్ళటానికి కఠినదీక్ష పాటించాలి. అయ్యప్పస్వామి బ్రహ్మచారి కాబట్టి, 10-50ఏళ్ళ మధ్య స్త్రీలు ఆ గుడిలోకి వెళ్ళరాదు. భక్తులు తమ నైవేద్యాలను అందించాక, 18మెట్లను వెనక్కి దిగుతూ అయ్యప్పను వస్తారు. అయ్యప్పస్వామి తన భక్తుల కోరికలన్నీ అలా తీరుస్తాడంటారు.

  English summary

  Lord Ayyappan Story | Son Of Vishnu & Shiva | Sabarimala Ayyappan

  Lord Ayyappan is said to have been born from the union of Lord Shiva with Mohini (female form of Lord Vishnu). He was born to slay a demoness known as Mahishi who had been creating havoc after receiving a boon from Lord Brahma. Lord Ayyappan is also known as Manikantan. He was adopted and raised by king Rajashekhara.
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more