గణేషుడి శాపం కృష్ణుడిని కూడా అతన్ని పూజించేలా చేస్తుంది

By: DEEPTHI T A S
Subscribe to Boldsky

కృష్ణుడికి గణేషుడి శాపం కథ అందరికన్నా జ్ఞానంలో మిన్న అని కీర్తింపబడే గణపతి విఘ్నాలను తొలగిస్తాడని పేరు. హిందూదేవతలలో ఎక్కువగా పూజించబడే ఈ దేవుడు, ప్రతి పనికి ముందు పూజించబడతాడు. అందరికీ తెలిసిన కథ ప్రకారం గణేషుడు, పరమశివుడు లోనికి రాకుండా అమ్మవారి ఇంటిని కాపలా కాసాడని. ఇది కోపానికి దారితీసి శివుడు గణపతి తలను నరికేసాడు. కానీ కొన్ని కథలప్రకారం గణేషుడికి కూడా కొన్నిసార్లు కోపం అదుపు తప్పింది.

ఎందుకు వినాయకుడికి ఏనుగు శిరస్సు ఉంది?

చంద్రుడికి గణపతి శాపం గణపతి చంద్రుడ్ని ఎలా శపించాడో గుర్తుందా? వినాయకుడు కృష్ణుడ్ని కూడా శపించాడని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు! శ్యమంతక మణి కథలో గణేషుడి శాపం ఎంత శక్తివంతమో తెలుస్తుంది. ఆ కథ ఏమంటే...

శ్రీకృష్ణుడు, సత్రాజిత్తు రాజు మరియు శ్యమంతక మణి

శ్రీకృష్ణుడు, సత్రాజిత్తు రాజు మరియు శ్యమంతక మణి

శ్రీకృష్ణుడి నివాసస్థలం ద్వారకలో సూర్యుడి భక్తుడైన రాజు సత్రాజిత్తు ఉండేవాడు. ఆయన్ని పూజించటం వలన, సూర్యుడు అద్భుతమైన రత్నం శ్యమంతకాన్ని సత్రాజిత్తుకి బహూకరించాడు. ఎవరైతే ఆ మణిని నిరంతరం పూజిస్తారో వారి సంపదలు రెట్టింపవుతూనే ఉంటాయి.

కృష్ణుడు శ్యమంతకమణిని ఆశిస్తాడు

కృష్ణుడు శ్యమంతకమణిని ఆశిస్తాడు

ఒకరోజు, శ్రీకృష్ణుడు కూడా ఈ అద్భుతమైన మణిని చూడటానికి వచ్చాడు. సత్రాజిత్తు అనుమానంతో మణి సంరక్షణ బాధ్యత ఇవ్వకుండా దాచిపెట్టాడు. కొంతకాలం తర్వాత, పౌర్ణమికి నాలుగోరోజున శ్రీకృష్ణుడి భార్య రుక్మిణి ఆయనకు పాయసం వండిపెట్టింది. అది తింటూ కృష్ణుడు చంద్రుడి ప్రతిబింబాన్ని పాలల్లో చూసి, గణేషుడి శాపం వలన తను కూడా నింద పడాల్సి వస్తుందని గ్రహించాడు. ఎవరైతే చవితినాడు చంద్రుడ్ని చూస్తారో వారు నిందలపాలవుతారని గణపతి శాపం.

ప్రసేనుడు వేటకి వెళ్తాడు

ప్రసేనుడు వేటకి వెళ్తాడు

అదేసమయంలో, ఆరోజునే సత్రాజిత్తు సోదరుడు ప్రసేనుడు శ్యమంతకమణిని తీసుకుని వేటకు వెళ్తాడు. వేట సమయంలో సింహం అతనిపై దాడిచేసి చంపేసి శ్యమంతకమణిని మాంసం అనుకుంటుంది. తన గుహలోకి ఆ మణిని తీసుకుపోతుంది.

కృష్ణుడు శ్యమంతకాన్ని వెతుకుతాడు

కృష్ణుడు శ్యమంతకాన్ని వెతుకుతాడు

జాంబవంతుడు(సీతని రక్షించడానికి రాముడికి సాయపడ్డవాడు) అనే ఎలుగుబంటి సింహాన్ని చంపేసి ఆ రత్నాన్ని తన కూతురు జాంబవతికి బహుమతిగా ఇస్తాడు. ప్రసేనుడు వేటనుంచి తిరిగిరాకపోవటంతో సత్రాజిత్తు శ్రీకృష్ణుడ్ని తన మణిని దొంగిలించి, తమ్ముడ్ని చంపేసాడని అనుమానిస్తాడు. ఈ నిందలతో బాధపడిన కృష్ణుడు తనే ప్రసేనుడిని వెతకడానికి వెళ్ళి గుహ ముందు అతని శవాన్ని చూస్తాడు.

కృష్ణుడు,జాంబవంతుడి మధ్య యుద్ధం

కృష్ణుడు,జాంబవంతుడి మధ్య యుద్ధం

సింహం కాలిగుర్తుల ప్రకారం కృష్ణుడు గుహలోకి వెళ్ళి జాంబవతి రత్నంతో ఆడుకోవడం చూస్తాడు. మణికోసం కూతురిపై దాడి చేయడానికి వచ్చాడేమోనని భయపడి జాంబవంతుడు కృష్ణుడితో పోరాడతాడు.28రోజులు వరుసగా పోరాడాక, జాంబవంతుడికి కృష్ణుడు మామూలు రాజు కాదని అర్థమవుతుంది. నిజంగా అతనెవరోనని అడుగుతాడు.

పవర్ ఫుల్ శక్తికి మరో రూపం వినాయకి (ఆడ గణేశుడు)

కృష్ణుడు జాంబవతిని పెళ్ళాడతాడు

కృష్ణుడు జాంబవతిని పెళ్ళాడతాడు

శ్రీకృష్ణుడు పూర్వజన్మలో తనెలా రాముడిగా పుట్టాడో, జాంబవంతుడు ఎలా సీతను రక్షించడానికి సాయపడ్డాడో గుర్తుచేస్తాడు. జాంబవంతుడికి తన తప్పు త్వరగా తెలుసుకుని,రత్నాన్ని, తన కూతురు జాంబవతిని కృష్ణుడికి అప్పగిస్తాడు. (తర్వాత ఆమె అతని 8 భార్యల్లో ఒకరైంది).

కృష్ణుడు శ్యమంతకాన్ని సత్రాజిత్తుకి అప్పగిస్తాడు

కృష్ణుడు శ్యమంతకాన్ని సత్రాజిత్తుకి అప్పగిస్తాడు

తిరిగొచ్చాక, శ్రీకృష్ణుడు నేరుగా సత్రాజిత్తు భవనానికి వెళ్ళి అతని సోదరుడి శవం మరియు శ్యమంతకమణిని అప్పగిస్తాడు. సత్రాజిత్తు తన తప్పు తెలుసుకుని క్షమాపణ కోరతాడు. కృతజ్ఞతగా తన కూతురు సత్యభామను, శ్యమంతకమణిని శ్రీకృష్ణుడికి అప్పగిస్తాడు.

కృష్ణుడు కూడా గణేషుడిని పూజిస్తాడు

కృష్ణుడు కూడా గణేషుడిని పూజిస్తాడు

గణేషుడి శాపం వలన కృష్ణుడు నిందను భరించాల్సి వచ్చింది. ఆరోజునుంచి కృష్ణుడు కూడా వినాయకుడ్ని పూజించటం మొదలుపెట్టాడు.

English summary

Lord Ganesha's curse compelled Lord Krishna to worship him

Acknowledged as the mightiest of all, Lord Ganesha, symbolizes the removal of obstacles. He is one of the most worshipped Hindu diety, and is revered before every sacred practice. It is widely known that once Lord Ganesha was being guarding his mother, and when Lord Shiva tried to enter the premises, the former stopped his own father from entering. This ensued into a duel, which saw Lord Shiva cutting off Lord Ganesha’s head. But, there are a few tales that tell of those times when even Lord Ganesha lost his cool.
Story first published: Tuesday, November 7, 2017, 8:00 [IST]
Subscribe Newsletter