మోహినితో పరమశివుని ప్రేమవ్యవహారం గురించి పార్వతీ దేవికి తెలుసా? తర్వాత ఏం చేసింది?

By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

పరమశివుడు తన అర్థాంగికి తన శరీరంలోని అర్ధభాగాన్ని ఇచ్చి అర్ధనారీశ్వరుడిలా ప్రఖ్యాతి చెందాడు. తన భార్య పట్ల అమితమైన ప్రేమను చూపించాడు. శక్తిపీఠాల ఉద్భవం వారిద్దరి ప్రేమకు ప్రతిరూపంగా నిలుస్తాయి.

అయితే, శివుడికి వేరొక ప్రేమ వ్యవహారం ఉందన్న విషయం మీరు నమ్ముతారా. తన దారిలో వచ్చిన దేన్నైనా కరిగించే శక్తి అందానికి ఉందన్న విషయం అందరికీ తెలిసినదే. అయితే, అందానికి దేవుళ్ళు కూడా దాసులేనా? వారిలో కూడా అందానికి బానిసయ్యే బలహీనత ఉందా?

ఈ వ్యాసాన్ని చదివి తెలుసుకోండి.

Lord Shiva Had An Unforgettable Love Affair And Parvati Knew All About

అసలీ మోహిని ఎవరు. ఆమె ఎలా వచ్చింది?

భస్మాసురుడనే రాక్షసుడు ఎవరి తలపై చేతులు పెడతాడో వారు భస్మం అయిపోతారు. దాంతో, భస్మాసురుడిని ఎవరూ ఏమీ చేయలేకపోతున్నారు. స్వయంగా భోళాశంకరుడే భస్మాసురుడికి ఈ వరాన్ని అందించాడు. భస్మాసురుడు ఈ వరంతో సాక్షాత్తూ పరమశివుడినే అంతం చేయాలని ప్రయత్నిస్తాడు. అప్పుడే, మహావిష్ణువు మోహినీ అవతారమెత్తి భస్మాసురుడిని వలలో వేసుకుంటాడు. మోహినీ రూపంలోనున్న విష్ణుమూర్తి తన అందానికి బానిసైన భస్మాసురుడి చేత నాట్యం చేయించి అందులో భాగంగా భస్మాసురుడు తన చేతిని తన తలపైనే పెట్టుకునేలా చేసి ఆ రాక్షసుడిని అంతం చేస్తాడు.

Lord Shiva Had An Unforgettable Love Affair And Parvati Knew All About

Image Source: detechter.com

ఇలా జరిగిన వెంటనే, దేవుళ్లందరూ విష్ణుమూర్తిని అలాగే మోహినీ అందాన్ని స్తుతించడం మొదలుపెడతారు. విష్ణుమూర్తి సహకారానికి సంతోషించిన శివుడు పార్వతితో సహా అక్కడకు విచ్చేసి మరొకసారి మోహిని రూపాన్ని ధరించమని విష్ణుమూర్తిని వేడుకుంటాడు. మోహినిని చూడగానే ఆమెకు ఆకర్షితుడవుతాడు పరమశివుడు. ఇప్పుడే, ఎవ్వరూ ఊహించనిది చోటుచేసుకుంది.

Lord Shiva Had An Unforgettable Love Affair And Parvati Knew All About

శివుడిలో రేగిన యాదృచ్చికమైన కోరిక వలన మోహినిని శివుడు వెంటాడి తన కౌగిలిలో బంధించాడు. ఈ సంఘటనను చూస్తున్న పార్వతీదేవి శివుడి ప్రవర్తనకు కలత చెంది సిగ్గుతో తలవంచుకుంది. అలా మోహిని, శివుని కలయికలో మహా సాష్టుడు జన్మిస్తాడు.

Lord Shiva Had An Unforgettable Love Affair And Parvati Knew All About

ఈ కథలోని ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ వ్యవహారం మొత్తం పార్వతీ దేవి కళ్ళముందరే జరిగింది. తాను చూసిన దాని గురించి పార్వతిదేవి నమ్మలేకపోయింది. అప్పటి నుంచి తన భర్తను అదుపులో ఉంచేందుకు నియంత్రణ రేఖను గీసింది.

Lord Shiva Had An Unforgettable Love Affair And Parvati Knew All About

ఈ సంఘటన ద్వారా ప్రేమ అనేది అనంతమని అలాగే శాశ్వతమని తెలుస్తోంది. అలాగే, కామానికి దేవుళ్ళను కూడా దారిమార్చే శక్తి ఉందని అర్థం అవుతోంది.

English summary

Lord Shiva Had An Unforgettable Love Affair And Parvati Knew All About

Lord Shiva Had An Unforgettable Love Affair And Parvati Knew All About. This Is Who Mohini Really Was
Subscribe Newsletter