మహా శివుడు పార్వతికి పెళ్ళైన తర్వాత యోగ నేర్పించాడు. అలా యోగా మొదట ఆవిర్భవించింది అని మీకు తెలుసా?

By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

ప్రేమిస్తే పార్వతిలా ప్రేమించాలి. భర్త అంటే ఆ మహా శివుడిలా ఉండాలి. ఈ రెండు సామాన్యులకు అతి దూరంలో ఉండే అంశాలు. కానీ, ఎప్పుడైతే మనుష్యులు ఈ దారిలో ప్రయాణిస్తారో అప్పుడు వారి సంసార జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. ఇలా ఎందుకు అంటారంటే, కైలాష్ పర్వతం లో శివ పార్వతులు ఇద్దరూ మార్మిక ప్రేమ ఆధారంగా నృత్యం చేయడం ప్రారంభించారు. ' నాకు ', ' నీకు ' ,' అతడు ', ' ఆమె ' అనే మనుగడలో ఉన్న వ్యత్యాసాలు పూర్తిగా ఆగిపోయాయి. రిషి పతంజలి ఏమని చెప్పాడంటే " యుజ్యతే అనేనా ఇతి యోగః " ( యోగ లోకి వచ్చి ఇది చేరుతుంది).

కానీ ఇది ఎలా జరిగింది - శివ పార్వతులు ఇద్దరూ విశ్వంలోకి ఎలా చేరారు ?

Lord Shiva Taught Yoga to Parvati After Marriage

విశ్వంలో ఉద్భవించే శబ్దం ద్వారా సన్యాసిగా ఉన్న శివుడు సతి పై ప్రేమలో పడ్డాడు. ఆమె దక్షరాజు యొక్క కుమార్తె. చివరికి ఆమె ని ఎట్టకేలకు వివాహం చేసుకున్నారు. ఈ ప్రేమను ఎవరైనా, ఎప్పుడైనా వివరించడానికి గనుక ప్రయత్నిస్తే ఆ వివరణలో ఎక్కడో ఎదో లోపం ఉన్నట్లు తెలుస్తుంది. ఎవరైనా మనకు అనుభవం లేని విషయాల గురించి, మన ఊహకు అందని విషయాల గురించి వివరణ ఇవ్వాలంటే అంత సులభమైన విషయం కాదు. కాబట్టి ఈ ప్రేమను గనుక ఒక సముద్రంతో పోల్చి చూస్తే దీని యొక్క లోతు అర్ధం చేసుకోవడం అంత సులభమైన విషయం కాదు. అలా చూసి వెళ్లిపోవడం ఉత్తమమైన మార్గం అవుతుంది.

Lord Shiva Taught Yoga to Parvati After Marriage

ఒకానొక రోజు సతి మరణించింది. ఈ వార్త శివుడిని నిలువెల్లా దహించివేసింది. శివుడు ఒక పిచ్చివాడిలా తయారయ్యారు. విద్వాంసాకారుడిగా మారారు. కానీ, అసలు జన్మించలేని దానిని ఎవరైనా ఎలా నాశనం చేయగలరు ? కాబట్టి శివుడి యొక్క కోపానికి ఈ ప్రపంచం తీవ్రమైన కోపం భారిన పడింది. అది ఈ విశ్వం పై ఎంతో విధ్వంసాన్ని సృష్టించింది.

ఇలా ఎంత జరిగినప్పటికీ కూడా శివుడికి బాధ తగ్గలేదు. దీంతో శివుడు మౌనాన్ని స్వీకరించాడు మరియు తనలో తానే మదనపడటం ప్రారంభించాడు. ఇలా చేయడం ద్వారా ఎవ్వరు ఊహించలేని మరియు మానవాతీతమైన ఒక గొప్ప శక్తితో కూడిన ఒక అంశం శివుడి ద్వారా ఉద్భవించింది. దాని పేరే యోగా.

Lord Shiva Taught Yoga to Parvati After Marriage

శివుడు తనలో తాను పడిన మానసిక వేదనకు శాశ్వతంగా తన్మయత్వాన్ని ప్రసాదించడంలో భాగంగా ఉద్భవించింది యోగా. ఇక్కడితో శివుడి యొక్క ప్రేమ కథలో ' మొదటి అధ్యాయం ' ముగిసింది. ఇప్పుడు మనం శక్తి యొక్క మరో అవతారం పార్వతి గురించి తెలుసుకోబోతున్నాం. ఈమె తన తపో శక్తి ద్వారా శివుడిని చేరింది.

వీరిద్దరూ కలిసే రోజు రాత్రి శివుడు, పార్వతి దేవికి 84 యోగాసనాల గురించి సవివరంగా చెప్పారు. ఇలా చెప్పిన తర్వాత పార్వతి దేవిని భార్యగా స్వీకరించడం జరిగింది. శివుడికి సతి పై ఉన్న ప్రేమ వల్ల అతడు యోగిగా మారాడు. కానీ, పార్వతి పై ఉన్న ప్రేమ వల్ల యోగాకు ఆది గురువుగా ఆవిర్భవించారు.

Lord Shiva Taught Yoga to Parvati After Marriage

అందువల్ల ఆ రోజు రాత్రి పార్వతి పై ఉన్న ప్రేమ వల్ల శివుడు యోగాకు ఆది గురువుగా మారారు మరియు పార్వతి అతని యొక్క మొదటి విద్యార్థిని.

వేద పరంపరలో భాగంగా యోగాని ఒక దీక్షగా భావించనట్లైతే, గురువు మొదట ప్రతి ఒక్కరికి చెప్పే పాఠం మంగళ శ్లోక. అందుకు గల కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం.

|| శ్రీ ఆది నాథ్ నమస్తు తస్మాయ్ యెనోపాదిస్తా హత్యోగవిద్య |

విభ్రాజతే ప్రాణాత్ర జ్యోగ్మరోడ్డుమీచోరాధిరోహిరీవ్్ ||

ఈ శ్లోకం యొక్క అర్ధం ఏమిటంటే, " హత యోగ విద్యకు బోధకుడిగా వ్యవహరిస్తున్న శివుడికి నమస్కరాలు. ఈయన యొక్క బోధనల ద్వారా పార్వతి ఎప్పుడు ప్రకాశించే ఒక నిచ్చెనలా మారి ఎవరైతే ఉన్నత స్థితికి చేరాలని తపిస్తారో, వారు ఈ నిచ్చెన ద్వారా రాజయోగాన్ని అనుభవిస్తారు ".

శివుడు పార్వతికి ఎంత ప్రేమతో యోగాను నేర్పించాడు అనే విషయం శ్లోకాలను గనుక చదివితే అర్ధం అవుతుంది. ప్రతి ఒక్కటి ఎంతో ' మంచిదిగా ', ' అనాదమైనదిగా ' , ' మర్యాదపూర్వకంగా ' ఉంటుంది.

Lord Shiva Taught Yoga to Parvati After Marriage

శివుడు పార్వతితో ప్రేమలో ఎంతలా మునిగిపోయారంటే, యోగ జ్ఞానాన్ని ఎవరితోనైనా పంచుకోవడానికి శివుడు పెద్దగా ఇష్టపడేవారు కాదు. అయినప్పటికీ స్త్రీల యొక్క శక్తిని ఎప్పటి కప్పుడు పెంచే విధంగా, అందుకు ఒక గుర్తుగా నిలబడే పార్వతి, మిగతా మూడు ప్రపంచలలో కష్టాలు తాండవిస్తున్నప్పుడు శాశ్వతంగా తన్మయత్వం ఉండటానికి అస్సలు ఇష్టపడలేదు.

అప్పుడు శివుడిని యోగా బోధించామని చెప్పి పార్వతీదేవి బుజ్జగించింది. ఆమె అడిగిన ప్రతిసారి శివుడు తిరష్కరించేవారు. కానీ విశ్వమాత అయిన పార్వతీదేవి స్థితి స్థాపకంగా తాను అనుకున్న విషయాన్ని వదిలిపెట్టలేదు. ఒకానొక రోజు ఇదే విషయమై ఒక సాధారణ స్త్రీ గా వెళ్లి అడిగింది. అప్పుడు శివుడు తన పక్కనే ఉన్నాడు. ఆ సమయంలో శివుడు ఎందుకు బోధించడానికి ఆసక్తి చూపించడంలేదు అనే విషయం ఆమెకు అర్ధం అయ్యింది. ఆది చాలా కష్తమైన పని. శివుడు అలా చేయలేరని తెలుసుకుంది.

Lord Shiva Taught Yoga to Parvati After Marriage

దీంతో రివర్స్ సైకాలజీ ని ఉపయోగించింది. అది సఫలికృతమయ్యింది. శివుడు మొదట విడతగా సప్త ఋషులను తన శిస్యులుగా చేర్చుకున్నాడు. సప్త ఋషులు కారణంగా 18 మంది సిద్దాలకు ఈ జ్ఞానం అందింది. ఈ 18 మంది సిద్దాల ద్వారా ఈ దైవీక జ్ఞానం ప్రపంచ నలుమూలల విస్తరించింది.

English summary

Lord Shiva Taught Yoga to Parvati After Marriage. And That’s How it First Originated

Lord Shiva Taught Yoga to Parvati After Marriage. And That’s How it First Originated,
Subscribe Newsletter