Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
Lunar Eclipse 2020 : చంద్ర గ్రహణం సమయంలో ఈ విషయాలను మరువకండి...
చంద్ర గ్రహణం సమయంలో ఏయే పనులు చేయాలి.. ఏయే పనులు చేయకూడదో తెలుసుకుందాం.
హిందూ క్యాలెండర్ ప్రకారం నవంబర్ 30వ తేదీన, కార్తీక మాసం పౌర్ణమి రోజున చివరి చంద్ర గ్రహణం ఏర్పడనుంది. ఇప్పటికే ఈ ఏడాదిలో మూడు చంద్ర గ్రహణాలు విజయవంతంగా పూర్తయ్యాయి.

ఈ గ్రహణం చివరిది కావడంతో దీనికి ఎక్కువ ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ గ్రహణం విషయంలో చాలా మందికి ఏవేవో అపొహలు ఉన్నాయి. అనేక మంది గ్రహణం అంటేనే చెడుకు సంకేతమని భావిస్తారు. ఈ సమయంలో తమ పనులన్నింటినీ వాయిదా వేసుకుంటూ ఉంటారు. అయితే మరికొందరు మాత్రం గ్రహణం వల్ల తమ వ్యాపారాలకు, ఉద్యోగాలకు, ఆరోగ్యానికి అంతా అనుకూలంగా ఉంటుందని భావిస్తారు.

అందుకే గ్రహణం సమయంలో ఎంతో ఆశతో ఎదురు చూస్తుంటారు. మరోవైపు ఈ చంద్ర గ్రహణం అసలు కంటికి కనిపించదని.. దీన్ని ఉపఛాయ చంద్ర గ్రహణం (పెనుంబ్రాల్ గ్రహణం) అని పిలుస్తారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఇది సోమవారం మధ్యాహ్నం 1:04 నుండి సాయంత్రం 5:22 గంటల వరకు ఏర్పడుతుంది. ఇదిలా ఉండగా జ్యోతిష్యశాస్త్రం ప్రకారం చంద్ర గ్రహణం సమయంలో కొన్ని పనులను అస్సలు చేయకూడదు.. మరికొన్ని పనులు తప్పకుండా చేయాలి. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

వీరిపై ప్రభావం..
ఈ చంద్ర గ్రహణం వ్రుషభం, రోహిణి నక్షత్రాన్ని ప్రభావితం చేస్తుందని.. వీటితో పాటు మిగిలిన రాశిచక్రాలపైనా ప్రభావం ఉంటుందని జ్యోతిష్యశాస్త్ర పండితులు చెబుతున్నారు. ప్రతి గ్రహణానికి సూతక్ కాలం ఉంటుందని ఈ సమయంలో మంత్రాలు జపించి ద్యానం చేయాలి. అయితే ఇప్పుడొచ్చే చంద్ర గ్రహణంలో సూతక్ కాలం ప్రభావం ఉండదు. ఎందుకంటే ఇది పెనుంబ్రాల్ గ్రహణం కాబట్టి. అందులోనూ ఇది మన దేశంలో కంటికి దాదాపు కనిపించదు.

పురాణాల ప్రకారం..
హిందూ గ్రంథాల ప్రకారం గ్రహణం సమయంలో ప్రతికూల శక్తులకు పవర్ ఎక్కువగా ఉంటుందని.. ఈ సమయంలో సూర్య, చంద్రులు బలహీనపడతారు. కాబట్టి దీని ప్రభావం మనపై కచ్చితంగా పడుతుంది.

ఏమి చేయాలంటే..
నవంబర్ 30వ తేదీన రాబోయే గ్రహణం పెద్దగా ప్రభావం చూపదు. కానీ ఈ సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోకూడదని పండితులు చెబుతున్నారు. ఒకవేళ ఆ సమయంలో ఆహారం తీసుకుంటే, తర్వాతి మూడు రోజులు ఉపవాసం ఉండాలట.

నిద్రపోకూడదు..
హిందూ శాస్త్రాల ప్రకారం చంద్ర గ్రహణం సమయంలో నిద్రించడం అనేది నిషేధించబడింది. అలాగే మీరు మీ భాగస్వామితో కలయికలో పాల్గొనకూడదు. ఈ సమయంలో రతి క్రీడ అనేది దుర్మార్గమైన చర్యగా పరిగణించబడుతుందట. ఇలా చేస్తే ప్రతికూల శక్తులను మీరు దగ్గరుండి ఆహ్వానించేనట్టే. అదే విధంగా గ్రహణం సమయంలో జంతువుల మీద (ఉదాహరణకు పెంపుడు కుక్కలపై సరదాగా కూర్చోవడం) కూర్చోవడం వంటివి చేయరాదట.

పూజలు చేయాలి..
చంద్ర గ్రహణం సమయంలో దేవుడిని జపించాలి. ఈ సమయంలో చేసే జపాల వల్ల మీకు రెట్టింపు ఫలితం వస్తుందట. ఈ సమయంలో చేసే పూజలకు విశేషమైన ఫలితం ఉంటుంది. అలాగే గ్రహణ నివారణ పూజలు చేయాలి. మీ ఇంటి గుమ్మానికి.. చాలా మంది వారి ఇళ్లలో చెట్లను లేదా మొక్కలను పెంచుకుంటూ ఉంటారు. అయితే గ్రహణం సమయంలో బ్రహ్మ దండు చెట్టును తెచ్చుకుని మీ ఇంటి గుమ్మానికి కడితే మీకు తిరుగు అనేదే ఉండదు. మీకు ఎన్ని కష్టాలున్నా తొలగిపొతాయట.

దానం చేయాలి..
చంద్ర గ్రహణం సమయంలో పేదలకు దుస్తులను లేదా ఏదైనా ఆహార వస్తువులను దానం చేయాలి. నిరుపేదలకు మీకు తోచిన విధంగా ఎంతో కొంత ఆర్థిక సహాయం చేయాలి. అలాగే గ్రహణం తర్వాత చల్లని నీటితో బట్టమీదనే స్నానం చేస్తే మంచి ఫలితాలొస్తాయట.



Click it and Unblock the Notifications