మధురాష్టకం: జగన్నాథునికి అంకితం

By: Deepti
Subscribe to Boldsky

పూరీలోని జగన్నాథస్వామి మహావిష్ణువు ఎనిమిదవ అవతారం కృష్ణుడని పూజిస్తారు. కల్పవృక్షంలోంచి వచ్చిన దుంగ నుంచి జగన్నాథుని విగ్రహం చెక్కబడింది.

గుండ్రటి కళ్లతో పలకలుగా చెక్కిన స్వామి విగ్రహ ముఖం ఎంతో చూడదగ్గది. ఈ విగ్రహానికి చేతులు, కాళ్ళు ఉండవు. దాని అర్థం అవి స్వామికి అవసరంలేదని. అన్నీ ఆయన చూడగలరు, తెలుసుకొనగలరు అని.

భక్తులకు వరాలందించటానికి ఆయనకు చేతులు అవసరం లేదు. భక్తులను చూడటానికి కాళ్ళు కూడా అవసరం లేదు. ఎందుకంటే వారి హృదయాల్లోనే ఆయన నివాసం కాబట్టి.

ఈ రోజు మేము మీకు భగవాన్ శ్రీ కృష్ణుడికై రాసిన మధురాష్టకం అందిస్తున్నాం. ఈ ఎనిమిది శ్లోకాల అష్టకం శ్రీకృష్ణునిపై రాసిన ఎంతో తీయనైన రచన.

శ్రీ వల్లభాచార్య రచించిన ఈ అష్టకం శ్రీకృష్ణుని ప్రతి రూపం ఎంత మధురమైనదో, వరదాయకమో వివరిస్తుంది. ఇక మధురాష్టకం, దాని అనువాదం చదవండి.

Madhurashtakam stotra dedicated to Lord Jagannath

వివాహం కానివారు, వివాహం ఆలస్యమయ్యే వారు ఈ 11 మంత్రాలతో శివారాధన చేస్తే...

మధురాష్టకం

అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం।

హృదయం మధురం గమనం మధురం మధురాధిపతే అఖిలం మధురం ||1||

వచనం మధురం చరితం మధురం వసనం మధురం వలితం మధురం ।

చలితం మధురం భ్రమితం మధురం మధురాధిపతే అఖిలం మధురం ||2||

వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురో పాదౌ మధురం ।

నృత్యం మధురం సఖ్యం మధురం మధురాధిపతే అఖిలం మధురం ||3||

గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం ।

రూపం మధురం తిలకం మధురం మధురాధిపతే అఖిలం మధురం ||4||

కర్ణం మధురం తరణం మధురం హరణం మధురం రమణం మధురం ।

వమితం మధురం శమితం మధురం మధురాధిపతే అఖిలం మధురం ||5||

గుంజా మధురా మాలా మధురా యమునా మధురా వీచి మధురా ।

సలిలం మధురం కమలం మధురం మధురాధిపతే అఖిలం మధురం ||6||

గోపి మధురా లీలా మధురా యుక్తం మధురం ముక్తం మధురం ।

ద్రస్తం మధురం శిష్టం మధురం మధురాధిపతే అఖిలం మధురం ||7||

గోపా మధురా గావో మధురా యస్తిర్మధురా సృష్టిర్మధురా।

దలితం మధురం ఫలితం మధురం మధురాధిపతే అఖిలం మధురం ||8||

మీ జాతకంలో దోషాలుంటే అక్షయ త్రితీయ రోజున ఈ మంత్రాలను పఠించండి..!

అనువాదం

ఓ శ్రీ కృష్ణా, నీ అధరాలు మధురమైనవి, నీ ముఖము మధురం, కళ్ళు, నవ్వు తీయనివి, నీ హృదయం, నడక, నీకు సంబంధించిన ప్రతీదీ తీయనిదే.

ఓ శ్రీకృష్ణా, నీ మాటలు, స్వభావం తీయనైనవి. నీవు ధరించిన వస్త్రాలు, నడవడి, కదలిక అన్నీ తీయనైనవే.

ఓ శ్రీ కృష్ణా, నీ వేణువు తీయనిది, నీ కాలి ధూళి కూడా మధురమైనది. నీ చేతులు, పాదాలు తీయనివి. నీ నృత్యం, నీ స్నేహం, నీ గురించి అంతటా మధురమైనదే.

ఓ శ్రీ కృష్ణా, నీ గానం, పానం మధురమే. తినడం, శయనం కూడా మధురమే. నీ తీయని రూపమే తీయనిది. నీ తిలకం, నీకు సంబంధించినది అంతా తీయనిదే.

ఓ శ్రీ కృష్ణా, నీ చేతలు, నీ శక్తి, దొంగతనం, రాసలీల అన్నీ తీయనివే. నీ అతిశయం, విశ్రాంతి, నీకు సంబంధించినవన్నీ తీయనివే.

ఓ శ్రీ కృష్ణా, నీ గానం, పూమాల మధురం. యమునా తీరం, అందులోని తరంగాలు, నీరు, అందులో నీ పద్మం, నీకు సంబంధించినదంతా మధురమే.

ఓ శ్రీ కృష్ణా, నీ గోపికలు, లీలలు తీయనివి. నీ కలిసే పద్ధతులు, నీ స్వేచ్చ, చూపు, ప్రవర్తన, నీకు సంబంధించినదంతా తీయనిదే.

ఓ శ్రీ కృష్ణా, నీ గోపబాలురు తీయన, నీ గోవులు తీయన, నీ సృష్టి, విజయాలు, నీకు సంబంధించినదంతా మధురమే.

English summary

Madhurashtakam: Dedicated To Lord Jagannath

Read to know which are the mantras dedicated to lord Krishna for Rath Yatra.
Story first published: Thursday, July 6, 2017, 18:05 [IST]
Subscribe Newsletter