For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Magh Mauni Amavasya 2021:మౌని అమావాస్య ఎప్పుడు? ఈ అమావాస్య ప్రత్యేకతలేంటో తెలుసా...

మాఘ మౌని అమావాస్య యొక్క శుభ ముహుర్తం మరియు ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం.

|

హిందూ క్యాలెండర్ ప్రకారం, ఈ సంవత్సరం మౌని అమావాస్య 2021, ఫిబ్రవరి 11వ తేదీన గురువారం అర్ధరాత్రి రోజున ప్రారంభమవుతుంది. అమావాస్య తిథి ఫిబ్రవరి 11వ తేదీన అర్ధరాత్రి 1:08 గంటలకు ప్రారంభమై, మరుసటి రోజు అంటే ఫిబ్రవరి 12వ తేదీ అర్థరాత్రి 12:35 గంటలకు ముగియబోతుంది.

Magh Mauni Amavasya 2021 date, muhurat and significance in Telugu

ఇది చంద్ర మాసం యొక్క శుక్ల పక్షం లేదా ప్రకాశవంతమైన పక్షం యొక్క ప్రారంభాన్ని సూచిస్తుంది. హిందువులు ఈ మౌని అమావాస్యను చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ సందర్భంగా మౌని అమావాస్య అంటే ఏమిటి? ఈ అమావాస్య యొక్క ప్రాముఖ్యతలేంటి?

Magh Mauni Amavasya 2021 date, muhurat and significance in Telugu

ఈరోజున ఏయే పనులు చేయాలి.. ఏయే పనులు చేయకూడదు అనే విషయాలతో పాటు ఈ అమవాస్య గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకుందాం...

59 ఏళ్ల తర్వాత అరుదైన ఘటన.. ఇండియాతో సహా ఈ దేశాల్లో పెనుమార్పులు...!59 ఏళ్ల తర్వాత అరుదైన ఘటన.. ఇండియాతో సహా ఈ దేశాల్లో పెనుమార్పులు...!

మౌని అమావాస్య ఎప్పుడు?

మౌని అమావాస్య ఎప్పుడు?

ఉత్తర భారత క్యాలెండర్ ప్రకారం, మౌని అమావాస్య మాఘ మాసం మధ్యలో వస్తుంది. దీనినే మాఘ అమావాస్య అని కూడా పిలుస్తారు. ఈరోజున రిషి జన్మించాడని చాలా మంది నమ్ముతారు. అందుకే ఈరోజు మౌని అమావాస్యగా జరుపుకుంటారు.

మౌని అమావాస్య తేదీ..

మౌని అమావాస్య తేదీ..

హిందూ మతంలో ద్వాపర యుగం ప్రారంభమైన రోజును మాఘ మాసంగా.. ఈరోజు శుభప్రదమైన రోజుగా భావిస్తారు. ఈ సంవత్సరం మౌని అమావాస్య 2021 ఫిబ్రవరి 11వ తేదీన అంటే గురువారం నాడు వస్తోంది.

మౌని అమావాస్య ప్రాముఖ్యత..

మౌని అమావాస్య ప్రాముఖ్యత..

హిందూ క్యాలెండర్లోని మొత్తం సంవత్సరంలో మహా శివరాత్రికి ముందు వచ్చే చివరి అమావాస్యను మౌని అమావాస్య అంటారు. ఈరోజున చాలా మంది హిందువులు వేకువజామునే నిద్ర లేచి, గంగా నదిలో లేదా ప్రవహించే నీటిలో స్నానాలు చేస్తారు. ఇలా పవిత్రమైన స్నానాల సమయంలో నీరు తేనేగా మారుతుందని చాలా మంది నమ్మకం. అనంతరం దేవాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేస్తారు.

ఇవి చేయాలి..

ఇవి చేయాలి..

మౌని అమావాస్య సందర్భంగా భక్తులందరూ వారి వారి సామర్థ్యం మేరకు పేదలకు దానం చేయాలి. ముఖ్యంగా నువ్వులను, నల్లబట్టలు, దుప్పట్లు, నూనె, వెచ్చని బట్టలతో పాటు మిగిలిన వస్తువులను కూడా దానం చేయొచ్చు. అనంతరం విష్ణువుకు నువ్వులు, దీపాలు అర్పించడం చాలా పవిత్రమైనదని పండితులు చెబుతారు. మౌని అమావాస్య రోజున కలియుగంలో మౌనం ఉండటం వల్ల సత్యయుగంలో వేలాది సంవత్సరాలు కాఠిన్యం చేసే ధర్మం లభిస్తుందని పురాణాలలో చెప్పబడింది.

ఇవి చేయకూడదు..

ఇవి చేయకూడదు..

మౌని అమావాస్య రోజున సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు.

ఈ పవిత్రమైన రోజున మాంసాహారం అస్సలు తీసుకోకూడదు.

పొగతాగడం, ఆల్కహాల్ వంటివి కూడా సేవించరాదు.

ఈరోజు ఎవ్వరినీ నిందించకూడదు. చాలా ప్రశాంతంగా ఉండాలి.

English summary

Magh Mauni Amavasya 2021 date, muhurat and significance in Telugu

Here we are talking about the Magh Mauni Amavasya 2021 date, muhurat and significance in Telugu. Read on
Story first published:Monday, February 8, 2021, 18:48 [IST]
Desktop Bottom Promotion