For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Shivratri Story :శివరాత్రి కథ వింటే.. తప్పకుండా జాగరణ చేస్తారు...!

మహా శివరాత్రి కథను తెలుగులో తెలుసుకుందాం.

|

హిందువులు జరుపుకునే పవిత్రమైన పండుగలలో మహా శివరాత్రి ఒకటి. హిందూ క్యాలెండర్ ప్రకారం, కొన్ని ప్రాంతాల్లో మాఘ మాసంలో మాఘ బహుళ చతుర్దశి నాడు, మరికొన్ని ప్రాంతంలో ఫాల్గుణ మాసంలో క్రిష్ణ పక్షం యొక్క చతుర్దశి తేదీన ఈ పండుగను జరుపుకుంటారు.

Maha Shivaratri story in Telugu

ఈ సంవత్సరం మార్చి 1వ తేదీన అంటే మంగళవారం నాడు మహా శివరాత్రి పండుగ వచ్చింది. ఈరోజున ముక్కోటి దేవతలలో సనాతుడైన శివుడిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే, కోరిన కోరికలన్నీ తీరుస్తాడని భక్తులందరి నమ్మకం.

Maha Shivaratri story in Telugu

మహా శివరాత్రి రోజున జ్యోతిర్మయ రూపంలో ఒక మహాలింగ రూపంలో శివుడు ఉద్బవించాడని చాలా మంది నమ్ముతారు. ఈ పవిత్రమైన రోజున ఈశ్వరుడు తన దర్శనం ద్వారా విశన్నంతటినీ దేదీప్యమానం చేసిన ఈ సమయంలో అస్సలు నిద్ర పోకూడదట.

Maha Shivaratri story in Telugu

రాత్రంతా జాగరణ చేసి మేలుకుంటే మంచి ఫలితాలొస్తాయని పండితులు చెబుతున్నారు. పురాణాల ప్రకారం, మహా శివరాత్రి రోజున పద్నాలుగు లోకాల్లో ఉండే పుణ్యతీర్థాలన్నీ బిల్వ మూలంలో ఉంటాయి. అందుకే ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండి ఒక్క బిల్వ పత్రాన్ని పరమేశ్వరుడికి సమర్పించి తరించమని శాస్త్రాలు చెబుతున్నాయి. అనంతరం మహా శివరాత్రి రోజున పరమేశ్వరుని ఆలయాల్లో జరిగే పూజల్లో పాల్గొంటే సిరి సంపదలు పెరుగుతాయని వేద పండితులు చెబుతుంటారు. ఇదిలా ఉండగా.. పురాణాల ప్రకారం, కైలాస పర్వతం మీద పార్వతీ, పరమేశ్వరులు సుఖాసీనులై ఉన్నారు. అప్పుడు పార్వతీదేవి శివునితో అన్ని వ్రతాలలో ఉత్తమమైన వ్రతమేదీ అని అడగగా.. అప్పుడు ఆ పరమేశ్వరుడు శివరాత్రి వ్రతం అన్ని వ్రతముల కన్నా ఉత్తమమైనది జవాబివ్వడంతో పాటు ఆ వత్రం యొక్క విశేషాలను తెలియజేస్తాడు.ఈ వ్రతాన్ని మాఘ బహుళ చతుర్దశి నాడు మాత్రమే ఆచరించాలని, తెలిసి చేసినా.. తెలియక చేసినా ఈ వ్రతాన్ని ఒక్కసారి చేసినా యముని బారి నుండి తప్పించుకుని విముక్తి పొందుతారని వివరించారు. అదే సందర్భంలో పార్వతీ దేవికి ఒక ఆసక్తికరమైన కథను చెప్పాడు. ఆ కథా విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Shiva Chalisa in Telugu: శివ చాలీసా వింటే ప్రశాంతంగా ఉంటారట... ఆందోళన, ఒత్తిడి తగ్గిపోతుందట...!Shiva Chalisa in Telugu: శివ చాలీసా వింటే ప్రశాంతంగా ఉంటారట... ఆందోళన, ఒత్తిడి తగ్గిపోతుందట...!

లోక రక్షణ కోసం..

లోక రక్షణ కోసం..

పురాణాల ప్రకారం, పరమేశ్వరుడు విషాన్ని మింగి, తన గొంతులో దాచుకున్న రోజును మహా శివరాత్రిగా పాటించడం ఆనవాయితీగా వస్తోంది. అదే సమయంలో అమ్రుతం కోసం దేవదేవులు క్షీరసాగర మథనం చేస్తుండగా.. ముందుగా హాలహలం వచ్చింది. వాటి విషజ్వాలాలు ముల్లోకాలను ముప్పుతిప్పలు పెడుతుండటంతో అందరూ కలిసి ఈశ్వరుడిని శరణు వేడుకున్నారు.

నీలకంఠుడిగా మారి..

నీలకంఠుడిగా మారి..

భక్త వశంకరుడైన పరమేశ్వరుడు ఆ సమయంలో హాలహలాన్ని తీసుకుని దిగమింగి తన కంఠంలో బంధించాడు. హాలహల ప్రభావానికి శివుడి కంఠం కమిలిపోయింది. అంతే అప్పుడు అది నీలిరంగులోకి మారిపోయింది. దీంతో శివుడు నీలకంఠుడయ్యాడు. అదే సమయంలో కింద పడిపోయాడు. అప్పుడు పార్వతీ దేవి తన భర్త తలను ఒడిలోకి తీసుకుని దుఃఖిస్తుంటే, అందరూ శోకసంద్రంలో మునిగిపోయారు. అప్పుడు శివుడు మెళకువలోకి వచ్చేంత వరకు జాగరణ చేశారు. నాటి నుండి భక్తి శ్రద్ధలతో శివుని పూజించి, జాగరణ చేయడం ఆనవాయితీగా వస్తోంది.

మరో కథనం ప్రకారం..

మరో కథనం ప్రకారం..

ఒకప్పుడు పర్వత ప్రాంతంలో హింస చేసే వ్యాధుడొకడు ఉండేవాడు. అతను ప్రతిరోజూ ఉదయం వేళలో అడవికి వేటకు వెళ్లి సాయంకాలం లోపు ఏదో ఒక జంతువును కచ్చితంగా వధించి ఇంటికి తెచ్చేవాడు. అలా ప్రతిరోజూ తనతో పాటు తన కుటుంబం యొక్క కడుపు నింపేవాడు.

Maha Shivratri 2022:శివరాత్రి గురించి పార్వతీదేవికి శివుడు చెప్పిన కథ గురించి తెలుసా...Maha Shivratri 2022:శివరాత్రి గురించి పార్వతీదేవికి శివుడు చెప్పిన కథ గురించి తెలుసా...

ఖాళీ చేతులతో..

ఖాళీ చేతులతో..

ప్రతిరోజూ అడవికి వేట నిమిత్తం వెళ్లే అతనికి ఒకరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు ఎంత వెతికినా ఏ జంతువు కనబడదు. దీంతో ఆరోజు సమయం బాగాలేదనుకుని.. ఖాళీ చేతులతోనే ఇంటికి తిరుగు ముఖం పట్టాడు. అయితే అలా ఇంటికి బయలుదేరిన అతనికి దారిలో ఒక ఆలోచన వచ్చింది. అక్కడే ఓ వాగు కనిపించింది. అక్కడికి నీరు తాగేందుకు జంతువులు కచ్చితంగా వస్తాయని భావించాడు. అంతే ఆ వెంటనే దగ్గర్లోని చెట్టునెక్కి అటు వైపు అదే పనిగా చూస్తున్నాడు.

విపరీతమైన చలి గాలులు..

విపరీతమైన చలి గాలులు..

తన చూపులకు అడ్డంగా వచ్చిన ఆకులను, కాయలను విరిచి కింద పడేశాడు. అప్పుడు చలిగాలులు విపరీతంగా వీస్తున్నాయి. ఆ సమయంలో ‘శివ శివ' అంటూ గజ గజ వణుకుతూ విల్లు ఎక్కి పెట్టి జంతువుల కోసం ఎదురుచూశాడు. అయితే అలా ఎదురుచూస్తున్న అతనికి తెల్లవారుజామున ఓ లేడి కనిపించింది. అంతే వెంటనే తన విల్లులోని బాణాన్ని ఎక్కు పెట్టాడు. అది చూసిన లేడీ ‘వ్యాధుడా నన్ను చంపకు' అని మనిషిలాగా మాట్లాడింది. వ్యాధుడు ఆశ్చర్యపోయి మనిషిలాగా మాట్లాడుతున్నావే.. ఎవరు నువ్వు అని అడిగాడు. దీనికి ఆ లేడీ సమాధానమిస్తూ ‘నేను పూర్వ జన్మలో రంభను' అని సమాధానమిచ్చింది.

వ్యాధుడితో మాట్లాడిన జింక..

వ్యాధుడితో మాట్లాడిన జింక..

పూర్వం నేను హిరణ్యాక్షుడు అనే రాక్షసుడిని ప్రేమించి శివుడిని పూజించుట మరిచిపోయాను. దీంతో ఆ పరమేశ్వరుడు నాపైన కోపంతో కామ కూతురయైన నీవు, నీ ప్రియుడిని జింకలుగా పన్నేండేళ్లు గడిపి, ఒక వ్యాధుడు బాణంతో చంపనుండగా శాపవిముక్తిలౌదరని చెప్పాడు. ఇప్పుడు నేను గర్భిణి, అవధ్యను కనుక నన్ను వదలేయ్. మరొక జింక ఇక్కడికి వస్తుంది. అది బాగా బలిసింది. కాబట్టి దాన్ని నువ్వు చంపుకో. నేను వసతికి వెళ్లి ప్రసవించి శిశువును బంధువులకు అప్పగించి తిరిగి వస్తాను' అని వ్యాధుడిని ఒప్పించి వెళ్లెను.

Mahashivratri 2022:ఈ ఏడాది శివరాత్రి ఎప్పుడు, శుభ ముహుర్తం, పూజా విధానాలివే...Mahashivratri 2022:ఈ ఏడాది శివరాత్రి ఎప్పుడు, శుభ ముహుర్తం, పూజా విధానాలివే...

నాలుగు జింకలు..

నాలుగు జింకలు..

మరో జింక కొద్దిసేపటి తర్వాత రావడంతో.. వ్యాధులు సంతోషంగా విల్లు ఎక్కు పెట్టి బాణం విడిచే సమయంలో ఆ జింక కూడా అచ్చం మనిషి లాగా ‘ఓ వ్యాధుడా, నేను విరహంతో ఉన్నాను. నాలో మేధోమాంసలు లేవు. నేను చనిపోయినా కూడా నీ కుటుంబానికి సరిపోను. ఇక్కడికి మరో మగ జింక కొద్దిసేపట్లో వస్తుంది. దానిని చంపుకో.. లేదంటే నేను తిరిగి వస్తాను' అని వ్యాధుడికి చెప్పడంతో దాన్ని కూడా వదిలేస్తాడు. అలా నాలుగు జింకలు అతనని వేడుకుని తిరిగి వెళ్లిపోతాయి. అయితే మరో జింక కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న వ్యాధుడికి మరుసటి రోజు నాలుగు జింకలు వచ్చి నన్ను మొదట చంపు.. లేదు నన్నే మొదట చంపమని తన ఎదుట మోకరిల్లుతాయి. ఆ జింకల నిజాయితీని వ్యాధుడు ఆశ్చర్యపోతాడు.

వాటిని వదలేస్తాడు..

వాటిని వదలేస్తాడు..

దీంతో అతనికి వాటిని చంపడానికి మనసు ఒప్పదు. దీంతో హింసా వ్రుత్తిపై అతనికి విసుగు కలుగుతుంది. అన్నింటినీ వదిలేస్తాడు.. అప్పుడు వ్యాధుడు జంతువులనుద్దేశించి ఇలా అంటాడు. ‘నాకు మాంసం అక్కర్లేదు. నేను ఇప్పటి నుండి జంతువులకు బంధించుట, వధించుట, బెదిరించుట, చంపుట వంటివి చేయను. నా కుటుంబం కోసం కూడా నేను ఈ పాపం చేయను. ధర్మాలకు దయ మూలం. మీరు నాకు గురువులాంటివారు. మీరు కుటుంబ సమేతంగా వెళ్లండి' అని వాటిని వదిలిపెడతాడు. అంతలో ఆకాశం నుండి పుష్పవర్షం కురుస్తుంది. దేవదూతలు మనోహరమైన విమానాన్ని తెచ్చి శివరాత్రి సందర్భంగా నీ పాతకం క్షీణించింది. ఉపవాసం మరియు జాగరణ కూడా చేశావు. నీవు తెలియకుండానే యామ, యామమునను పూజించావు, నీవు ఎక్కిన చెట్టు బిల్వవ్రుక్షం. దాని కింద స్వయంభూలింగమొకటి గుబురులో మరుగునపడి ఉంది. నీవు తెలియకుండానే బిల్వపత్రాలను తుంచివేసి శివలింగాన్ని పూజించావు. అని చెబుతారు. ఆ నక్షత్రాలే.. అలా ఆ కథను పార్వతీదేవికి వినిపించిన పరమేశ్వరుడు.. తనతో ఇలా అంటాడు. దేవీ! ఆ కుటుంబమే నేడు ఆకాశంలో కనిపిస్తున్న మ్రుగ నక్షత్రం. మూడు నక్షత్రాలలో ముందున్న రెండు జింక పిల్లలు. వెనుక ఉన్నది మూడవది ఈ మూడింటి మ్రుగశిరలు అంటారు.

FAQ's
  • 2022లో మహా శివరాత్రి పండుగ ఎప్పుడొచ్చింది?

    హిందువులు పవిత్రమైన పండుగలలో మహాశివరాత్రి ఒకటి. హిందూ క్యాలెండర్ ప్రకారం, ఫాల్గుణ మాసంలో క్రిష్ణ పక్షం యొక్క చతుర్దశి తేదీన ఈ పండుగను జరుపుకుంటారు.ఈ సంవత్సరం మార్చి 1వ తేదీన అంటే మంగళవారం నాడు మహా శివరాత్రి పండుగ వచ్చింది. ఈరోజున ఈశ్వరుడిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే, కోరిన కోరికలన్నీ తీరుస్తాడని భక్తులందరి నమ్మకం.

English summary

Maha Shivaratri story in Telugu

Here we are talking abou the Maha Shivaratri story in Telugu. Read on
Desktop Bottom Promotion