For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మహా శివరాత్రి 2020 : మీ రాశిని బట్టి శివుని దయ మీపై ఉండాలంటే...

శివుని జ్యోతిర్లింగాలలో మొదటి జ్యోతిర్లింగం సోమనాథ్ జ్యోతిర్లింగం. కాబట్టి మేష రాశి చక్రంలో జన్మించిన వారు సోమనాథ్ జ్యోతిర్లింగాన్ని ఆరాధించాలి.

|

2020 సంవత్సరంలో ఫిబ్రవరి 21వ తేదీన మహా శివరాత్రి పండుగ వచ్చింది. ఈ పండుగ రోజు ఆ పరమేశ్వరుడిని ఆరాధిస్తే సకల పాపాలు పోతాయని చాలా మంది భక్తులు నమ్ముతారు.

Maha Shivratri 2020

అంతేకాదు తాము కోరుకునే కోరికలన్నీ తీరుస్తాడని గట్టిగా నమ్ముతారు. అయితే జ్యోతిష శాస్త్రం ప్రకారం ద్వాదశ రాశుల వారిలో ఏయే రాశి వారు శివుడిని ఎలా ఆరాధించాలో ఈ స్టోరీలో చూడండి...

2020లో మీ రాశికి సరైన జోడి ఎవరో తెలుసుకోండి...!

మేష రాశి..

మేష రాశి..

శివుని జ్యోతిర్లింగాలలో మొదటి జ్యోతిర్లింగం సోమనాథ్ జ్యోతిర్లింగం. కాబట్టి మేష రాశి చక్రంలో జన్మించిన వారు సోమనాథ్ జ్యోతిర్లింగాన్ని ఆరాధించాలి. మహా శివరాత్రి పర్వదినాన సోమనాథుడిని ఆరాధించడం మరియు పూజించడం కష్టమనిపిస్తే, మీరు సమీపంలోపి శివాలయానికి వెళ్లి సోమనాథ్ గురించి ధ్యానం చేయాలి. తరువాత శివుడికి షమీ పూలు, ఆకులు సమర్పించాలి.

వృషభ రాశి..

వృషభ రాశి..

ఈ రాశి వారు మల్లికార్జున స్వామిని ఆరాధించాలి. ఈ ఆలయం శ్రీశైలంలో ఉంది. మన తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ ఈ ఆలయం గురించి బాగానే తెలుసు. అయితే ఆ పర్వదినాన మీకు అక్కడికి వెళ్లడానికి సాధ్యం కాకపోతే, మీరు శివుని దయ పొందటానికి మీకు సులభమైన మార్గం మీరు మహా శివరాత్రి రోజున గంగా నీటితో ఏ శివలింగాన్నైనా పూజించాలి. తర్వాత శివ లింగానికి ఆకులను సమర్పించాలి.

మిధున రాశి..

మిధున రాశి..

ఈ రాశి వారు ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగాన్ని ఆరాధించాలి. ఈ దేవుడిని ఆరాధించేవారు అకాల మరణానికి భయపడరు. మహా శివరాత్రి రోజు ఈ దేవుడిని పూజించడం వల్ల మీరు ఈ ఏడాదంతా సమస్యలను సులభంగా అధిగమించగలుగుతారు. అయితే ఈ మహాకాళేశ్వర్ స్వామిని దర్శించుకోలేని వారు, ఈ దేవుడిని మనసులో తలచుకుని ధ్యానం చేయాలి. అలాగే శివలింగానికి పాలతో, మరియు తేనేతో అభిషేకం చేసి, బిల్వపత్రాలను సమర్పించాలి.

కర్కాటక రాశి..

కర్కాటక రాశి..

ఈ రాశి చక్రంలో జన్మించిన వారు మధ్యప్రదేశ్ లోని నర్మదా తీరంలో ఉన్న ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగాన్ని ఆరాధించాలి. ఈ రాశి వారు ఓంకారేశ్వర్ గురించి ధ్యానం చేయాలి. అంతకంటే ముందు పంచామృతంతో స్నానం చేయాలి. అనంతరం బిల్వపత్రా సమర్పించాలి. ఆ తర్వాత శివ మంత్రాన్ని 108 సార్లు జపించాలి. విద్యార్థులు ఇలా పూజలు చేస్తే వారి అడ్డంకులన్నీ తొలగిపోతాయి.

ఈ వారం మీ రాశి ఫలాలు ఫిబ్రవరి 16 నుండి 22వ తేదీ వరకు...ఈ వారం మీ రాశి ఫలాలు ఫిబ్రవరి 16 నుండి 22వ తేదీ వరకు...

సింహ రాశి..

సింహ రాశి..

ఈ రాశి చక్రం వారు వైద్యనాథ్ జ్యోతిర్లింగాన్ని పూజించాలి. మహా శివరాత్రి సందర్భంగా సింహ రాశి వారు ఈ లింగాన్ని దర్శించుకున్నా, ఈ స్వామిని ఆరాధించినా వారికి ఏడాది అంతా ఆరోగ్య పరంగా బాగుంటుంది. ఆ పర్వదినాన శివ లింగాన్ని గంగాజలంతో అభిషేకం చేసి, బిల్వ పత్రాలతో పూజించాలి. ఇలా చేస్తే మీకు మానసిక శాంతి కలుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగాలలో అడ్డంకులు, ప్రభుత్వ సంబంధిత పనులలో సమస్యలు తొలగిపోతాయి.

కన్య రాశి..

కన్య రాశి..

ఈ రాశి వారు మహారాష్ట్రలోని భీమా నది ఒడ్డున ఉన్న భీమాశంకర్ జ్యోతిర్లింగాన్ని పూజించాలి. ఈ పండుగ రోజున శివుని అనుగ్రహం కోసం పాలలో నెయ్యి కలిపి శివలింగానికి అభిషేకం చేయండి. ఆ తర్వాత పసుపు, షమీ ఆకులతో పూజించాలి. అలాగే ‘భగవతే రుద్ర‘ మంత్రాన్ని జపించాలి. ఆ విధంగా మీ ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. అంతేకాదు ఈ ఏడాది పొడవునా మీకు ఆర్థిక పరంగా కలిసి వస్తుంది.

తుల రాశి...

తుల రాశి...

ఈ రాశి వారు తమిళనాడులోని రామేశ్వర్ జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవాలి. మహాశివరాత్రి రోజున ఈ రామేశ్వర్ జ్యోతిర్లింగాన్ని చూడలేని వారు, ఒక కుండలో నీళ్లు వేసి శివలింగానికి అభిషేకం చేయాలి. శివుడికి ఇష్టమైన పూలను సమర్పించాలి. అలాగే శివ పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించాలి. దీని వల్ల మీకు ప్రయోజనం కలుగుతుంది.

వృశ్చిక రాశి..

వృశ్చిక రాశి..

గుజరాత్ లోని ద్వారకా జిల్లాలోని నాగేశ్వర్ జ్యోతిర్లింగం వృశ్చికరాశి వారికి సంబంధించినది. ఇక్కడికి వెళ్లలేని ఈ రాశి ప్రజలు మెడలో పాముల హారం ధరించిన దేవుడిని ఆరాధించాలి. మహాశివరాత్రిలో ఈ దేవుడిని ఆరాధించడం వల్ల ప్రమాదాలను నివారించడానికి సహాయపడుతుంది. నాగేశ్వర్ జ్యోతిర్లింగాన్ని చూడలేని వారు, మీ సమీపంలోని శివాలయంలో పాలు, బంతి పూలు, బిల్వ పత్ర ఆకులు సమర్పించాలి.దీని వల్ల మీకు సంపద పెరిగే అవకాశం ఉంటుంది.

2020లో ఓ రాశి వారికి రెండు లక్కీ డేస్... మిగిలిన రాశులకు అదృష్ట రోజు ఎప్పుడంటే...2020లో ఓ రాశి వారికి రెండు లక్కీ డేస్... మిగిలిన రాశులకు అదృష్ట రోజు ఎప్పుడంటే...

ధనస్సు రాశి..

ధనస్సు రాశి..

వారణాసిలోని విశ్వనాథ్ జ్యోతిర్లింగం ఈ రాశి వారికి సంబంధించినది. మహా శివరాత్రి రోజున ఈ రాశి చక్రం వారు గంగా నీటిలో కుంకుమపువ్వు కలిపి శివుడికి సమర్పించాలి. అలాగే బిల్వపత్రాలు, పసుపు లేదా ఎర్రటి పూలతో ఆరాధించాలి. ఇలా చేయడం వల్ల మీకు మానసిక చింతల నుండి ఉపశమనం లభిస్తుంది.

మకర రాశి..

మకర రాశి..

త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం మకర రాశి వారికి సంబంధించినది. ఈ జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని నాసిక్ లో ఉంది. మహా శివరాత్రి రోజున గంగాజలంలో బెల్లం కలపండి. ఆ జలంతో శివుడికి అభిషేకం చేయండి. అలాగే శివుడిని నీలి పూలను సమర్పించండి. తర్వాత ‘ఓం నమ శివాయ‘ అనే మంత్రాన్ని ఐదు సార్లు జపించాలి. దీని వల్ల మీ వైవాహిక జీవితంలో ఒత్తిడి తగ్గుతుంది. వ్యాపారులకు లాభాలు వస్తాయి.

కుంభ రాశి..

కుంభ రాశి..

ఉత్తరాఖండ్ లోని కేదార్ నాథ్ కుంభ రాశి వారికి సంబంధించినది. ఇక్కడికి అక్షయ తృతీయ నుండి ప్రయాణం ప్రారంభమవుతుంది. కాబట్టి మహాశివరాత్రి సమయంలో కేదరానాథ్ ను చూడలేము. అయితే కుంభ రాశి వారు మహా శివరాత్రి నాడు కేదరానాథ్ ను తలచుకుని ధ్యానం చేయాలి. తామరపువ్వులను ‘ఓం నమ శివాయ‘ అనే జపిస్తూ సమీపంలోని శివాలయంలో సమర్పించాలి. ఇలా చేస్తే ఈ ఏడాది పొడవునా మీకు శత్రువులు, ప్రత్యర్థుల భయం అనేదే ఉండదు. ఇంకా అనేక ప్రయోజనాలను పొందుతారు.

మీన రాశి..

మీన రాశి..

మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లోని గ్రినేశ్వర్ జ్యోతిర్లింగం మీన రాశి వారికి చెందినది. ఈ రాశి వారు మహా శివరాత్రి రోజున కుంకుమ పువ్వును పాలలో వేసి శివలింగానికి అభిషేకం చేయించాలి. ఆ తర్వాత ఆవు నెయ్యి మరియు తేనెను శివునికి సమర్పించాలి. అలాగే బిల్వపత్రాలను కూడా సమర్పించాలి. ఇలా చేస్తే శివుడు మిమ్మల్ని అనుగ్రహించి మీ సమస్యలన్నీ నెరవేర్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

English summary

Maha Shivratri 2020 Effect on Zodiac Signs

Here we talkinga about Maha Shivratri 2020 Effect on Zodiac Signs. Read on
Story first published:Tuesday, February 18, 2020, 14:39 [IST]
Desktop Bottom Promotion