For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మకర సంక్రాంతి రాశి చక్రాల మీద చూపే ప్రభావాలు

|

సూర్యుడు మకర రాశిలోకి వెళుతున్న రోజును మకర సంక్రాంతిగా చెప్పడం జరుగుతుంటుంది. కాప్రికాన్ చిహ్నానికి భారతీయ పేరుగా మకరం ఉంటుంది. క్రమంగా ఖగోళపరంగా జరిగే ఈ మార్పుకు సూచనగా మకర సంక్రాంతి జరుపబడుతుంది.

ఎటువంటి ఖగోళ కార్యక్రమమైనా అన్ని రాశిచక్ర గుర్తులను ప్రభావితం చేస్తుందని మనకు తెలియనిదికాదు. అదేవిధంగా, ఈ మకర సంక్రాంతి కూడా రాశిచక్ర గుర్తులను ప్రభావితం చేస్తుంది. ఇక్కడ మకర సంక్రాంతినాడు సూర్యుని పరివర్తనం అన్ని రాశిచక్ర సంకేతాలను ప్రభావితం చేస్తుంది. ఎలానో చూడండి.

మేష రాశి :

మేష రాశి :

భూమి లేదా వాహనాల కొనుగోలు పరంగా మీ కల నెరవేరుతుందని చెప్పబడింది. సామాజిక గౌరవం పెరగడంతో పాటు కుటుంబంలో కూడా మీకంటూ ఒక స్థానం ఏర్పడుతుంది.

వృషభ రాశి :

వృషభ రాశి :

మీరు మీ వృత్తిపరమైన జీవితంలో ఆశించదగిన పురోగతిని చూడగలుగుతారు. మీరు జీవితంలో తరచుగా ఎదుర్కొంటున్న కొన్ని క్లిష్ట పరిస్థితులను, వ్యక్తులతో విభేదాలను వదిలించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంమీద, విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

మిధున రాశి :

మిధున రాశి :

మీరు మీ ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా కనిపించే సూచనలు ఉన్నాయి. మతసంబంధమైన కార్యకలాపాలపరంగా కొన్ని ప్రయాణాలు చేయవలసి రావొచ్చు.

కర్కాటక రాశి :

కర్కాటక రాశి :

ఆలస్యమైన పనులు లేదా ప్రాజెక్టులలో కొన్ని పురోగతిని చూడవచ్చు. ప్రొఫెషనల్ జీవితంలో ఎటువంటి మార్పులూ ఉండవు. మీ సంస్థాగత మరియు వ్యక్తిగత శత్రువుల నుండి జాగ్రత్త వహించవలసిన సమయంగా ఉంటుంది. శాంతి మరియు ప్రశాంతతలతో, మీరు మీ శత్రువులను అధిగమించగలరు.

సింహ రాశి :

సింహ రాశి :

చట్టపరమైన విషయాలలో మీకు అనుకూలంగా తీర్పులు వచ్చే సూచనలు ఉన్నాయి. ఆశించిన ఫలితాలనే పొందగలరు. కొన్ని చర్చలు పరిష్కరించబడుతాయి. ఆస్తుల సంబంధిత వ్యవహారాల నేపధ్యంలో మానసిక సర్దుబాటు నిమిత్తం ఆధ్యాత్మికత వైపుకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి.

కన్యా రాశి :

కన్యా రాశి :

సామాజిక గౌరవం పెరుగుతుంది. ఆర్థిక లాభాలు గోచరిస్తున్నాయి. మీ కఠోర శ్రమ మీ విజయానికి దారులు తెరుస్తుందని మరువకండి. క్రమంగా మీరు రుణాల నుండి కూడా ఉపశమనం పొందవచ్చు.

తులా రాశి :

తులా రాశి :

వ్యాపార లావాదేవీల పరంగా గణనీయంగా లాభాలను గణించే అవకాశాలున్నాయి. మీ వృత్తిపరమైన అంశాలనందు బాధ్యతలు పెరుగుతాయి. క్రమంగా మీ లక్ష్యాలు నెరవేరుతాయి.

వృశ్చిక రాశి :

వృశ్చిక రాశి :

సంపద పెరుగుతుంది. వ్యాపారంలో లాభాలు గోచరిస్తున్నాయి. వృత్తి పరమైన జీవితం ప్రకారం, మీరు మీ అధికారులు మరియు సీనియర్ల పరంగా కొన్ని సమస్యలను ఎదుర్కొనవలసి రావొచ్చు.

ధనుస్సు రాశి :

ధనుస్సు రాశి :

కార్యాలయంలో సంఘర్షణలను నివారించేందుకు ప్రయత్నించండి. వృత్తిపరమైన జీవితంలో ఆశించదగిన లాభాలు సూచించబడ్డాయి. విద్యాసంబంధిత విషయాల నందు పురోగతి ఉంటుంది. సూర్య భగవానునికి నీటిని సమర్పించడం మంచిదిగా సూచించబడుతుంది.

మకర రాశి :

మకర రాశి :

మీరు మీ వృత్తిపరమైన అంశాలనందు మరింత కృషి చేయవలసి ఉంటుంది. మరియు సంస్థాగత అంశాల పరంగా విదేశీ ప్రయాణ అవకాశాలు గోచరిస్తున్నాయి. క్రమంగా కొంత మానసిక అశాంతికి లోనయ్యే అవకాశాలు ఉన్నాయి. సూర్య భగవానునికి నీటిని సమర్పించడం ద్వారా స్వాంతన పొందగలరు.

కుంభ రాశి :

కుంభ రాశి :

మీరు వృత్తిపరమైన ద్రవ్య లాభాలను చవిచూస్తారు. మీ కార్యాలయాల నందు, లేదా మీ వ్యాపార సంబంధిత విషయాలలో సీనియర్లతో కొన్ని విభేదాలు ఉండవచ్చు. కావున కొన్ని అంశాలలో ఆచితూచి అడుగులు వేయవలసిన అవసరం ఉంటుంది. ఆర్ధిక పరమైన అంశాలలో పెరుగుదల కనిపిస్తుంది.

మీన రాశి :

మీన రాశి :

దీర్ఘ కాలిక అనారోగ్యాల పరంగా కొంత ఊరట లభిస్తుంది. ఆరోగ్యంపరంగా మెరుగైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక లాభాలు సూచించబడ్డాయి. శత్రువులను బలహీనతగా భావించడం జరుగుతుంది.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్తసాముద్రిక, శిశు, మాతృత్వ, ఆహార, ఆరోగ్య, జీవనశైలి, వ్యాయామ, లైంగిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

Makar Sankranti Effects On All Zodiac Signs

makar-sankranti-2019-effects-on-all-zodiac-signs
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more