For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Makar Sankranti 2022 : పండుగ వేళ ఈ పనులను ఎట్టి పరిస్థితుల్లో చేయకండి.. చెడు ఫలితాలొస్తాయట...!

మకర సంక్రాంతి సమయంలో చేయాల్సిన మరియు చేయకూడని పనులేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

|

తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలంతా ప్రధానంగా భావించే పండుగలలో మకర సంక్రాంతి (Pongal) కూడా ఒకటి. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సూర్యుడు ధనస్సు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించే సందర్భంగా ఈ సంక్రాంతి పండుగను జరుపుకుంటారు.

Makar Sankranti 2021: Dos And Donts On This Auspicious Day

అయితే ఈ పండుగను ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా జరుపుకుంటారు. ఈ పండుగను భారతదేశం అంతటా వివిధ పేర్లతో జరుపుకుంటారు. ఈ పండుగను పంజాబ్‌లో లోహారీ, పశ్చిమ బెంగాల్ మరియు అస్సాంలోని బొగాలి బిహు, గుజరాత్‌లో ఉత్తరాయన్ (కైట్ ఫ్లయింగ్) మరియు రాజస్థాన్, కర్ణాటక, బీహార్ మరియు తెలుగు రాష్ట్రాల్లో మకర సంక్రాంతి అని పిలుస్తారు.

Makar Sankranti 2022

తమిళనాడులో "పొంగల్" గా జరుపుకుంటారు. కేరళలోని శబరిమలలో నివసించే అయ్యప్ప స్వామి ఈ రోజును 'మాగరవాలక్' గా జరుపుకుంటారు. ఇంతటి పవిత్రమైన రోజున కొన్ని పనులు కచ్చితంగా చేయాలి.. మరికొన్ని పనులు అస్సలు చేయకూడదంట.. అవేంటో ఇప్పుడే చూసెయ్యండి...

Makar Sankranti 2021 : కోడి పందేలు.. గాల్లో పతంగులు.. కొత్త అల్లుళ్ల రాకతో సంక్రాంతి సంబురాలు...!Makar Sankranti 2021 : కోడి పందేలు.. గాల్లో పతంగులు.. కొత్త అల్లుళ్ల రాకతో సంక్రాంతి సంబురాలు...!

కచ్చితంగా చేయాల్సిన పనులు

పారే నీటిలో స్నానం..

పారే నీటిలో స్నానం..

మకర సంక్రాంతి పండుగ రోజున పారే నీటిలో స్నానం చేయడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. భారతదేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలు ఈరోజు గంగా నదిలో లేదా పారే నీటిలో స్నానం చేస్తారు. ఇలా స్నానం చేయలేని వారు పారే నీటిని ఇంట్లోకి ఓ బాటిల్ లో ఏదైనా పాత్రలో తీసుకొచ్చి మీరు స్నానం చేసే పాత్రలో వేసుకుని కూడా చేయొచ్చు.

సూర్య దేవుడి ప్రార్థన..

సూర్య దేవుడి ప్రార్థన..

సూర్యోదయానికి ముందు స్నానం చేసిన తరువాత, సూర్య దేవునికి నీరు అర్పించండి. మకర రాశిలోకి ప్రవేశించిన సూర్య భగవానుని ఆరాధించడం ద్వారా మీ జీవితంలో ఆనందాన్ని ఇస్తుంది. శివుడు, విష్ణువు మరియు లక్ష్మి దేవిని కూడా సంక్రాంతిపై శ్రేయస్సు కోసం పూజించవచ్చు. ఈ పవిత్రమైన రోజున మీరు సూర్య భగవానుని ఆశీర్వాదం పొందాలనుకుంటే, సాయంత్రం వేళలో ఏమి తినకుండా ఉండాలి.

దానం చేయండి..

దానం చేయండి..

మకర సంక్రాంతి రోజున దాతృత్వానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ పవిత్రమైన రోజున పేదలకు ఆహారం, దుస్తులు ఇవ్వండి. గోమాతలకు ఏదైనా ఆహారం ఇవ్వండి. ముఖ్యంగా ఈరోజున నల్ల నువ్వులను దానం చేయడం చాలా పవిత్రంగా భావిస్తారు.

నువ్వులతో వంటలు

నువ్వులతో వంటలు

ఈ సమయంలో చాలా మంది ఇంట్లో పెద్దల ఆశీర్వాదం కోరుకుంటారు. ఇంట్లో నువ్వులు లడ్డు మరియు ఖిచ్డి తయారు చేసి పేదలకు పంపిణీ చేయండి. మీ కుటుంబ సభ్యులతో కలిసి కూర్చుని తినండి. ఇవన్నీ మకర సంక్రాంతి రోజున మీకు శ్రేయస్సు తెస్తాయి. అలాగే నువ్వులతో రొట్టెలు, సకినాలు, ఇతర వంటకాలను తయారు చేసుకోండి.

చేయకూడని పనులు

స్నానం చేయకుండా తినకండి..

స్నానం చేయకుండా తినకండి..

మనలో చాలా మందికి ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే టీ తాగడం అలవాటుగా ఉంటుంది. మీరు కూడా అలాంటి వారిలో ఒకరు అయితే, మకర సంక్రాంతి రోజున దానికి కొంచెం బ్రేక్ ఇవ్వండి. ఈ పవిత్రమైన రోజున, స్నానం చేయకుండా అస్సలు ఏమి తీసుకోకండి. గంగానది లేదా మరే ఇతర నదిలో స్నానం చేసి విరాళాలు ఇచ్చిన తర్వాత మాత్రమే మీరు ఈరోజు అన్నపానీయాలు ముట్టాలి.

చెట్లను నరికివేయవద్దు

చెట్లను నరికివేయవద్దు

హిందూ మతంలో చెట్లను ప్రకృతి పవిత్రమైన అంశాలుగా పూజిస్తారు. చాలా చెట్లు కొన్ని దేవతలకు ప్రతీక అని నమ్ముతారు. అంతేకాక, మకరసంక్రాంతి కూడా పంట పండుగ కాబట్టి, ఆ రోజున మొక్కలను పూజిస్తారు. మకర సంక్రాంతి అంటేనే ప్రకృతి పూజిస్తూ జరుపుకునే పండుగ. ఈ రోజున, మీరు ఇంటి లోపల లేదా ఆరుబయట ఎలాంటి మొక్కలను కత్తిరించడం లేదా కోయడం వంటివి చేయకండి. ఇలా చేస్తే మీకు చెడు ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది ప్రకృతి పండుగ మరియు పచ్చదనం యొక్క వేడుక. అందువల్ల, కోత పనులను ఈ రోజుకు వాయిదా వేయాలి.

Makar sankranti recipes : సంక్రాంతి సంబరాల్లో నోరూరించే రుచులు.. స్పెషల్ రెసిపీలివే...!Makar sankranti recipes : సంక్రాంతి సంబరాల్లో నోరూరించే రుచులు.. స్పెషల్ రెసిపీలివే...!

మత్తు పదార్థాలకు దూరంగా..

మత్తు పదార్థాలకు దూరంగా..

మకర సంక్రాంతి రోజున మీరు ఎలాంటి మత్తుపదార్థాలు తీసుకోకూడదు. మీరు ఈరోజు మద్యం, సిగరెట్లు మరియు గుట్కాలకు దూరంగా ఉండాలి. ఈ రోజు మసాలా ఆహారం తినవద్దు. అదే విధంగా మాంసాహారానికి కూడా ఈరోజు దూరంగా ఉండాలి. అయితే ఈరోజు, నువ్వులు, చిక్కీ మరియు ఖిచ్డి తినవచ్చు మరియు వీలైనంత దానం చేయాలి. ఈ రోజున భక్తులు సూర్య భగవానుని, శనిని ఆరాధిస్తారు. మకర సంక్రాంతి పండుగను సరళంగా జరుపుకోవాలి. ఆహారం నియమాలను కచ్చితంగా పాటించాలి.

బిచ్చగాళ్లను తిరిగి పంపకండి..

బిచ్చగాళ్లను తిరిగి పంపకండి..

మీ చుట్టుపక్కల వారు మీ ఇంటికి భిక్షాటనకు వస్తే, వారిని మకర సంక్రాంతి రోజున, మాత్రం ఒట్టిచేతులతో అస్సలు తిరిగి పంపకండి. మీ స్తోమత మేరకు మీకు తోచినది ఏదో ఒకటి దానం చేయండి.

కోపంగా మాట్లాడకండి

కోపంగా మాట్లాడకండి

మకర సంక్రాంతి రోజున సూర్యుని ఆశీర్వాదం కావాలంటే, మీరు అనాగరికతను వదులుకోవాలి. మకరసంక్రాంతి ఒక పవిత్ర పండుగ మరియు ప్రజలు కొత్త ఆరంభం కావాలని కోరుకుంటారు. కాబట్టి కోపాన్ని పాత్రలపై చూపడం లేదా మనుషులపై చూపడం వంటివి చేయకూడదు. అలా చేస్తే మీకు ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది. ఇది మీ విజయానికి అవరోధంగా ఉంటుంది. కాబట్టి, మకర సంక్రాంతి రోజున ఎవరితోనూ కోపగించవద్దు. ఎవరితోనూ చెడుగా మాట్లాడకండి, అందరితో దయగా ప్రవర్తించండి.

English summary

Makar Sankranti 2022: Dos And Don'ts On This Auspicious Day

Makar Sankranti day is extremely auspicious and therefore, you can perform certain rituals that will bring in good luck and prosperity in your life. Read on the dos and donts on this auspicious day.
Desktop Bottom Promotion