For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మకర సంక్రాంతి స్పెషల్ : సంక్రాంతి రోజును ఖచ్చితంగా చేయాల్సిన పనులు..!!

|

కొత్త సంవత్సరంలో..కొత్త క్యాలెండర్ ప్రకారం ఏడాదిలో మొదట వచ్చే పండుగ సంక్రాంతి. ప్రతి ఏటా జనవరి 14న వచ్చే ఈ పండుగను భారతదేశమంతటా వేడుకగా, సంబరంగా సార్వజనీనంగా జరుపుకోవడం దాదాపు మూడు వేల ఏళ్ల నుంచీ వస్తోంది. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించి తన ఉత్తర దిశ ప్రయాణాన్ని కొనసాగించడం ఈ సంక్రాంతితోనే ప్రారంభం అవుతుంది. ఇది ప్రతి సంవత్సరం ఒక ఫిక్డ్స్ డేట్ లో జరుపుకోవడం ఆచారంగాను, ఆధ్యాత్మికంగాను మారింది.

ఇది హిందువులకు అత్యంత పుణ్యప్రదమైన ఉత్తరాయణ పుణ్యకాలం. వాతావరణపరంగా చూస్తే చలి కాలం నుంచి వేసవి కాలానికి కాలం మార్పు చెందడం ఈ సంక్రాంతి నుంచి మొదలవుతుంది. ఉదయ కాలం పెరుగుతూ, రాత్రి కాలం క్రమంగా తగ్గే కాలం ఇది. సంక్రాంతి ఆచార సంప్రదాయాలు, శాస్త్రీయ విజ్ఞానం, పర్యావరణం, వినోదం, వేడుకలు, సర్వప్రాణి హితం వగైరాలన్నీ కలగలసిన అపూర్వ, అద్భుత పర్వదినం. కుటుంబాలు, స్నేహితులు, సమాజంలోని వివిధ వర్గాల మధ్య ఆప్యాయతలు, అనుబంధాలు పెంచడానికి ఈ పండుగ ఎంతగానో దోహదం చేస్తోంది. మానవ జీవితంలో సానుకూల, ఆశావాద, ఆరోగ్యకరమైన మార్పుకు కూడా ఈ వ్యవసాయ ప్రధానమైన పర్వదినం ఓ సంకేతం.

సంక్రాంతికి ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాధాన్యం కూడా ఉంది. సంక్రాంతి రోజున సూర్యుడు ప్రవేశించే మకర రాశికి శనీశ్వరుడు అధిపతి. సూర్యుడు, శని తండ్రీకొడుకులు. అయితే ఈ ఇద్దరి మధ్యా బద్ధ వైరం ఉంది. మకర సంక్రాంతి రోజున మాత్రం ఈ ఇద్దరూ కలుసుకుని ఆనందోత్సాహాలు పంచుకుంటారట. సుమారు ఆరు నెలల పాటు ఉండే ఉత్తరాయణ పుణ్యకాలాన్ని దేవతల కాలంగా కూడా పరిగణిస్తారు.

ఎక్కువగా శుభకార్యాలు ఈ ఉత్తరాయణ కాలంలోనే చోటు చేసుకుంటాయి. ఇదే రోజున అసురుల మీద మహావిష్ణువు విజయం సాధించాడని పురాణాలు చెబుతున్నాయి. అంటే ఇప్పటి నుంచి మనిషి తనలోని ప్రతికూల లక్షణాలన్నిటిని భూస్థాపితం చేసి, సత్ప్రవర్తనను అలవరచుకోవాలన్నది దీని ఉద్దేశం.

మరి అటువంటి సంక్రాంతి రోజును కొన్ని నియమాలను పాటించడం వల్ల ఆధ్యాత్మిక ప్రయోజనాలను కూడా పొందుతారు. అంతే కాదు, ఈ మకర సంక్రాంతి రోజున చేసే కొన్ని పనుల వల్ల అద్రుష్టం వరిస్తుంది. మరి మకర సంక్రాంతి రోజున ఖచ్చితంగా చేయాల్సిన పనులేంటో ఒకాసిరి చూద్దాం..

సూర్యునికి గంగను నివేధించాలి

సూర్యునికి గంగను నివేధించాలి

మకర సంక్రాంతిని సూర్యునికి అంకితం కాబట్టి, ఆ రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి, అభ్యంగన స్నానం చేయాలి. సూర్య నమస్కారంతో సూర్యునికి గంగను నివేధించాలి. ఇలా చేయడం వెనుక సైంటిఫిక్ రీజన్ కూడా ఉండి. సూర్యునికి గంగను నివేధించే సమయంలో ఈ మంత్రం జపించాలి.

''ఓం గ్రానీ సూర్యాయా నమ: ''

ఈ మంత్రజపం వల్ల రాశిఫలాల ప్రకారం మీ జన్మ రాశిలో ఉన్నసూర్య స్థానం వల్ల వచ్చే అన్ని రకాల సమస్యలను నివారించడంలో గొప్పగా సహాయపడుతుంది.

నువ్వులు, బెల్లం ప్రాధాన్యత:

నువ్వులు, బెల్లం ప్రాధాన్యత:

మకర సంక్రాంతి రోజూను నువ్వులకు , బెల్లంకు ఎక్కువ ప్రాధాన్య ఉంది, వీటిని కొన్ని సాంప్రదాయ ఆహారా పదార్థాలను కూడా చేస్తుంటారు. ఈ రోజును వీటిని ఖచ్చితంగా తినాలంటారు . వింటర్ సీజన్ లో వ్యాధినిరోధకత తక్కువగా ఉంటుంది. కాబట్టి, త్వరగా జబ్బుల భారీన పడుతుంటారు. అలా జరగకుండా శరీరంలో వేడి కలిగించే గుణాలు ఈ రెండింటిలో ఉండటం వల్ల వీటిని తప్పనిసరిగా తినాలనే ఆనవాయితి పూర్వకాలం నుండి ఉంది. బెల్లం చేర్చడం శరీరానికి ఇన్ స్టాంట్ ఎనర్జీని పొందుతారు.

దాన ధర్మాలు:

దాన ధర్మాలు:

గ్రంథాల ప్రకారం, ఈ రోజున చేసే ధాన ధర్మాల వల్ల పుణ్యం లభిస్తాయని నమ్ముతారు. అందుకే ఈ మూడు రోజుల్లో చేసే దానాలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. అదృష్టం పొందాలంటే దుప్పట్లు, వెచ్చని దుస్తులు, వెన్న, తృణధాన్యాలు వంటివి దానం చేయడం వల్ల అదృష్టం పొందుతారు.

సూర్య నమస్కారాలు:

సూర్య నమస్కారాలు:

ఉదయం వచ్చే లేత సూర్య కిరణాల్లో కొంత సమయం కూర్చోవాలి. ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు అందుతాయి.. సూర్య నమస్కారాలు చేసే విధానం మీకు తెలుస్తే తప్పకుండా సంక్రాంతి రోజున చేయండి.

నదీ స్నానం:

నదీ స్నానం:

గంగ, యమున, సరస్వతి మూడు నదులు కలిసే చోట నదీ స్నానం చేస్తే ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు సిద్దిస్తాయి. అంతే కాదు, ఇలా చేయడం వల్ల ఆద్యాత్మికతో బంధం మరింత బలోపేతం అవుతుంది.

గాలిపటాల సంప్రదాయం:

గాలిపటాల సంప్రదాయం:

ఇక ఈరోజున మరో ముఖ్యమైన సంప్రదాయం రంగు రంగుల గాలిపటాలను ఎగురవేయుట. కుంటుంబ సభ్యుల, స్నేహితులతో గాలిపటాలే ఎగురవేస్తూ..సంక్రాంతి సంబరాలను సంతోషంగా జరపుకోవడమే ఈ పండుగ ప్రత్యేకత..

English summary

Makar Sankranti Special: Do These 5 Things On This Day For Auspicious Results

Makar Sankranti is one of the most awaited holidays that comes in the beginning of the year, apart from Republic Day. Makar Sankranti is celebrated with pomp and show in both the rural as well as urban India.
Story first published: Friday, January 13, 2017, 16:48 [IST]