For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మల్లికార్జున: ఆ పరమశివుడు రెండవ జ్యోతిర్లింగం యొక్క కథ

By Staff
|

మల్లికార్జున జ్యోతిర్లింగం ఆంధ్ర ప్రదేశ్ లోని శ్రీశైలంలో ఉన్నది. ఇది పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటి. లార్డ్ శివ భక్తుల ప్రార్థనకు చాలా పురాతనమైన ప్రదేశం.

ఇక్కడ శివుడు,పార్వతి ఇద్దరి జ్యోతిర్లిగాలు ఉండుట వలన చాలా విశిష్టమైనది. మల్లికార్జున అనేది రెండు పేర్ల కలయికతో ఏర్పడింది. మల్లిక అంటే పార్వతి అని అర్జున అంటే శివ అని అర్ధం.

మల్లికార్జున జ్యోతిర్లింగానికి మరో ప్రాముఖ్యత కూడా ఉంది. ఇది 275 పాదాల పెట్ర స్థలాలో ఒకటిగా ఉంది. పాదాల పెట్ర స్థలాలో శివునికి ప్రత్యేకమైన ఆలయాలు మరియు ప్రార్థనా స్థలాలు ఉన్నాయి.6 వ మరియు 7 వ శతాబ్దాలలో శివ నారాయణుని గొప్ప మరియు అత్యంత ముఖ్యమైన స్థలాలు మరియు దేవాలయాలు ఉన్నాయి. .

jyotirlinga

మల్లికార్జున ఒక శక్తి పీఠము

మల్లికార్జున 52 శక్తి పీఠాలలో ఒకటి. శివుడు అతని జీవిత భాగస్వామి సతి కాలి బుడిద అయిన సమయంలో శివుడు విధ్వంస నాట్యం చేసెను. అప్పుడు మహా విష్ణువు తన సుదర్శన చక్రంను ఉపయోగించి శరీరంను ముక్కలుగా కట్ చేసెను. ఆ ముక్కలు భూమి మీద పడిన ప్రదేశాలలో శక్తి యొక్క అనుచరులు ప్రార్థనా స్థలాలను ఏర్పాటు చేసారు. ఈ ప్రదేశాలు శక్తి పీఠాలుగా పూజింపపడుతున్నాయి.

దేవి సతి పై పెదవి మల్లికార్జున దగ్గర పడిందని చెప్పుతారు. అందువలన, మల్లికార్జునుడు హిందువులకు మరింత పరిశుద్ధమైన దేవుడిగా ఉన్నారు.

jyotirlinga

మల్లికార్జున జ్యోతిర్లింగం యొక్క పురాణము

మల్లికార్జున జ్యోతిర్లింగం గురించి భక్తులతో సంబంధం కలిగిన ఎన్నో కధలు ఉన్నాయి. ఇక్కడ అత్యంత ప్రజాదరణ పొందిన రెండు కధలు ఉన్నాయి. ఈ క్రింది కథ శివ పురాణంలో కోటిరుద్ర సంహిత 15 వ అధ్యాయంలో ఉన్నది.

ఒకసారి శివుడు,పార్వతి వారి ఇద్దరి కుమారులు వినాయకుడు మరియు లార్డ్ కార్తికేయకు వివాహం చేయాలనీ సంకల్పించి వధువు కోసం చూస్తున్నారు. కానీ వారిలో ముందుగా ఎవరికీ వివాహం చేయాలో అనే వాదన తలెత్తింది. అప్పుడు శివుడు ప్రపంచాన్ని చుట్టి మొదట ఎవరు వస్తారో వారికే ముందుగా వివాహం చేస్తానని చెప్పెను.

లార్డ్ కార్తికేయ తన నెమలి వాహనం ఎక్కి ప్రదక్షిణ చేయటం ప్రారంభించెను. వినాయకుడు తన తెలివితేటలతో ఏడు సార్లు తన తల్లిదండ్రులు చుట్టూ తిరిగి తనకు తల్లితండ్రులే ప్రపంచం అని చెప్పెను. అందువలన వినాయకుడు పోటీలో గెలిచాడని రిద్ది, సిద్ధి లను ఇచ్చి దేవతలు వివాహం చేసెను. లార్డ్ కార్తికేయ తిరిగి వచ్చాక విషయాన్నీ తెలుసుకొని చాలా ఆగ్రహం చెంది కైలాసం వదిలి క్రౌంచ పర్వతం మీద నివసిస్తానని వెళ్లిపోయెను. క్రౌంచ పర్వతం వద్ద తన పేరును కుమార బ్రహ్మచారిగా మార్చుకొనెను.

ఈ విషయంపై లార్డ్ శివ పార్వతీదేవి దిగులు చెందెను. దాంతో వారు క్రౌంచ పర్వతం వద్ద ఉన్న కార్తికేయ వద్దకు వెళాళ్లని నిర్ణయం చేసుకున్నారు. కార్తికేయ తన తల్లిదండ్రులు వస్తున్నారని తెలిసి మరొక ప్రదేశానికి వెళ్లెను. శివుడు పార్వతీదేవి వేచి ఉన్న స్థలాన్ని ప్రస్తుతం శ్రీశైలం అని పిలుస్తున్నారు. అమావాస్య రోజుల్లో శివుడు, పూర్ణిమ రోజుల్లో పార్వతి కార్తికేయను సందర్శిస్తారు.

మరొక కథ చంద్రవతి అనే యువరాణిది. ఈ కథను మల్లికార్జున జ్యోతిర్లింగ దేవాలయం గోడలపై ఉన్న శిల్పాల ద్వారా చూడవచ్చు.

చంద్రావతి పుట్టుకతోనే యువరాణి. కానీ ఆమె అన్ని వదిలేసి తపస్సు చేయాలనీ నిర్ణయం తీసుకుంది. ఆమె ధ్యానంలో మునిగి ఉన్నప్పుడు కడలి అడవిలో కపిల ఆవు బిల్వ చెట్టు సమీపంలో పాలను స్రవిస్తూ కన్పించెను. ఈ విధంగా ప్రతి రోజు జరగటంతో ఆమె కలవరపాటుకు గురి అయ్యి ఆ ప్రదేశంలో తవ్వగా ఆమెకు ప్రక్రుతితో ఏర్పడిన 'స్వయంభు శివలింగం' కనిపించెను. ఆ శివలింగం చాలా ప్రకాశవంతంగా మరియు నిప్పు వలె ఉండెను.

చంద్రావతి ఆ జ్యోతిర్లింగానికి భారీ ఆలయం కట్టి ఆరాధించెను. చంద్రావతి శివునికి అత్యంత ప్రియమైన భక్తురాలు అని చెప్పుతారు. ఆమె భక్తి గాలులు కైలాసం వరకు పాకాయి. చివరకు ఆమె ఆమె మోక్షం మరియు ముక్తిని సాధించింది.

jyotirlinga

మల్లికార్జున జ్యోతిర్లింగం వద్ద శివుని ప్రాముఖ్యత

ఇక్కడ శివుణ్ణి ప్రార్ధిస్తే అపారమైన సంపద మరియు కీర్తి వస్తాయని నమ్మకం.శివుని పట్ల నిజమైన భక్తిని చూపిస్తే కోరికలు మరియు ఆకాంక్షలు నెరవేరతాయి.

మల్లికార్జున జ్యోతిర్లింగం వద్ద పండుగలు

మహా శివరాత్రి అనేది ఇక్కడ జరుపుకొనే అతి ముఖ్యమైన పండుగ. ఈ పండుగను ప్రతి సంవత్సరం చాలా వైభవంగా మరియు ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం, మహా శివరాత్రి ఫిబ్రవరి 23 న వచ్చింది.

English summary

Mallikarjuna: The Story Of The Second Jyotirlinga

Mallikarjuna is one among the 52 Shakti Peethas. When Lord Shiva danced the dance of destruction with the burnt body of his spouse, Goddess Sati, Maha Vishnu cut the body into pieces using his Sudarshana Chakra. These pieces fell on to the earth and formed an important place of worship for the followers of Shakti. These places are revered to as Shakti Peethas.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more