For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Mangala Gauri Vrat Katha:మంగళ గౌరీ కథ వింటే మహిళల వైవాహిక జీవితం సంతోషకరంగా ఉంటుందట...!

|

హిందూ క్యాలెండర్ ప్రకారం, శ్రావణ మాసంలో వచ్చే నాలుగు మంగళవారాలు ఎంతో ప్రత్యేకమైనవి. ఆ నాలుగు వారాల పాటు మంగళ గౌరీ పూజలను చేయాలి. మంగళ గౌరీ అంటే ఎవరో కాదు.. సాక్షాత్తు పార్వతీదేవి. ఈ దేవినే మంగళగౌరీగా పిలుస్తారు.

ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన 'ఐదోతనం' జీవితాంతం నిలుస్తుందని చాలా మంది నమ్మకం. ఈ వ్రతం గురించి శ్రీక్రిష్ణుడు ద్రౌపదికి వివరించినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. ఈ సందర్భంగా శ్రావణ మాసంలో వచ్చే మంగళ గౌరీ వ్రతం ఎలా చేయాలి.. ఎవరెవరు చేయాలి.. ఈ వ్రతం నియమాలు.. పూజా పద్ధతులేంటి అనే విషయాల గురించి నిన్న తెలుసుకున్నాం కదా.. ఇప్పుడు మంగళ గౌరీ వ్రతం కథ గురించి ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Mangala Gauri Vrat 2021:మంగళ గౌరీ వ్రతాన్ని ఎలా చేయాలి... పూజా విధానాల గురించి తెలుసుకుందామా...

వ్రతం కథ..

వ్రతం కథ..

పురాణాల ప్రకారం.. పూర్వ కాలంలో ధర్మపాలుడనే అనే వ్యక్తి వద్ద అపారమైన సంపద, ఉండేది. తనకు అందమైన భార్య కూడా ఉండేది. వారి దగ్గర ఎంత డబ్బు, బంగారం, వజ్ర వైడూర్యాలు ఉన్నప్పటికీ వారి వంశానికి ఒక్క వారసుడు కూడా లేడు. వారు ఎంత ప్రయత్నించినా సంతానం కలగలేదు. దీంతో వారు చాలా బాధపడుతుండేవారు.

భర్త అనుమతితో..

భర్త అనుమతితో..

ఒకరోజు తన ఇంటికి వచ్చిన బిచ్చగాడికి తన భర్త అనుమతితో జోలేలో బంగారం వేసింది. దీంతో తను ఆగ్రహించి ఆమెకు సంతానం కలగకూడదనే శాపం పెట్టాడట. దీంతో ఆ దంపతులు అతన్ని ప్రార్థిస్తే అల్పాయుష్కుడైన ఒక కుమారుడు కలుగుతాడని, అయితే అతన్ని పెళ్లాడే అమ్మాయి తల్లి ‘మంగళ గౌరీ వ్రతం' చేసి కుమార్తెకు వాయనమిస్తే ఆ ప్రభావం వల్ల ఈ కుమారుడు మరణించడని, తను విధవ అవ్వదని సూచించాడు.

పదహారేళ్ల వయసులో..

పదహారేళ్ల వయసులో..

తను వెళ్లిన అనంతరం వారికి సంతానం కలుగుతుంది. తమ కుమారుడికి పదహారేళ్లు వయసు రాగానే కాశీకి వెళ్లే సమయంలో వీరికి మార్గం మధ్యలో దైవలీల ఫలితంగా మంగళ గౌరీ వ్రతాన్ని చేసిన తల్లి ‘సుశీల' అనే కన్య కనబడుతుంది. సుశీల తల్లిదండ్రులను ఒప్పించి సుశీలతో తమ కుమారునికి వివాహం జరిపిస్తారు. ఆమె సహచర్యంతో భర్తకు పదహారేళ్ల అకాల మరణం ఉన్నా.. ‘మంగళ గౌరీ' వ్రత వాయనం తీసుకున్న కారణంగా భర్తకు పూర్తి ఆయుష్ లభిస్తుంది.

నాగ పంచమి రోజున ఎన్ని రకాల పాములను పూజిస్తారంటే..

శ్రావణ మాసంలో..

శ్రావణ మాసంలో..

ఈ మంగళ గౌరీ వ్రతం అంతా శ్రావణ మాసంలోనే జరుగుతుంది. అందుకే అప్పటి నుండి శ్రావణ మంగళ గౌరీ వ్రతానికి ఎంతో విశిష్టత ఏర్పడింది. ఈ వ్రతా చరణ వల్ల స్త్రీలకు వైధవ్యం రాదని.. పుణ్య స్త్రీలుగా ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. మంగళగౌరీని ఉత్తరేణి దళాలతోనూ, గరికతోనూ ఆచరించడం తప్పనిసరి నిన్ననే చెప్పుకున్నాం కదా. అదే సమయంలో మహానివేదనలో పూర్ణం ఉన్న కుడుములు, బియ్యంతో చేసిన పరమానాన్ని నివేదించాలి.

సాయంత్రం సమయంలో..

సాయంత్రం సమయంలో..

వ్రతం నాటి సాయంత్రం ముత్తైదువులను పిలిచి నానబెట్టిన శనగలు వాయనంగా ఇచ్చి వారి ఆశీర్వచనాలు పొందాలి. ఈ వ్రతంలో ప్రత్యేకంగా పేర్కొనదగింది తోరపూజ. పసుపు పూసిన దారాన్ని మూడు పొరలుగా తీసుకుని, దానికి తొమ్మిది ముళ్లు వేస్తారు. ఆ దారానికి మధ్యమధ్యలో దవనాన్ని కడతారు. ఈ తోరాలను గౌరీ దేవి ముందు పెట్టి పూజ చేసి ఒక తోరాన్ని కట్టుకుంటారు. రెండో తోరాన్ని ముత్తైదువుకు ఇస్తారు. మూడో తోరాన్ని గౌరీ దేవికి సమర్పిస్తారు. ఈ విధంగా మంగళ గౌరీ వత్రం చేస్తే మంచి ఫలితం వస్తుంది. చివరగా వ్రతం మధ్యలో ఏదైనా కారణాల వల్ల ఆటంకం ఏర్పడితే.. ఆ వ్రతాన్ని తరువాతి సంవత్సరం కొనసాగించాలి. చివరగా ఉద్యాపన చేసిన వ్రతాన్ని ముగించాలి.

English summary

Mangala Gauri Vrat Katha in Telugu

Here we are talking about the mangala gauri vrat katha in Telugu. Read on
Story first published: Tuesday, August 10, 2021, 18:10 [IST]
Desktop Bottom Promotion