For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దీపావళి 2019 : ఈ పండుగ సమయంలో జపించాల్సిన ముఖ్యమైన మంత్రాల గురించి తెలుసా..

ఈ మహా లక్ష్మి మంత్రాన్ని దీపావళి సందర్భంగా మహా లక్ష్మి దేవి ఆశీర్వాదం కోసం పఠించాలి.

|

లక్ష్మీదేవి అమ్మవారు తన భక్తులకు సిరి సంపదలు, అన్ని అదృష్టాలను వరంగా ప్రసాదించే దేవతగా భక్తులందరూ కొలుస్తారు. హిందూమతంలో చాలా శక్తివంతంగా, ఎక్కువగా పూజింపబడే ఈ దేవతను ఉద్దేశించిన మంత్రాలను పఠించటం వలన అదృష్టం కలిసొస్తుంది. పాజిటివ్ తరంగాలను సృష్టించే అర్థవంతమైన పదాలే మంత్రాలు. ఇవి పఠించటం వలన విశ్వం నుంచి కోరుకున్న విషయాలు మీ వద్దకు ఆకర్షింపబడతాయి.

Diwali

ఈ ఏడాది అక్టోబర్ 27వ తేదీ నుండి రెండు లేదా మూడు రోజుల పాటు దీపావళి పండుగను జరుపుకుంటారు. ఈ పండుగ సందర్భంగా అమ్మవారిని అత్యంత నిజాయితీతో మరియు అపారమైన ఏకాగ్రతతో మంత్రాలను జపించడం వల్ల భక్తులకు, భగవంతులకు మధ్య సంబంధాన్ని సృష్టిస్తుంది. ఇది సానుకూల శక్తి ప్రవాహానికి దారి తీస్తుంది. ఈ నేపథ్యంలో మీరు ఇంట్లో ఎలాంటి లక్ష్మీదేవి ఫొటోలు, ఎలాంటి లక్ష్మీ మంత్రాలను జపించాలో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకోండి.

1) సాధన మంత్రం..

1) సాధన మంత్రం..

ఓం ఐమ్ హ్రీమ్ శ్రీమ్ ధన్ కురు కురు స్వాహా

దీపావళి పండుగ రోజున రాత్రి వేళ ఈ మంత్రాన్ని పఠిస్తే ఇది చాలా శక్తివంతంగా పని చేస్తుంది. ఈ మంత్రాన్ని 10 వేల సార్లు జపిస్తారు. మనకు అవసరమైన పనుల కోసం మంత్రాన్ని జపించేటప్పుడు విరామాలు అనుమతించబడతాయి. కానీ అవి ఖచ్చితంగా అవసరమైతే మాత్రమే. పూర్తి శ్లోకం విరామం లేకుండా చేయాలి. ఇందులో ఎవరు విజయం సాధించినా లక్ష్మీదేవి వారికి అపారమైన సంపదను ఇస్తుందని పురాణాల్లో పేర్కొనబడింది.

2) లక్ష్మి మంత్రం..

2) లక్ష్మి మంత్రం..

ఓం గమ్ శ్రీమ్ మహా లక్ష్మియే నమహా:

మీ జీవితంలో సంపద మరియు ఆదాయాన్ని ఆకర్షించడానికి ఈ మంత్రం సహాయపడుతుంది. ఈ మంత్రాన్ని క్రమం తప్పకుండా పఠించడం వల్ల జీవితానికి ఆటంకాలు తొలగిపోతాయి. ఈ మంత్రాన్ని ఒకే సిట్టింగ్‌లో వీలైనన్ని సార్లు జపించవచ్చు.

3) మహా లక్ష్మి మంత్రం

3) మహా లక్ష్మి మంత్రం

ఓం ష్రింగ్ హ్రింగ్ క్లింగ్ ఐంగ్ సాంగ్

ఓం హ్రింగ్ కా ఎ ఏయ్ హ్రింగ్ హా సా కా హా లా లా హరింగ్ సకల్ హ్రింగ్ సాంగ్ ఐంగ్ క్లింగ్ హ్రింగ్ ష్రింగ్ ఓం

ఈ మహా లక్ష్మి మంత్రాన్ని దీపావళి సందర్భంగా మహా లక్ష్మి దేవి ఆశీర్వాదం కోసం పఠించాలి. ఇది 21 సెట్లలో పఠించాల్సిన అవసరం ఉంది. ఇందులోని ప్రతి సెట్లో ఈ మంత్రం యొక్క 108 పారాయణాలు ఉంటాయి.

4) సరస్వతి మంత్రం

4) సరస్వతి మంత్రం

ఓం ఐమ్ సవస్వాత్యాయ్ స్వాహా:

సరస్వతి అమ్మ జ్ఞానం ప్రసాదించే దేవత. ఈ మంత్రం నిజమైన జ్ఞానం మరియు తెలివిని కోరుకునే భక్తులకు ఉపయోగపడుతుంది. సరస్వతి దేవి ముందు నెయ్యి దీపం వెలిగించి 108 సార్లు పఠించడం ద్వారా దీపావళి రాత్రి ఈ శ్లోకం చేయాలి.

5) సంతోష మంత్రం

5) సంతోష మంత్రం

ఓం శ్రీమ్ శ్రీ ఐ నమహా

ఈ లక్ష్మి మంత్రం జీవితంలోని అన్ని పరిస్థితులలోనూ ఆనందాన్ని పొందటానికి ప్రత్యేకంగా ఉద్దేశించబడింది. ఈ మంత్రం యొక్క శ్లోకాలు కుటుంబ సభ్యులందరిలో ఆనందం, ఐక్యత మరియు ప్రేమకు దారి తీస్తాయి. ప్రశాంతమైన జీవితానికి ఆనందం సమానంగా ముఖ్యం ఎందుకంటే ప్రశాంతమైన జీవితం సంపన్న జీవితానికి దారితీస్తుంది. దీపావళి రాత్రి ఈ మంత్రాన్ని 108 సార్లు పఠించండి.

6) బలమైన శక్తి మంత్రం..

6) బలమైన శక్తి మంత్రం..

ఓం ఐమ్ హ్రీమ్ క్లిమ్ చాముండయే విచే నమహా

ఈ మంత్రాన్ని బలమైన సంకల్ప శక్తిని సాధించడానికి మరియు అన్ని దుష్ట శక్తుల నుండి రక్షణ పొందటానికి కూడా పఠించాలి. దీపావళి రాత్రి నుండి ఈ మంత్రాన్ని ప్రారంభించి 40 సార్లు పఠించండి.

7) కుభేరుడి మంత్రం

7) కుభేరుడి మంత్రం

ఓం కుభేర్: త్వామ్ ధనాధీష్: గ్రెహ్ తే కమలా స్తితా.

మామ్'దేవీమ్'ప్రశయసు తవం ', మాడ్ 'గ్రే తే నమో నమ: ఓం.

ఈ శ్లోకం ద్వారా కుభేరుడిని సంతోషపెడితే మీ సంపద ఎల్లప్పుడూ సురక్షితంగా ఉంటుందని మరియు ఎప్పటికీ తగ్గకుండా చూస్తుంది. ఈ శక్తివంతమైన మంత్రాన్ని దీపావళి పండుగ రోజున ఉదయాన్నే కుభేరుడి ప్రతిమ లేదా చిత్రపటం వద్ద జపించండి.

8) గణేశ మంత్రం

8) గణేశ మంత్రం

ఓం గం గణపతయి నమహా

ఇది చాలా ప్రాచుర్యం పొందిన గణేశ మంత్రం. గణేశుడు జీవితంలో అన్ని అడ్డంకులను తొలగించేవాడు. కాబట్టి మీరు జీవితంలో సాధించగలిగే కొన్ని విషయాలను కనుగొంటే ఇంకా సాధించలేకపోతే, ఈ మంత్రాన్ని 10,000 సార్లు పఠించడం వల్ల మీరు ఎదుర్కొంటున్న అడ్డంకులు తొలగిపోతాయి.

9) రామ మంత్రం

9) రామ మంత్రం

ఓం అపదా మపా హర్తారామ్ డేటారామ్ సర్వ సమాపదం లోకా భీ రామమ్, శ్రీ రామన్ భూయో భూయో నమమ్యాహం

ఇది చాలా శక్తివంతమైన రామ్ మంత్రం. ఈ మంత్రాన్ని పఠించడం వల్ల వర్తమాన లేదా గతంలోని అన్ని మానసిక సమస్యలు తొలగిపోయి మీకు ఉపశమనం లభిస్తుంది.

10) శాంతి మంత్రం

10) శాంతి మంత్రం

ఓం శాంతి ఓం

ఈ మంత్రాన్ని ఇతర మతాల ప్రజలు కూడా విస్తృతంగా పఠిస్తారు. ఈ మంత్రం యొక్క శక్తిని వివిధ దేశాల ప్రజలు చాలా కాలం నుండి తెలుసు. జీవితంలో శాంతిని పొందడానికి ఈ మంత్రాన్ని పఠించండి. పోరాట సమయంలో ఒకరిని శాంతింపచేయడానికి కూడా దీనిని ఉపయోగించవచ్చు.

English summary

Diwali 2019: 10 Mantras To Chant During This Auspicious Festival

A mantra is a collection of meaningful words that creates a vibration or an aura that attracts the desired effects from the universal energy. The mantras dedicated to Goddess Lakshmi are no exception to this definition. If anything, they are counted among the most powerful of mantras.
Desktop Bottom Promotion