For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Mauni Amavasya 2022: మౌని అమావాస్య రోజున ఇలా చేస్తే.. ఈ దోషాల నుండి విముక్తి లభిస్తుందట...

మౌని అమావాస్య 2022 సందర్భంగా సర్ప దోషం పోవాలంటే ఈ చిట్కాలను ఫాలో అవ్వండి.

|

Mauni Amavasya 2022: హిందూ పంచాంగం ప్రకారం, మాఘ మాసంలో వచ్చే మౌని అమావాస్య ఎంతో ప్రత్యేకమైనది. ఈ రోజున పూర్వీకులకు తర్పణం, శ్రాద్ధం వంటివి చేస్తారు.

Mauni Amavasya 2022

వీటితో పాటు ఈ అమావాస్య రోజున కాలసర్ప దోషం, పిత్రు దోషాల నుండి విముక్తి పొందడానికి ఈరోజున చాలా మంది ఉపవాసం కూడా ఉంటారు. ఈ నేపథ్యంలో 2022 సంవత్సరంలో ఫిబ్రవరి ఒకటో తేదీన అంటే మంగళవారం నాడు మౌని అమావాస్య వచ్చింది.

Mauni Amavasya 2022

ఈ అమావాస్యనే భూమావతి అమావాస్య అని పిలుస్తారు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈసారి మౌని అమావాస్యకు ఎన్ని ప్రత్యేకతలున్నాయి.. ఈరోజున సర్పదోషం నుండి విముక్తి పొందడానికి ఏయే పరిహారాలు పాటించాలి.. ఏమేమి దానం చేయాలి.. ఏయే చిట్కాలను పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మాఘ అమావాస్య నాడు 12 రాశుల వారు ఇవి దానం చేస్తే.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా...మాఘ అమావాస్య నాడు 12 రాశుల వారు ఇవి దానం చేస్తే.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా...

నాలుగు గ్రహాల కలయిక..

నాలుగు గ్రహాల కలయిక..

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈ మౌని అమావాస్య సమయంలో సూర్యుడు, చంద్రుడు, బుధుడు, శని గ్రహాలన్నీ మకరరాశిలో సంయోగం చెందడం వల్ల చతుర్గ్రహీ యోగం ఏర్పడనుంది. అంతేకాకుండా మూడు సంవత్సరాల తర్వాత మౌని అమావాస్య మంగళవారం రోజున వచ్చింది. దీని కంటే ముందు 2018 సంవత్సరంలో కూడా ఇలా వచ్చింది. 22 సంవత్సరాల తర్వాత ఇలాంటి శుభ సంఘటన జరుగుతుంది. అందుకే ఫిబ్రవరి ఒకటో తేదీన చాలా శుభకరంగా ఉంటుంది.

సూర్య భగవానుడికి..

సూర్య భగవానుడికి..

ఈ పవిత్రమైన రోజున పవిత్ర నదిలో లేదా గంగానది కలిసి నీటిలో స్నానం చేయడం శుభప్రదంగా ఉంటుంది. ఈరోజున పూర్వీకులకు తర్పణం సమర్పించే సంప్రదాయం ఉంది. ఈ సమయంలో స్నానం చేసిన తర్వాత, పూర్వీకులకు తర్పణం చేయండి. అదే విధంగా నీళ్లలో ఎర్రని పువ్వులు, ఎర్ర చందనం కలిపి సూర్య భగవానుడికి నీళ్లు సమర్పించాలి. దీని తర్వాత పీపాల్, తులసికి నీరు పోసిన తర్వాత ప్రదక్షిణలు చేయండి. పూర్వీకుల ఆశీస్సులు పొందేందుకు ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండాలి. అలాగే ఈరోజున ఉన్నిబట్టలు, నువ్వులు, పాదరక్షలను అవసరమైన దానం చేయాలి.

ప్రవహించే నీటిలో..

ప్రవహించే నీటిలో..

మీరు కాలసర్ప దోషం నుండి బయటపడేందుకు మౌని అమావాస్య రోజున ఒక జత వెండి సర్పాలను లేదా వెండి సర్పాలను తయారు చేయించి.. వాటిని పూజించాలి. అనంతరం ప్రవహించే నీళ్లలో వాటిని వదిలేయండి. ఇలా చేయడం వల్ల మీకు కాల సర్ప దోషం నుండి విముక్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు.

February Horoscope 2022: ఫిబ్రవరి నెలలో ఈ రాశుల వారికి శుభ ఫలితాలు.. మీ రాశి కూడా ఉందేమో చూడండి...February Horoscope 2022: ఫిబ్రవరి నెలలో ఈ రాశుల వారికి శుభ ఫలితాలు.. మీ రాశి కూడా ఉందేమో చూడండి...

పూర్వీకులకు తర్పణం..

పూర్వీకులకు తర్పణం..

మౌని అమావాస్య రోజున పూర్వీకులకు తర్పణం, పిండ ప్రదానం, శ్రాద్ధ కర్మ మొదలైన వాటిని చేయడం వల్ల మీకు కాల సర్ప దోషం నుండి విముక్తి లభిస్తుంది. అలాగే పిత్రు దోషం కూడా తొలగిపోతుందని పండితులు చెబుతున్నారు.

పరమేశ్వరునికి పూజ..

పరమేశ్వరునికి పూజ..

మౌని అమావాస్య రోజున స్నానం చేసిన తర్వాత పేదలకు పప్పులు, నువ్వులు వంటి పదార్థాలతో కొంత ధనాన్ని దానధర్మాలు చేయాలి. అనంతరం పరమేశ్వరుడిని పూజించాలి. అదే సమయంలో శివతాండవ స్తోత్రాన్ని పఠించాలి. ఈశ్వరుని అనుగ్రహంతో మీకు కాల సర్ప దోషం నుండి విముక్తి లభిస్తుంది. ఎవరికైతే సర్పదోషం ఉంటుందో.. వారు క్రమం తప్పకుండా భోలేనాథునికి నీటిని సమర్పించి ఎంతో భక్తిశ్రద్ధలతో పూజించాలి. అప్పుడు పరమేశ్వరుని అనుగ్రహంతో అన్ని రకాల దోషాలు తొలగిపోతాయి.

FAQ's
  • కాల సర్ప దోషం నుండి విముక్తి పొందాలంటే ఏమి చేయాలి?

    మీరు కాలసర్ప దోషం నుండి బయటపడేందుకు మౌని అమావాస్య రోజున ఒక జత వెండి సర్పాలను లేదా వెండి సర్పాలను తయారు చేయించి.. వాటిని పూజించాలి. అనంతరం ప్రవహించే నీళ్లలో వాటిని వదిలేయండి. ఇలా చేయడం వల్ల మీకు కాల సర్ప దోషం నుండి విముక్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు. అదే సమయంలో పరమేశ్వరుడిని పూజించాలి. అదే సమయంలో శివతాండవ స్తోత్రాన్ని పఠించాలి. ఈశ్వరుని అనుగ్రహంతో మీకు కాల సర్ప దోషం నుండి విముక్తి లభిస్తుంది.

  • మౌని అమావాస్య చేయాల్సిన ముఖ్యమైన పనులేంటి?

    ఈ పవిత్రమైన రోజున పవిత్ర నదిలో లేదా గంగానది కలిసి నీటిలో స్నానం చేయడం శుభప్రదంగా ఉంటుంది. ఈరోజున పూర్వీకులకు తర్పణం సమర్పించే సంప్రదాయం ఉంది. ఈ సమయంలో స్నానం చేసిన తర్వాత, పూర్వీకులకు తర్పణం చేయండి. అదే విధంగా నీళ్లలో ఎర్రని పువ్వులు, ఎర్ర చందనం కలిపి సూర్య భగవానుడికి నీళ్లు సమర్పించాలి. దీని తర్వాత పీపాల్, తులసికి నీరు పోసిన తర్వాత ప్రదక్షిణలు చేయండి. పూర్వీకుల ఆశీస్సులు పొందేందుకు ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండాలి. అలాగే ఈరోజున ఉన్నిబట్టలు, నువ్వులు, పాదరక్షలను అవసరమైన దానం చేయాలి.

  • 2022 సంవత్సరంలో మౌని అమావాస్య ఎప్పుడొచ్చింది?

    2022 సంవత్సరంలో ఫిబ్రవరి ఒకటో తేదీన అంటే మంగళవారం నాడు మౌని అమావాస్య వచ్చింది. ఈ అమావాస్యనే భూమావతి అమావాస్య అని పిలుస్తారు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈసారి మౌని అమావాస్యకు ఎన్ని ప్రత్యేకతలున్నాయి.. ఈరోజున సర్పదోషం నుండి విముక్తి పొందడానికి ఏయే పరిహారాలు పాటించాలి.

English summary

Mauni Amavasya 2022: Kaal Sarp Dosh Upay Follow These Tips To Get Rid of This

Here we are talking about the Mauni Amavasya 2022:kaal sarp dosh upay follow these tips to get rid of this. Have a look
Story first published:Tuesday, February 1, 2022, 10:03 [IST]
Desktop Bottom Promotion