For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మౌని అమావాస్య రోజున ఆ నది నీళ్లు అమృతంలా మారిపోతాయా?

|

'మౌని అమావాస్య' అంటే మౌన వ్రతం పాటించడం అని చాలా మంది హిందువులు నమ్ముతారు. అంతేకాదు ఆ రోజును మౌనంగా ఉండే అమావాస్య అని కూడా అంటారు. ఈ పర్వదినాన సాధువులు, యోగులు మౌనంగా ఉంటారు. ఇళ్లలో నివసించే మహిళల్లో చాాలా మంది మౌనవ్రతం పాటిస్తారు. ఈరోజున జ్ఞానాన్ని నిద్రలేపే చర్యగా భావించి, మాటలు అవసరం లేదని భావిస్తారు.

ఎందుకంటే ఆరోజు మాట్లాడేందుకు లేదా ఏదైనా విషయం చెప్పేందుకు ఏమీ ఉండదని భావిస్తారు. ఆ పర్వదినాన నదీ స్నానాలు చేసి పిత్రు దేవతలను తలచుకుంటూ పిండ ప్రదానాలు చేస్తారు.

అసలు ఆరోజే ఎందుకు నదులల్లో స్నానాలు చేస్తారంటే ఆ పవిత్రమైన రోజున నదీ నీరు అమృతంలా మారిపోతుందట. అందుకే అందరూ ఆరోజు చాలా మంది నదులలో స్నానం ఆచరించేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. ఆ పవిత్రమైన రోజున అందరూ ఆందోళన తగ్గించేందుకు రుద్రాక్ష మాలను ధరిస్తారట. అలా చేస్తే మనసంతా ప్రశాంతంగా ఉంటుందని చాలా మంది నమ్ముతారు.

మౌని అమావాస్య నాడు..

మౌని అమావాస్య నాడు..

మౌని అమావాస్య రోజున ఆకాశంలో చంద్రుడు కనపించడు. సాధారణంగా ఏ అమావాస్యకు చంద్రుడు కనిపించడని మనకు తెలుసు. అయితే ఆరోజున ఏవైనా నిర్ణయాలు తీసుకున్న.. ఏవైనా మాటలు మాట్లాడినా అనుకూలమైన ఫలితాలు రావట.

భగవద్గీతో క్రిష్ణుడు ఏమన్నాడంటే..

భగవద్గీతో క్రిష్ణుడు ఏమన్నాడంటే..

శ్రీ క్రిష్ణుడు భగవద్గీతలో చెప్పిన విధంగా మన మనసే మనకు నిజమైన స్నేహితుడు లేదా గొప్ప స్నేహితుడు. అందుకు సరిగ్గా శిక్షణ ఇస్తే అది నియంత్రణలో ఉంటుంది.

శత్రువుగా మారుతుంది..

శత్రువుగా మారుతుంది..

దానిపై మనం నియంత్రణ ఎత్తివేస్తే అదే మనకు గొప్ప శత్రువుగా మారిపోతుందని భగవత్గీతలో శ్రీక్రిష్ణుడు చెప్పారు. మన శరీరాన్ని, మనసును, ఆత్మను కూడా శుద్ధి చేసుకునేందుకు పవిత్ర నదుల్లో స్నానం మరియు మౌనంగా ఉండేందుకు ఓ సంప్రదాయంగా భావిస్తారు.

అందుకే ఆరోజున చాలా మంది మహిళలు ఉపవాసం ఉంటారు. తమ పెదవిని కదపకుండా, మాట బయటకు పోకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటారు.

గంగానది నీరు..

గంగానది నీరు..

మౌని అమావాస్య రోజున గంగానది నీరు అమృతంగా మారుతుందని అనేక మంది నమ్ముతారు. అందుకనే ఆరోజున గంగా నదిలో స్నానం చేయడానికి భక్తులు బారులు తీరుతారు. గంగానదిలో స్నానానికి ఆరోజు అత్యంత పవిత్రమైన రోజు అని చాలా మంది హిందువుల నమ్మకం.

మరో పేరు..

మరో పేరు..

మౌని అమావాస్యకు మరో పేరు కూడా ఉంది. మౌని అమావాస్యను మాఘి అమావాస్య అని కూడా అంటారు. దీన్ని ఎక్కువ ఉత్తర భారతంలో నమ్ముతారు. మౌని అమావాస్య పదాల్లో ఉన్న ఆధ్యాత్మికత చాలా గొప్పది. దీనిని మౌని, అమా, వాస్య అని కూడా విడదీస్తారట. ఇందులో నుండి ఒక్కో అర్థం వచ్చేలా మన పెద్దలు వివరించారట.

పగటి పూట..

పగటి పూట..

మౌని అంటే మాట్లాడకుండా మౌనంగా ఉండటం, అమా అంటే చీకటి.. వాస్య అంటే కామం. ఇలా మొత్తం దీని అర్థం ఏమిటంటే పగటిపూట మౌనంగా ఉండి చీకటిని, కామాన్ని నిగ్రహంగా ఉంచుకోవడం. జ్యోతిష శాస్త్రం ప్రకారం మనసులను నియంత్రించే గ్రహమని నమ్ముతారు.

ఆఖరి అమావాస్య..

ఆఖరి అమావాస్య..

ఈ అమావాస్యను మహా శివరాత్రి ముందు వచ్చే ఆఖరి అమావాస్య అని కూడా అంటారు.

దగ్గర్లో నది లేకపోతే..

దగ్గర్లో నది లేకపోతే..

మీకు దగ్గరలో నదీ ప్రాంతం లేకపోతే మీరు నదీ నీళ్లను కొంచెం తెచ్చుకుని.. లేదా మీతో ఇప్పటికే నిల్వ ఉంటే వాటిలో కొన్ని చుక్కలను మీ స్నానం చేసే పాత్రలో వేయండి.

ఈ మంత్రాన్ని జపించండి..

ఈ మంత్రాన్ని జపించండి..

స్నానం సమయంలో ఈ మంత్రాన్ని జపించండి. ‘‘గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి, నర్మదా సింధు, కావేరి జలేస్మిన్ సన్నిధుం కురు‘‘ అనే మంత్రాన్ని పఠించండి. దీని వల్ల అన్ని పవిత్ర నదుల ఆశీర్వాదం మీకు లభిస్తుంది.

పెద్దలను గుర్తు చేసుకుంటూ..

పెద్దలను గుర్తు చేసుకుంటూ..

అనంతరం మీరు మీ పెద్దలను గుర్తు చేసుకుంటూ.. వారిని గౌరవిస్తు వారి ఆశీస్సులు కూాడా కోరవచ్చు. అలాగే పేదలకు దానధర్మాలు కూడా చేయండి.

రుద్రాక్షలను ధరించాలి...

రుద్రాక్షలను ధరించాలి...

రుద్రాక్షలకు చంద్రుడితో బంధం ఉన్నందున మీరు ఈరోజున రుద్రాక్ష మాలను ధరించాలి. కాకపోతే రుద్రాక్షలు ద్విముఖి లేదా పదహారు ముఖి అయి ఉండాలి. ఇవి వేసుకున్న వారిని ప్రశాంతత పెరుగుతుంది.

పశుపక్ష్యాదులకు..

పశుపక్ష్యాదులకు..

ఈ పర్వదినాన పశుపక్ష్యాదులు కుక్కలు, ఆవులు మరియు కాకుల వంటి వాటికి ఆహారం పెట్టాలి. ఈరోజున శనీశ్వరుడిని కూడా పూజించాలి. అలాగే నువ్వుల నూనెతో శనీశ్వరుడికి అభిషేకం చేయాలి.

English summary

Mauni Amavasya Puja Vidhi and Significance of Maun Vrat

Mauni amavasya is celebrated on the new moon day in the month of Paush. It usually falls during the months of January and February. Mauni amavasya is considered to be immensely holy and is a day set aside for taking the holy bath in sacred rivers.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more