For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దసరా నవరాత్రులు 2019 : శ్రీ దుర్గాదేవి తొమ్మిది రూపాల అలంకరణలు..

|

మీ మనసును నిర్మలంగా ఉంచాలనుకుంటే మహర్షులు చెప్పిన మార్గాలను ప్రయత్నించొచ్చు. ఇంతకీ వారు ఏమి చెప్పారంటే.. మనసు నిర్మలంగా ఉంచుకునేకుందుకు శక్తి ఆరాధన అతి ముఖ్యమైనది. శక్తి స్వరూపిణి పరమేశ్వరి, పార్వతీ, గాయత్రి, మహాకాళి, మహాలక్ష్మీ, మహా సరస్వతి, కనకదుర్గ, లలిత, రాజరాజేశ్వరి ఇలా ఏ పేరుతో పిలిచినా ఆయా రూపాల్లో ఉండే 'పరాశక్తి' ఒక్కటే.

Durga Devi
 

శరత్ కాలంలోని శరన్నవరాత్రులు దుర్గాదేవి (పరాశక్తి)ని పూజిస్తే భక్తుల జన్మజన్మల పాపాలు, బాధలు దూరం అవుతాయని హిందువుల ప్రగాఢ నమ్మకం. దేవిని ఉపాసన చేస్తూ నిర్వహించే ఉత్సవాలే దసరా ఉత్సవాలుగా ప్రాచుర్యం పొందాయి. ఈ ఉత్సవాలు 9 రోజుల పాటు జరుగుతాయి. కాబట్టి వీటికి నవరాత్రులనే పేరు వచ్చింది. రాత్రి అంటే తిథి అనే అర్థం. దీని ప్రకారం అశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు జరిగే ఉత్సవాలను నవరాత్రి ఉత్సవాలు అంటారు. తొమ్మిది రోజుల పాటు నియమాల ప్రకారం అర్చనలు చేయలేని వారు చివరి మూడు రోజు అష్టమి, నవమి, దశమి రోజుల్లో అయినా దుర్గాదేవిని ప్రార్థిస్తే, అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని శాస్త్రం చెబుతోంది.

Durga Devi

శరత్ రుతువు కాలంలో వర్షాకాలం ముగిసిపోయి చలికాలం మొదలవుతుంది. ఈ సమయంలో వాతావరణంలో కలిగే మార్పులు అనేక రోగాలకు కారణమవుతాయి. అందుకే ఈ అశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు శక్తి ఆరాధన పేరుతో ప్రజలంతా శుచిగా, శుభ్రంగా ఉండి ఎలాంటి రోగాల దరిజేరవన్నది ఈ నవరాత్రి వేడుకల వెనుక ఉన్న చరిత్ర.శరన్నవరాత్రుల సమయంలో ఒక్కోఅమ్మవారిని ఆరాధించడం వలన ఒక్కో విశేష ఫలితం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. సో నవరాత్రుల్లో అమ్మవారు దర్శనమిచ్చే రూపాలెంటో తెలుసుకోవాలంటే కిందికి స్క్రోల్ చేయాల్సిందే.

శ్రీ బాలాత్రిపుర సందరీ దేవి..

శ్రీ బాలాత్రిపుర సందరీ దేవి..

ఫత్రిపురాత్రయంలో శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి ప్రథమ స్థానంలో ఉంటుంది. ఆమెకు ఎన్నో మహిమాన్వితమైన శక్తులున్నాయి. సమస్త దేవీ మంత్రాల్లో శ్రీ బాలా మంత్రం గొప్పది. సకల శక్తి పూజలకు మూల మైన శ్రీ బాలాదేవి జగన్మోహనకారాన్ని పవిత్రమైన శరన్నవరాత్రుల్లో తొలిరోజు దర్శించి, ఆమె అనుగ్రహాన్ని పొందితే, సంవత్సరం పొడవునా అమ్మవారికి చేసే పూజలన్నీ సత్వర ఫలితాలనిస్తాయి.

శ్రీ గాయత్రి దేవి..

శ్రీ గాయత్రి దేవి..

ముక్తా విద్రుమ హేమనీల ధవల వర్థాలలతో ప్రకాశిస్తు, పంచ ముఖాలతో దర్శనమిస్తుంది. సంధ్యా వందనం అధి దేవత. గాయత్రి మంత్రం రెండు రకాలు: 1) లఘు గాయత్రి మంత్రం 2) బ్రహద్గాయత్రి మంత్రం. ప్రతిరోజూ త్రిసంధ్యా సమయాల్లో వేయిసార్లు గాయత్రి మంత్రాన్ని పఠిస్తే వాక్సుద్ధి కలుగుతుంది.

లలిత త్రిపుర సుందరీ దేవి..
 

లలిత త్రిపుర సుందరీ దేవి..

త్రిపురాత్రయంలో రెండో శక్తి శ్రీ లలితా దేవి అలంకారం. త్రిముర్తుల కన్నా ముందు నుండి ఉన్నది కాబట్టి త్రిపుర సుందరి అని పిలువబడుతుంది. శ్రీ చక్ర అధిష్టాన శక్తి, పంచదశాక్షరి అధిష్టాన దేవత. ఆదిశంకరాచార్యులు శ్రీ చక్రయంత్రాన్ని ప్రతిష్టించక పూర్వం ఈ దేవి ఉగ్ర రూపిణిగా ‘చండీదేవి‘గా పిలవబడేది. ఆదిశంకరాచార్యులు శరీర చక్రయంత్రాన్ని ప్రతిష్టించాక పరమశాతం రూపిణిగా లలితా దేవిగా పిలవబడుతున్నది.

శ్రీ సరస్వతీ దేవి..(మూలా నక్షత్రం రోజున)

శ్రీ సరస్వతీ దేవి..(మూలా నక్షత్రం రోజున)

చదువుల తల్లి సరస్వతీ దేవి అలంకారం త్రి శక్తులలో ఒక మహాశక్తి శ్రీ సరస్వతీ దేవి. సరస్వతీ దేవి సప్తరూపాలలో ఉంటుందని మేరు తంత్రంలో చెప్పబడింది. అవి చింతామణి సరస్వతి, నిల సరస్వతి, ఘట సరస్వతి, కిణి సరస్వతి, అంతరిక్ష సరస్వతి, మరియు మహా సరస్వతి. మహాసరస్వతి దేవి శుంభని శుంభులనే రాక్షసులను వధించింది.

శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవి..

శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవి..

నిత్యాన్నదానేశ్వరి శ్రీ అన్నపూర్ణా దేవి అలంకారం అన్నం జీవుల మనుగడకు ఆధారం. జీవకోటి నశించకుండా వారణాసి క్షేత్రాన్ని వారణాసి క్షేత్రాన్ని నిజ క్షేత్రంగా, క్షేత్ర అధినాయకుడు విశ్వేశ్వరుడి ప్రియపత్నిగా శ్రీ అన్నపూర్ణా దేవి విరాజిల్లుతుంది.

శ్రీ మహాలక్ష్మీ దేవి..

శ్రీ మహాలక్ష్మీ దేవి..

మంగళ ప్రద దేవత శ్రీ మహాలక్ష్మీ దేవి అలంకారం అష్టరూపాలతో అష్ట సిద్ధులు ప్రసాదించే దేవత. రెండు చేతులలో కమలాలని ధరించి, వరదాభయ హస్తాల్ని ప్రదర్శిస్తూ, పద్మాసనిగా దర్శనమిస్తుంది. ఆది పరాశక్తి మహాకాళీ, మహాలక్ష్మీ, మహాసరస్వతి రూపాలు ధరించింది. ఆ ఆదిపరాశక్తి రూపంగానే మహాలక్ష్మీ అలంకారం జరుగుతుంది.

శ్రీ దుర్గా దేవి..

శ్రీ దుర్గా దేవి..

దుర్గతులను నాశనం చేసే దేవత శ్రీ దుర్గా దేవి. ‘దుర్గముడు‘ అనే రాక్షసున్ని సంహరించింది. అష్టమి రోజునే కనుక ఈరోజును దుర్గాష్టమి అని, దుర్గమున్ని సంహరించిన అవతారం కనుక దేవిని ‘దుర్గా‘ అని పిలుస్తారు. శ్రీ దుర్గాదేవి ఉగ్రస్వరూపిణి కనుక ఈ దేవిని దుర్గా అష్టోత్తరాలు, దుర్గా సహస్రనామాలకు బదులు శ్రీ లలితా అష్టోత్తరాలు, శ్రీ లలిత సహస్రనామాలతో పూజిస్తారు. ఎందుకంటే లలితా పరమ శాంత రూపం కనుక.

శ్రీ మహిషాసుర మర్దినీ దేవి..

శ్రీ మహిషాసుర మర్దినీ దేవి..

మహిశాసురున్ని చంపడానికి దేవతలందరూ తమ తమ శక్తులను ప్రదానం చేయగా ఏర్పడిన అవతారం ఇది. సింహాన్ని వాహనంగా ఈ దేవికి హిమవంతుడు బహుకరించాడు. సింహ వాహనంతో రాక్షస సంహారం చేసి అనంతరం ఇంద్ర కీలాద్రిపై వెలిసింది.

శ్రీ రాజరాజేశ్వరి దేవి..

శ్రీ రాజరాజేశ్వరి దేవి..

అపజయం అంటే ఎరుగని శక్తి కాబట్టి ఈ మాతను ‘అపరాజిత‘ అంటారు. ఎల్లప్పుడూ విజయాలను పొందుతుంది. కాబట్టి ‘విజయ‘ అని కూడా అంటారు. శ్రీ రాజరాజేశ్వరి దేవి ఎప్పుడూ శ్రీ మహా పరమేశ్వరుడి అంకముపై ఆశీనురాలై ఉంటుంది.

English summary

Navratri 2019 : Nine Avatars of Durga Devi

Hindus are widely believed that worshiping Durga Devi (Parasakti) during the Saratvara period is a farce from the sins and sufferings of the devotees. The Dasara festivals are popularly known as Dasara festivals. The festivities last for 9 days. So these are called Navaratras. Night means tithi. Accordingly, the festivals from Ashwuja Shuddha Padyami to Navami are called Navratri festivals
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more