For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నవరాత్రి 2019 : రెండోరోజు బ్రహ్మచారిణి అవతారంలో దుర్గమ్మ ఎందుకు దర్శనమిస్తారో తెలుసా..

|

బ్రహ్మచారిణి : దుర్గామాత రెండవ అవతారం బ్రహ్మచారిణి. పరమేశ్వరుని భర్తగా పొందడానికి నారదుడి ఉపదేశానుసారం ఘోరతపస్సు చేస్తుంది. ఆకులు కూడా తినకుండా ఉన్నందున అపర్ణగా ప్రసిద్ధి. పరమేశ్వరుని భర్తగా పొందే వరకు ఈమె బ్రహ్మచారిణి. ఆమెకే కన్యాకుమారి అనే మరోపేరుంది. ఈ మాతను ఉపాసించే వారికి సర్వత్రాసిద్ధి విజయాలు ప్రాప్తిస్తాయి.

బ్రహ్మచారిణి విశిష్టతలు:
శ్రీశైల భ్రమరాంభిక రెండవ అవతారం ''బ్రహ్మాచారిణి''
దధానా కరపద్మాభ్యాం అక్షమాలాకమండలూ
దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా !!

 Story of Brahmacharini: Second Goddess of Navaratri

దుర్గామాత యొక్క నవశక్తులలో రెండవది'బ్రహ్మచారిణి' స్వరూపమం. ఈ సందర్బంలో 'బ్రహ్మ' అనగా తపస్సు. . 'బ్రహ్మచారిణి' అనగా తమాచరించునది. 'వేదస్త్వం తపోబ్రహ్మ' -'బ్రహ్మ' మనగా వేదము, తత్త్వము, తపస్సు. బ్రహ్మచారిణీదేవి స్వరూపము పూర్తిగా జ్మోతిర్మయము, మిక్కిలి శుభంకరమూ, భవ్యము. ఈ దేవి కుడిచేతిలో జపమాల, ఎడమచేతిలో కమండలాన్నీ ధరించి ఉంటుంది.

 Story of Brahmacharini: Second Goddess of Navaratri

హిమవంతుని కూతరైన పార్వతియే ఈ బ్రహ్మచారిణీ దేవి. ఈమె పరమేశ్వరుణ్ణి పతిగా పొందడానికి నారదుడి ఉపదేశాన్ని అనుసరించి ఘోరతపము ఆచరిస్తుంది. ఈ కఠిన తపశ్చర్యకాలంలో ఈమె కేలం ఫల, కంద మూలములను మాత్రమే ఆరగిస్తూ లెక్కలేనన్ని సంవత్సరాలు గడుపుతుంది. కేవలం పచ్చికాగూరలనే తింటూ మరికొన్ని సంవత్సరాలు, కఠినోపవాసములతో ఎలాంటి ఆఛ్చాదనమూ లేకుండా ఎండలలో ఎండుతూ, వానలలో తడుస్తూ కొంత కాలంపాటూ తపస్సును ఆచరిస్తుంది. ఇలాంటి కఠినతరమైన తపస్సును ఆచరించిన తర్వాత మరింకెన్నో సంవత్సరాలపాటు నేలపై రాలిన ఎండుటాకులను మాత్రమే స్వీకరిస్తూ పరమేశ్వరుణ్ణి అహర్నిశలూ ఆరాధిస్తుంది. మెల్లిగా ఎండుటాకులను కూడా తినటం మానేసి, 'అపర్ణ'యై చాలాకాలం పాటు ఆహారం, నీళ్ళు కూడా ముట్టకుండా ఘోరమైన తపస్సును ఆచరిస్తుంది.

 Story of Brahmacharini: Second Goddess of Navaratri

ఇలా చాలాకాం పాటు కఠినమైన తపస్సును కొనసాగించటం వల్ల బ్రహ్మచారిణి దేవి శరీరం పూర్తిగా క్రుశించి పోతుంది. ఈవిడ స్థితిని చూసి తల్లియైన మేనాదేవి ఎంతగానో దుంఖిస్తుంది. ఈమెను ఈ కఠిన తపస్సు నుండి మరలించడానికి తల్లి 'ఉ మా' 'బిడ్డ ! వలదు, వలదు' అని పలికినందున, బ్రహ్మచారిణి దేవి పేరు 'ఉమా' అని ప్రసిద్ది కెక్కింది.

బ్రహ్మచారిణీదేవి చేసిన ఘోరతపస్సు కారణాన, ముల్లోకాలలో హాహాకారాలు చెలరేగుతాయి. దేవతలూ, బుషులూ, సిద్ధులూ, మునులూ మొదలైనవారందరూ ఈ విడ తపస్సు కనీవిని ఎరుగనటువంటి పుణ్యకార్యమని పలుకుతూ ఈవిడను కొనియాడతారు. చివరికి పితామహుడైన బ్రహ్మదేవుడు, అశరీరవాణి ద్వారా ఈమెను సంబోధిస్తూ ప్రసన్నమైన స్వరంలో ఇలా పలుకుతారు ''దేవీ! ఇట్టి కఠోర తపస్సును ఇంతవరకూ ఎవ్వరునూ ఆచరింపలేదు. ఇది నీకే సాధ్యమైనది.

 Story of Brahmacharini: Second Goddess of Navaratri

అలౌకికమైన నీ తపశ్చర్య సర్వత్ర శ్లాఘించబడుచున్నది. నీ మనోవాంఛ సంపూర్ణంగా నెరవేరును. చంద్రమౌళియైన పరమేశ్వరుడు అవశ్యముగా నీకు పతియగును. ఇక నీవు తపస్సు విరమించి ఇంటికి మరలుము. త్వరలోనే నీ తండ్రి నిన్ను ఇంటికి తీసికొని పోవుటకై వచ్చును''.

 Story of Brahmacharini: Second Goddess of Navaratri

దుర్గామాత యొక్క ఈ రెండవ స్వరూపం భక్తులకూ, సిద్ధులకూ అనంతఫలప్రదము. ఈమెను ఉపాసించటం వల్ల మానవులలో తపస్సూ, త్యాగమూ, వైరాగ్యమూ, సదాచారం, సంయమమ వృద్ది చెందుతాయి. జీవితంలో ఎంలాంటి ఒడుదుడుకులు ఎదురైనా దేవి అనుగ్రహంతో వారి మనస్సులు కర్తవ్వమార్గం నుండి మరలవు. లోకమాత అయిన బ్రహ్మచారిణీదేవి కృప వలన ఉపాసకులకు సర్వత్ర సిద్దీ, విజయాలు ప్రాప్తిస్తాయి. దుర్గా నవరాత్రి పూజలలో రెండవరోజున ఈమె స్వరూపం ఉపాసించబడుతుంది. ఈ రోజు సాధకుని మనస్సు స్వాధిష్టాన చక్రములో స్థిరమవుతుంది. ఈ చక్రంలో స్థిరమైన మనస్సుల యోగి, ఈమె కృపకు పాత్రుడగుతాడు. అతనికి ఈమె యెడల భక్తి ప్రపత్తులు దృఢమవుతాయి.

English summary

Navratri 2019 : Puja vidhi for goddess Bramhacharini on Day 2

Story of Brahmacharini: Second Goddess of Navaratri,Brahmacharini or Devi Yogini is the second manifestation and mightiest forms of Goddess Durga. The second day of Navratri is devoted for Goddess Brahmacharini. With a unique blend of radiance, she takes her devotes to the spiritual bliss. Wearing white sar
Desktop Bottom Promotion