For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నవరాత్రి 2020, 2వ రోజు : బ్రహ్మచారిణి అవతారం ఎలా వచ్చింది? ఈ అమ్మవారిని ఎలా ఆరాధించాలి....

|

పురాణాల ప్రకారం దేవీ శరన్నవరాత్రుల సమయంలో దుర్గా మాత రెండో రోజున బ్రహ్మచారిణి అవతారంలో అందరికీ దర్శనమివ్వనున్నారు. నవరాత్రుల్లోని పవిత్రమైన రెండో రోజున బ్రహ్మచారిణి అమ్మవారిని భక్తులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు.

ఈ మాతను ఆరాధించిన వారికి శక్తిని, జ్ణానాన్ని ప్రసాదిస్తుంది. ఈ అమ్మవారిని నారింజ, తెలుగు రంగు దుస్తులతో అలంకరిస్తారు. ఈ సమయంలో భక్తులంతా ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించాలి. ఈ సందర్బంగా బ్రహ్మచారిణి మాత యొక్క ప్రాముఖ్యత, విశిష్టత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం...

Navratri 2020: దేవీ నవరాత్రుల రహస్యాల గురించి తెలుసా...

బ్రహ్మచారిణి విశిష్టత..

బ్రహ్మచారిణి విశిష్టత..

పురాణాల ప్రకారం ఈ అమ్మవారు లంకేశ్వరుడిని పెళ్లి చేసుకునేందుకు దాదాపు వెయ్యి సంవత్సరాల వరకు తపస్సు చేస్తుంది. ఇదంతా నారద ముని ఉపదేశానుసారం చేస్తుంది. ఈ సమయంలో ఆమె కేవలం పూలు, పండ్లు మాత్రమే ఆహారంగా తీసుకుందని, మరికొన్ని సంవత్సరాలు కూరగాయలను మాత్రమే తీసుకుని స్వామి కోసం బ్రహ్మచారిణిగా పూజలు చేసిందని పురాణాలు చెబుతున్నాయి.

మల్లెలంటే ఇష్టం..

మల్లెలంటే ఇష్టం..

ఈ బ్రహ్మచారిణి అమ్మవారికి మల్లెపూలంటే చాలా ఇష్టం. ఈ మాతను తాజా మల్లెపూలతో పూజిస్తే సర్వత్రా సిద్ధి విజయాలు లభిస్తాయట. ఈ సమయంలో అమ్మవారిని ఈ మంత్రంతో పూజించాలి.

‘దధానకర పద్మాభ్యం అక్షమాలా కమండలా

దేవి ప్రదాతు మయీ బ్రహ్మచారిణ్యనుత్తమా'

బ్రహ్మచారిణి అంటే..

బ్రహ్మచారిణి అంటే..

దుర్గామాత యొక్క తొమ్మిది రూపాలలో రెండో అవతారమే బ్రహ్మచారణి అవతారం. ఈ సందర్భంలో ‘బ్రహ్మ' అంటే తపస్సు.. బ్రహ్మచారిణి అంటే తమాచరించునది. ‘వేదస్త్వం తపో బ్రహ్మ'-‘బ్రహ్మ' అంటే వేదం, తత్త్వం, తపస్సు. బ్రహ్మచారిణీ స్వరూపం పూర్తిగా జ్యోతిర్మయి, మిక్కిలి శుభకరం, భవ్యం. ఈ దేవి కుడి చేతిలో జపమాల, ఎడమ చేతిలో ధరించి ఉంటుంది.

నవరాత్రి: సంధి పూజ సందర్భంగా దుర్గాదేవి ముందు 108 తామరలను అర్పించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బ్రహ్మచారిణి కథ..

బ్రహ్మచారిణి కథ..

పురాణాల ప్రకారం.. హిమవంతుని కూతురైన పార్వతీ దేవినే ఈ బ్రహ్మచారిణి దేవి. ఈమె ఈశ్వరుడిని వివాహం చేసుకునేందుకు, నారదుని ఉపదేశాన్నిఅనుసరించి ఘోర తపస్సు చేస్తుంది. ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ కొంతకాలం పాటు ఘోర తపస్సు చేస్తుంది. ఇలా కొన్ని వందల సంవత్సరాల పాటు చేస్తుంది.

తపస్సు సమయంలో..

తపస్సు సమయంలో..

ఈ అమ్మవారు తపస్సు చేసే సమయంలో నేలపై రాలి ఆకులనే మాత్రమే స్వీకరిస్తూ.. ఆ శివుడిని అనునిత్యం ఆరాధిస్తూ ఉండేది. అలా ‘అపర్ణ'యైన ఆమె చాలా కాలం పాటు నీళ్లు, ఆహారం తీసుకోకుండా ఘోర తపస్సు చేసింది. దీంతో ఆమె శరీరం బలహీనంగా మారిపోయింది. ఈమె దయనీయ పరిస్థితిని చూసిన తల్లి మేనాదేవి ఎంతో బాధపడుతుంది.

తపస్సు నుండి మళ్లించడానికి..

తపస్సు నుండి మళ్లించడానికి..

ఈమెను తపస్సు నుండి మళ్లించడానికి తల్లి ‘ఉమా' ‘బిడ్డ వలదు, వలదు' అని పలికినందున, ఈమె బ్రహ్మచారిణి దేవిగా.. ‘ఉమా'గా ఇతిహాసాల్లో నిలిచిపోయింది. ఈమె ఘోర తపస్సు చేయడంతో ముల్లోకాల్లో హాహాకారాలు చెలరేగుతాయి. దేవతలు, మునులు, సాధువులు, రుషులు అందరూ ఈమె తపస్సు అద్వితీయమని.. అమోఘమని కొనియాడతారు.

కోరిక నెరవేరుతుంది..

కోరిక నెరవేరుతుంది..

అలౌకికమైన నీ తపశ్చర్య సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది. నీ మనోవాంఛ తప్పకుండా సంపూర్ణంగా నెరవేరును. చంద్రమౌళియైన ఈశ్వరుడు నీకు భర్తగా మారతాడు. ఇక నీవు తపస్సు విరమించి ఇంటికి వెళ్లుము. త్వరలో నీ తండ్రి నిన్ను ఇంటికి తీసుకునిపోతాడు. అందుకే నవరాత్రుల్లో రెండోరోజున ఈ బ్రహ్మచారిణి ఉపాసించడం వల్ల మానవులలో దుర్గుణాలు పోయి.. సద్గుణాలు వచ్చే అవకాశం ఉంటుంది.

English summary

Navratri 2020 Day 2: Know Significance, Puja Vidhi and Mantra of worshipping Maa Brahmacharini

Story of Brahmacharini: Second Goddess of Navaratri,Brahmacharini or Devi Yogini is the second manifestation and mightiest forms of Goddess Durga. The second day of Navratri is devoted for Goddess Brahmacharini. With a unique blend of radiance, she takes her devotes to the spiritual bliss.