For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Navratri 2021 Day 5 : ఐదో రోజు స్కందమాత కథ గురించి తెలుసుకుందామా..

స్కందమాత అనే పేరుకు అర్థం ఏమిటంటే స్కంద్ లేదా కార్తీకేయ తల్లి. దుర్గాదేవి కూడా కార్తీకేయ తల్లి కాబట్టి ఆమెను స్కందమాత అని పిలుస్తారు.On day 5 of Navratri, Goddess Durga is worshipped in her Skandmata

|

ఆంధ్రప్రదేశ్ లో ఆది పరాశక్తిగా, దుర్గాదేవిగా పూజించినా.. తెలంగాణలో బతుకమ్మగా ఆరాధించినా, కలకత్తా కాళికా దేవిగా కొలిచినా, ఉత్తర భారతంలో చాముండేశ్వరిగా అలంకరించి ఏనుగు అంబారీపై ఊరేగించినా ఇలా అమ్మల గన్న అమ్మను ఏ రూపంలో ఎలా కొలిచినా సకల జీవకోటిని సంరక్షించేందుకు ఆ జగన్మాత ఎల్లప్పుడూ ఆశీస్సులు అందిస్తుందని భక్తుల నమ్మకం. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ గావించే ఆ జగన్మాత ఆ లోకపావనిని పరమభక్తితో కొలిస్తే యశస్సు, తేజస్సు, ఐశ్వర్యం, శాంతి, ఆయురారోగ్యాలు, బలాన్ని ప్రసాదిస్తుందని పురాణాలలో పేర్కొనబడింది.

Navratri

నవరాత్రుల్లో హిందు భక్తులందరూ అమ్మవారిని తొమ్మిది రూపాల్లో పూజిస్తారు. ఒక్కోరోజు ఒక్కో రూపంలో అమ్మవారిని అలంకరించి పూజిస్తారు. ఇలా నవరాత్రుల్లో ఐదో రోజున అమ్మవారిని స్కందమాత రూపంలో పూజిస్తారు. ఈరోజు స్టోరీలో దుర్గా దేవి స్కందమాత అవతారంలో ఎందుకు కనిపిస్తారు? స్కంద మాత కథ విశేషాలేంటో తెలుసుకుందాం.

1) స్కందమాత అంటే..

1) స్కందమాత అంటే..

స్కందమాత అనే పేరుకు అర్థం ఏమిటంటే స్కంద్ లేదా కార్తీకేయ తల్లి. దుర్గాదేవి కూడా కార్తీకేయ తల్లి కాబట్టి ఆమెను స్కందమాత అని పిలుస్తారు. స్కంద మాత దేవత సౌర వ్యవస్థ యొక్క దేవత.

2) ఈ తల్లిని పూజిస్తే..

2) ఈ తల్లిని పూజిస్తే..

నవరాత్రి వేడుకల్లో ఐదో రోజున ప్రతిఒక్కరూ ఈ తల్లిని పరమ పవిత్రమైన భక్తితో ఆరాధిస్తే, ఆ దేవత భక్తుల జీవితంలో అపారమైన ఆనందాన్ని, శ్రేయస్సును ఇస్తుంది.

3) బంగారు రంగులో..

3) బంగారు రంగులో..

పురాణాల ప్రకారం ఈ స్కందమాత సరసమైన లేదా బంగారు రంగు కలిగి ఉంటుంది. ఈ దేవత సింహం మీద కూర్చుని నాలుగు చేతులు కలిగి ఉంటుంది. ఆ మాత తన రెండు చేతుల్లో తామరలను తీసుకెళ్తుంది. కార్తీకేయను ఆమె ఒడిలో కూర్చోబెట్టుకుని ఉంటుంది. మరో చేతిలో అభయ ముద్ర ఉంటుంది.

4) ఈ విశ్వాన్నంత సొంత బిడ్డలా..

4) ఈ విశ్వాన్నంత సొంత బిడ్డలా..

దేవి దుర్గా యొక్క స్కందమాత రూపం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈ రూపంలో ఈ దేవతను తల్లి రూపంలో దర్శనమిస్తారు. స్కందమాత రూపంలో ఉన్న ఈ దేవత ఈ విశ్వం మొత్తాన్ని తన సొంత బిడ్డలా చూసుకుంటుందని పురాణాలలో పేర్కొనబడింది.

5) స్కందమాత కథలో ఏముందంటే..

5) స్కందమాత కథలో ఏముందంటే..

ఒకప్పుడు తారకాసుర అనే భూతం మొత్తం విశ్వానికి ఇబ్బంది కలిగించింది. ఈ తారకసురుడిని శివుని కుమారుడు మాత్రమే చంపగలడని అతనికి ఒక వరం ఉంటుంది. కానీ ఇక్కడి గ్రంథాల ప్రకారం శివుడు సన్యాసిగా ఉంటారు. అతను వివాహం చేసుకోవటానికి సుముఖంగా ఉండడు. కానీ తారకసురుడు అమరుడు కాకపోతే అంతా హింసాత్మకంగా మారుతుందని శివునికి అందరూ చెప్పడంతో శివుడు పార్వతీ దేవి వివాహం చేసుకుంటాడు. ఆ తర్వాత వీరిద్దరికీ కార్తికేయ లేదా స్కంద్ జన్మిస్తాడు. అందువల్ల పార్వతీ దేవికి స్కందమాత అని పేరు వచ్చింది. ఆ తరువాత తన కుమారుడితో కలిసి సింహం మీద ప్రయాణించి తారకాసురుడిని చంపుతారు.

6) స్కందమాత మంత్రాలు..

6) స్కందమాత మంత్రాలు..

యా దేవి సర్వభూతేషూ మా స్కందమాత రూపేన శాస్తిత

నమస్తే సేయ నమస్తే సేయ నమస్తే సేయ నమోహ్ నమ:

నవరాత్రుల్లో ఐదోరోజు స్కందమాతను పూర్తి విశ్వాసంతో, భక్తితో ఆరాధిస్తే ఆమె ఆశీస్సులు మీకు కచ్చితంగా లభిస్తాయి.

FAQ's
  • నవరాత్రుల వేళ ఐదో రోజు అమ్మవారిని ఏ రూపంలో కొలుస్తారు?

    అశ్వీయుజ మాసంలో నవరాత్రుల వేళ ఐదో రోజు స్కందమాత రూపంలో అమ్మవారిని కొలుస్తారు.

English summary

Navratri 2020 Day 5: Colour, Mata Skandamata Mantra, Puja Vidhi and Significance

On day 5 of Navratri, Goddess Durga is worshipped in her Skandmata form. The name Skandmata means mother of Skand or Kartikeya. Since Goddess Durga is also the mother of Lord Kartikeya, she is known as Skandmata. Goddess Skandmata is the deity of the solar system.
Desktop Bottom Promotion