For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నవరాత్రి 2019 : 9 రోజులూ భక్తులు ధరించాల్సిన రంగులు మరియు వాటి ప్రాముఖ్యత

నవరాత్రుల్లో రోజూ ఒక్కో శక్తి అవతారాన్ని పూజిస్తారు.

By Staff
|

నవరాత్రులు మరియు దుర్గా పూజ లో దుర్గా మాతని మరియు ఆవిడ అవతారాలని పూజిస్తారు.2019లో నవరాత్రులు సెప్టెంబర్ 29 నుండి అక్టోబర్ 7వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ పండుగ తొమ్మిది రోజుల్లో ఒక్కోరోజూ ఒకొక్క దుర్గా మాత అవతారాన్ని ఆరాధిస్తారు.

నవరాత్రుల్లో రోజూ ఒక్కో శక్తి అవతారాన్ని పూజిస్తారు. ఈ పూజ మొదటి రోజు శైలపుత్రి మాత తో ప్రారంభమయ్యి ఆఖరి రోజు సిద్ధిధాత్రి మాతతో ముగుస్తుంది.దసరా పండుగని నవరాత్రులు అయ్యాకా పదవ రోజు అనగా దశమి రోజున ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు.ఈ నవరాతుల్లో ప్రతీరోజూ ధరించాల్సిన రంగుల గురించి తెలుసుకోవాలని భక్తులు ఎంతో ఉత్సూకత ప్రదర్శిస్తారు.నవరాత్రుల తొమ్మిది రోజుల్లో మీరు ఏ రంగులు ధరించాలి దుర్గా మాత అవతారానికి ఏ రంగు వస్త్రాలతో అలంకరణ చేయాలో మరియు ఆయా రంగుల ప్రాముఖ్యత ఏమిటో క్రింద వివరించాము.

1. మొదటి రోజు-ఘట స్థాపన/ప్రతిపాదన-పసుపు రంగు

1. మొదటి రోజు-ఘట స్థాపన/ప్రతిపాదన-పసుపు రంగు

నవదుర్గల అవతారాల్లో మొట్ట మొదట పూజలందుకునేది శైల పుత్రి మాత.శైల పుత్రి మాత ని నవరాత్రుల ప్రారంభ రోజున బూడిద రంగు వస్త్రాలతో అలంకరించి మట్టి ఘటం మీద స్థాపిస్తారు.భక్తులు ఆరోజు పసుపు రంగు దుస్తులు ధరించాలి.

2. రెండవరోజు-ద్వితీయ-ఆకుపచ్చ

2. రెండవరోజు-ద్వితీయ-ఆకుపచ్చ

నవరాత్రుల రెండవ రోజు బ్రహ్మచారిణీ మాత ని ఆరాధిస్తారు.ఈ మాత శక్తిని, ఆధ్యాత్మికని,ఙానాన్ని ప్రసాదిస్తుంది. ఈరోజు అమ్మవారి అవతారిని నారింక రంగు దుస్తులతో అలంకరించి భక్తులు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించాలి.

3. మూడవరోజు-తృతీయ-బూడిద రంగు

3. మూడవరోజు-తృతీయ-బూడిద రంగు

శాంతినీ,ధైర్యాన్ని ప్రసాదించే చంద్రఘంట అవతారాన్ని భక్తులు మూడవరోజున పూజిస్తారు.ఈ శక్తి రూపాన్ని తెల్లని చీరతో అలంకరిస్తారు.ఈరోజు గౌరీ వ్రతం కూడా చేస్తారు.సింధూర తృతియ సౌభాగ్య తీజ్ అనే వ్రతాన్ని కూడా చేస్తారు ఈరోజు. భక్తులు ఈరోజు బూడిద రంగు దుస్తులు ధరించాలి.

4. నాల్గవ రోజు-చతుర్ధి-నారింజ రంగు

4. నాల్గవ రోజు-చతుర్ధి-నారింజ రంగు

ఈరోజు దుర్గా మాత యొక్క కూష్మాండ అవతారాన్ని పూజిస్తారు.ఈ శక్తి అవతారమే విశ్వాన్ని సృష్టించిందని నమ్మకం.భౌమ చతుర్ధి ని ఆచరించి కూష్మాండ శక్తి రూపాన్ని ఎర్ర రంగు చీరతో అలంకరిస్తారు.ఈరోజు భక్తులు నారింజ రంగు దుస్తులు ధరించాలి.

5. ఐదవరోజు-పంచమి-తెలుపు

5. ఐదవరోజు-పంచమి-తెలుపు

దుర్గా మాత యొక్క ఇంకొక అవతారమైన స్కంద మాతని నవరాత్రుల ఐదవరోజున ఆరాధిస్తారు. ఈ అవతారం రాక్షస సంహారం గావించిందని భక్తుల నమ్మకం.అమ్మవారిని నీలం రంగు చీరతో అలంకరించి భక్తులు ఉపంగ లలితా గౌరి వ్రతాన్ని ఆచరిస్తారు.ఈరోజు భక్తులు తెలుపు రంగు దుస్తులు ధరించాలి.

6. ఆరవరోజు-షష్టి-ఎరుపు

6. ఆరవరోజు-షష్టి-ఎరుపు

నవరాతుల ఆరవ రోజున దుర్గా మాత యొక్క అవతారమైన కాత్యాయనీ మాత ని పూజిస్తారు. కాత్యాయనీ మాతని పసుపు పచ్చ రంగు దుస్తులతో అలంకరించి మహా షష్టి ని జరుపుకుంటారు.భక్తులు ఈరోజు ఎరుపు రంగు దుస్తులు ధరించాలి.

7. ఏడవ రోజు-సప్తమి-నీలం రంగు

7. ఏడవ రోజు-సప్తమి-నీలం రంగు

సప్తమి రోజున దుర్గా మాత యొక్క కాళరాత్రి అవతారాన్ని పూజిస్తారు.ఈ అమ్మవారు భక్తులని ఆపదలనుండీ,అరిష్టాలనుండీ కాపాడి స్వేచ్చ ని సంతోషాన్ని కలుగజేస్తుంది.ఈరోజు అమ్మవారిని ఆకుపచ్చ రంగు దుస్తులతో అలంకరించాలి.ఉత్సవ పూజ మహా సప్తమితో మొదలవుతుంది. ఈరోజు భక్తులు ధరించాల్సిన రంగు నీలం.

8. ఎనిమిదవరోజి-అష్టమి-పింక్(గులాబీ రంగు)

8. ఎనిమిదవరోజి-అష్టమి-పింక్(గులాబీ రంగు)

నవరాత్రుల ఎనిమిదవరోజున మహా గౌరీ మాత ని పూజిస్తారు.ఆ తల్లి భక్తులని పాపాలనుండి రక్షించి వారు పునీతులవ్వడానికి తోడ్పడుతుందని భక్తుల నమ్మకం.ఈరోజు అమ్మవారిని నెమలి ఆకుపచ్చ రంగు దుస్తులతో అలంకరిస్తారు.ఎనిమిదవ రోజైన దుర్గాష్టమి రోజున మన్స్ఫూర్తిగా సరస్వతీ మాత ని పూజించి భక్తులు పింక్(గులాబీ రంగు) దుస్తులు ధరిస్తారు.

9. తొమ్మిదవ/పదవరోజు-నవమి/దశమి/దసరా-ఊదా రంగు

9. తొమ్మిదవ/పదవరోజు-నవమి/దశమి/దసరా-ఊదా రంగు

అతీంద్రియ శక్తులు కలిగిన సిద్ధిధాత్రి మాతని నవరాత్రుల తొమ్మిదవరోజైన నవమి నాడు భక్తులు పూజిస్తారు.అమ్మవారి ఈ అవతారాన్ని భక్తులు ఊదారంగు దుస్తులతో అలంకరించి మహార్ నవమి పూజ చేస్తారు.ఈ శుభ దినాన ఆడ పిల్లలకి ప్రాముఖ్యతనిస్తూ కన్యా పూజ ని కూడా చేస్తారు.ఈరోజు భక్తులు కూడా ఊదా రంగు దుస్తులు ధరిస్తారు.

English summary

Navratri Special: 9 colours to wear on each day of the festival and their importance

The Navratri festival and Durga Puja is dedicated to worshipping Goddess Durga or her avatars and celebrated all round the globe. Navratri 2019 begins on September 29 and this festival is celebrated for nine nights and most importantly nine forms of the Devi are worshipped.
Desktop Bottom Promotion