For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Navratri 2020 : దుర్గా దేవి ఆయుధాలలో ఒక్కో దానికి ఒక్కో ప్రత్యేకత... అవేంటో తెలుసా...

|

హిందువులకు అత్యంత ముఖ్యమైన పండుగలలో దసరా పండుగ ఒకటి. ఈ సమయంలో నవరాత్రుల ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. ఈ ఏడాది అక్టోబర్ 17 నుండి 25వ తేదీ వరకు ఉత్సవాలు జరగనున్నాయి. పురాణాల ప్రకారం రాక్షసులను సంహరించేందుకు దుర్గాదేవి వచ్చిందని.. చెడుపై పోరాడే శక్తివంతమైన దేవత దుర్గాదేవి అని అందరూ భావిస్తారు.

దుర్గా దేవి తనకున్న పది చేతుల ద్వారా తన భక్తులను రక్షిస్తుందని చాలా మంది భక్తులు నమ్ముతారు. అలాగే భూమి, ఆకాశంతో పాటు ఎనిమిది దిక్కులన ఉన్న సకల జీవకోటి రాశులకు రక్షణగా నిలుస్తుందని పండితులు చెబుతారు.

అయితే దుర్గాదేవి చెడుపై పోరాటం చేసే సమయంలో అనేక అవతారాలను ఎత్తారని.. అలాగే ఆ సమయంలో ఆమె ఒక్కోసారి ఒక్కో ఆయుధాన్ని ఉపయోగించిందని పండితులు చెబుతారు. ఈ సందర్భంగా దుర్గా దేవి వాడిన ఆయుధాలేంటి? అవి దేనిని సూచిస్తాయి... వాటి ప్రత్యేకతలేంటి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Navratri 2020 : దేవీ నవరాత్రుల తేదీలు.. శుభ ముహుర్తం.. పూజా ప్రాముఖ్యత్య గురించి తెలుసుకుందామా...!

శంఖం..

శంఖం..

పురాణాల ప్రకారం దుర్గా దేవికి శంఖన్నా వరుణుడు బహుమతిగా ఇచ్చాడు. ఇది మొత్తం స్రుష్టి నుండి ఉద్భవించింది. ఇది ప్రణవం లేదా ఓంకారానికి ప్రతీక. ఈ శబ్ద రూపంలో అమ్మవారు కొలువై ఉన్నారని అర్థం.

కమలం..

కమలం..

ఇది ఒకరి ఆత్మలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని మేల్కొలిపేందుకు సహాయపడుతుంది. దీనిని బ్రహ్మదేవుడు దుర్గాదేవికి బహుమతిగా ఇచ్చారు. దుర్గా చేతిలో సగం వికసించిన కమలం వినయాన్ని సూచిస్తుంది. ప్రాపంచిక ఆనందాలకు లొంగకుండా మన ఆధ్యాత్మిక తపనతో నిజాయితీగా ఉండటాన్ని ఇది నేర్పుతుంది.

ఖడ్గం..

ఖడ్గం..

మన శత్రువులను నాశనం చేసే సమయంలో.. మన ఫోకస్ అంతా అక్కడే పెట్టాలని ఇది నేర్పుతుంది. మనం ఏ విషయంలోనూ విశ్వాసం కోల్పోకుండా ఏ సవాలునైనా ధైర్యంగా ఎదుర్కోవాలని చెబుతుంది. దుర్గాదేవికి దీనిని ఇంద్రుడు బహుమతిగా ఇచ్చాడు.

విల్లు మరియు బాణం..

విల్లు మరియు బాణం..

విల్లు మరియు బాణం రెండు రకాల శక్తులను సూచిస్తుంది. దుర్గాదేవి ఓ చేతిలో విల్లును.. మరో చేతిలో బాణం పట్టుకున్నప్పుడు.. ఆమె ప్రపంచంలోని అన్ని శక్తులను నియంత్రిస్తుందని అర్థం. దుర్గాదేవికి దీనిని వాయు మరియు సూర్య దేవుడు బహుమతిగా ఇచ్చారు.

ఈ అక్టోబర్ నెలలో వచ్చే పండుగలు.. వ్రతాలు, శుభముహుర్తాలివే...!

సుదర్శన చక్రం..

సుదర్శన చక్రం..

దుర్గా దేవి యొక్క చూపుడు వేలు చుట్టూ తిరిగే అందమైన సుదర్శన చక్రం వల్ల ప్రపంచం మొత్తం ఆమె ఆదేశానుసారం నడుచుకుంటున్నట్లు సూచిస్తుంది. ఇది సమయాన్ని సూచిస్తుంది. చెడును నాశనం చేయడానికి ఆమె కనికరం లేకుండా ఈ సుదర్శన చక్రాన్ని వాడుతుంది. దీనిని శ్రీమహావిష్ణువు దుర్గాదేవికి బహుమతిగా ఇచ్చారు.

త్రిశూలం..

త్రిశూలం..

హిందూ మతంలో త్రిశూలానికి చాలా ప్రాముఖ్యత ఉంది. దీనిని ఆ పరమేశ్వరుడు దుర్గా దేవికి బహుమతిగా ఇచ్చాడు. ఇది సత్యం, ధర్మం, న్యాయం అనే మూడు లక్షణాలను సూచిస్తుంది. భక్తులలో మూడు లక్షణాలను నియంత్రించే శక్తి దుర్గాదేవికి ఉంది. ఆమె రాక్షసులను సంహరించేందుకు ఈ త్రిశూలాన్ని ఉపయోగించింది.

ఒకే గొడ్డలి..

ఒకే గొడ్డలి..

దుర్గా దేవి ఈ ఆయుధాన్ని విశ్వకర్మ నుండి అందుకున్నాడు. ఇది చెడుతో పోరాడుతున్నప్పుడు, ఎలాంటి పరిణామాలకు భయపడాల్సిన అవసరం లేదని సూచిస్తుంది.

గద..

గద..

దుర్గా దేవి చేతిలో ఉండే గద సంకల్పానికి ప్రతీక. భక్తులు కూడా తమ నమ్మకాల పట్ల అంతే సంకల్పంతో వ్యవహరించాలని.. ఎలాంటి ఆపద వచ్చినా పట్టుదలతో.. ధైర్యంతో ఎదుర్కోవాలని సూచిస్తుంది.

ఈటె..

ఈటె..

ఈ ఆయుధాన్ని అగ్ని దేవుడు దుర్గాదేవికి ఇచ్చాడు. దీన్ని మహిషాసురుడిని అంతమొందించడానికి ఉపయోగించింది. ఈ ఆయుధం జీవితంలో వచ్చిన అడ్డంకులన్నింటినీ అధిగమించడానికి మానవులు దాచిన శక్తిని సూచిస్తుంది.

అభయముద్ర..

అభయముద్ర..

దుర్గా దేవి సింహాన్ని వాహనంగా చేసుకుని రాక్షస సంహారానికి బయలుదేరుతుంది. ఈ సమయంలో ఆమె సింహంపై కూర్చుని ఉంటుంది. అప్పుడు అభయముద్రను సూచిస్తుంది. ఇది భయం నుండి విమోచనాన్ని సూచిస్తుంది. ఈ ముద్రలో అమ్మవారు భక్తులను ఉద్దేశించి ‘మీ కార్యాలు, మీ భారాలు నా మీ వెయ్యండి.. మిమ్మల్ని అన్ని భయాల నుండి విముక్తి చేస్తాను' అన్నట్టుగా ఉంటుంది.

English summary

Navratri Special: What Goddess Durga’s Weapons And Mudra Symbolise in Telugu

Here we talking about navratri special: what goddess durga's weapons and mudra symbolise in telugu. Read on