For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Navratri 2021:నవరాత్రుల వేళ చేయాల్సిన, చేయకూడని పనులేంటో చూసెయ్యండి...

|

ఈ ఏడాది కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో ప్రతి ఒక్కరూ నవరాత్రుల ఉత్సవాలను ఘనంగా చేసుకోవాలని భావిస్తున్నారు. అక్టోబర్ మాసంలో అతి త్వరలో అంటే ఇంకో వారం రోజుల్లో అక్టోబర్ 7వ తేదీ నుంచి నవరాత్రులు ప్రారంభం కానున్నాయి.

Navratri Vrat 2021 do’s and donts

ఈ తొమ్మిది రోజుల పాటు దుర్గాదేవికి అంకితం చేస్తారు. ఈ నవరాత్రుల వేళ దుర్గాదేవిని తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రూపాల్లో అలంకరించి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. 9 రోజుల సుదీర్ఘమైన ఈ పండుగ వేళ చాలా మంది భక్తులు ఉపవాసం ఉంటారు. ఈ కాలంలో రోజువారీగా తినే ఆహార పదార్థాలైన అన్నం, రొట్టెలను తినడం మానేస్తారు.

Navratri Vrat 2021 do’s and donts

ఈ సందర్భంగా నవరాత్రుల వేళ కొన్ని పనులు తప్పనిసరిగా చేయాలి. ఇలా చేస్తే దుర్గాదేవి ఆశీస్సులు తప్పక లభిస్తాయని పండితులు చెబుతున్నారు. అదే విధంగా కొన్ని పనులను పరొపాటున కూడా చేయకూడదట. అలా చేస్తే దుర్గాదేవి ఆగ్రహానికి గురవ్వాల్సి వస్తుందట. ఈ నేపథ్యంలో నవరాత్రుల వేళ ఏయే పనులు చేయాలి.. ఏయే పనులు చేయకూడదనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

అక్టోబర్ 2021 నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలు, వ్రతాలివే...అక్టోబర్ 2021 నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలు, వ్రతాలివే...

నవరాత్రుల వేళ..

నవరాత్రుల వేళ..

నవరాత్రుల సమయంలో ప్రతిరోజూ ఉదయాన్నే అంటే సూర్యోదయం కంటే ముందు నిద్రలేచి స్నానం చేయాలి. మీ ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. పూజగదిని అలంకరించుకున్న తర్వాత ప్రతిరోజూ తొమ్మిది రోజుల పాటు అమ్మవారి విగ్రహం ముందు దీపం వెలిగించాలి. దుర్గా చాలీసా లేదా దుర్గా దేవి మంత్రాలను, శ్లోకాలను పఠించాలి. ఈ తొమ్మిది రోజుల పాటు దుర్గాదేవికి అంకితం చేయబడింది. ఇలా చేయడం వల్ల దుర్గాదేేవి అనుగ్రహం తప్పక లభిస్తుందని పండితులు చెబుతారు.

మహిళలకు ఆహారం..

మహిళలకు ఆహారం..

దుర్గాదేవి ఈ నవరాత్రుల వేళ భూమి మీదకు వస్తుందని చాలా మంది నమ్ముతారు. కాబట్టి ఈ పండుగ సమయంలో కొందరు అమ్మాయిలకు ఆహారం నైవద్యంగా సమర్పించాలి. ముఖ్యంగా శుభ సమయంలో ఏ ఆహారాన్ని తయారు చేసినా, అది దేవతలకు అందించబడుతుందని, కాబట్టి నవరాత్రుల వేళ మీరు కూడా అలానే చేయాలని పండితులు చెబుతున్నారు. ఒకవేళ వంట చేయడం కుదరకపోతే.. మీరు పాలు లేదా పండ్లను కూడా అందివ్వొచ్చు.

పచ్చి కూరగాయలు..

పచ్చి కూరగాయలు..

మీరు తొమ్మిది రోజుల పాటు ఉపవాసం ఉండటం వల్ల మీ బరువును సులభంగా తగ్గుతారు. అయితే ఈ కాలంలో ఆకలి వేసినప్పుడు ఎక్కువగా ద్రవ పార్థాలు తీసుకోవాలి. వాటిలో ఎక్కువగా మంచి నీరు, కొబ్బరి నీళ్లు, మిల్క్ షేక్ వంటి వాటిని ఎక్కువగా తీసుకోవాలి. అలా చేయడం వల్ల మీ రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ప్రతి రెండు గంటలకు నట్స్ తింటూ ఉండండి. అలాగే ఎక్కువగా బంగాళదుంపలను తినాలట. మిగిలిన కూరగాయలను ఎక్కువగా ఉడికించి తినాలట.

Navratri 2021:నవరాత్రులు ఎప్పుడు ప్రారంభం కానున్నాయి... శుభ ముహుర్తమెప్పుడంటే...!Navratri 2021:నవరాత్రులు ఎప్పుడు ప్రారంభం కానున్నాయి... శుభ ముహుర్తమెప్పుడంటే...!

అతి నిద్ర వద్దు..

అతి నిద్ర వద్దు..

నవరాత్రుల సమయంలో అతిగా నిద్ర పోతే అమ్మవారికి ఆగ్రహం కలుగుతుందట. ముఖ్యంగా సూర్యోదయం తర్వాత ఎవరైతే నిద్ర లేస్తారో వారికి అనేక సమస్యలు ఎదురవుతాయట. అలాగే నవరాత్రుల సమయంలో ఉపవాసం ఉండే వారు మధ్యాహ్నం సమయంలో అస్సలు నిద్రపోకూడదట. ఒకవేళ అలా చేస్తే మీరు ఎన్ని పూజలు చేసిన ఫలితం ఉండదట.

కటింగ్, షేవింగ్ చేయరాదు..

కటింగ్, షేవింగ్ చేయరాదు..

నవరాత్రుల వేళ ఎవ్వరూ హెయిర్ కటింగ్, షేవింగ్ వంటివి చేసుకోకూడదట. అలాగే శిరోముండనం(గుండు) కూడా చేయించుకోవడం వంటి కార్యక్రమాలను పెట్టుకోకూడదట. నవరాత్రులకు ముందుగానే లేదా నవరాత్రులు ముగిసిన తర్వాత మాత్రమే కటింగ్, షేవింగ్ చేసుకోవాలంట. లేదంటే దుర్గా దేవి ఆగ్రహించి.. మీకు అనేక సవాళ్లు ఎదురయ్యేలా చేస్తుందట.

 వీటిని తినకూడదు..

వీటిని తినకూడదు..

నవరాత్రుల సమయంలో పూర్తిగా శాకాహారం మాత్రమే తినాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారం జోలికి వెళ్లకూడదు. అలాగే మద్యం అస్సలు ముట్టుకోకూడదు. అలాగే ఈ తొమ్మిది రోజుల పాటు ఉల్లి, వెల్లుల్లి, అల్లం వంటి మసాల పదార్థాలను కూడా వాడకూడదట. ఈ కాలంలో మీ ఇంట్లో నిమ్మకాయలు అస్సలు కట్ చేయకూడదట. ఇలా చేయడం వల్ల మీ ఇంటికి అరిష్టం కలుగుతుందట. అయితే మీరు మార్కెట్లో లభించే నిమ్మరసం బాటిల్స్ ను వాడుకోవచ్చు.

English summary

Navratri Vrat 2021 do’s and don'ts

Here we are talking about the Navratri 2021 do’s and don’ts in Telugu. Have a look
Desktop Bottom Promotion