For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నవరాత్రులు 2019 : మీ ప్రియమైన వారికి వాట్సప్, ఫేస్ బుక్ సందేశాలు, శుభాకాంక్షలు పంపండి..

ఈ నవరాత్రుల ద్వారా చెడుపై మంచి ఎప్పుడూ గెలుస్తుందని నిరూపించబడింది.

|

నవరాత్రులంటే చాలా మందికి తెలిసిన విషయమే. తొమ్మిది రోజుల పాటు జరుపుకునే ఉత్సవం. ఈ నవరాత్రుల్లో దుర్గా దేవి (పరాశక్తి) అమ్మవారిని హిందువులందరూ అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఈ నవరాత్రుల్లో మీ బంధువులు, స్నేహితుల హృదయాలను హత్తుకునేలా సందేశాలు (మెసేజ్ లు), వాట్సాప్, ఫేస్ బుక్ స్టాటస్, శుభాకాంక్షలను అందరి కంటే ముందుగా పంపండి. మరి బంధు, మిత్రులకు ఎలాంటి మెసెజ్ లు, కొటేషన్స్ నచ్చుతాయో మీరు ఓసారి ట్రై చేసి చూడండి. మీతో పాటు మీ కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులందరూ ఏ పని చేపట్టినా ప్రతి ఒక్కదానిలో విజయం చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.

Navratri

ఈ ఏడాది సెప్టెంబర్ 29 నుండి అక్టోబర్ 7వ తేదీ నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. నవరాత్రులు ముగిసిన తర్వాత దశమి రోజున విజయదశమి పండుగను ప్రతి ఏటా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇక ఈసారి అక్టోబర్ 8వ తేదీన విజయదశమి పండుగ వచ్చింది. ఈ నవరాత్రుల్లో అమ్మవారిని ఆరాధించడం వల్ల విశేష ఫలితం తప్పకుండా లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. ఇక విజయదశమి రోజున తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల రావణసురుని కటౌట్లను ఏర్పాటు చేసి వాటిని దహనం చేస్తారు. ఈ నేపథ్యంలో ఈసారి నవరాత్రుల సందర్భంగా కొన్ని వాట్సప్, ఫేస్ బుక్ స్టాటస్ లు, మెసెజ్ లు, శుభాకాంక్షలను మీ ముందుకు తీసుకొస్తున్నాం. వీటిలో మీకు నచ్చిన వాటిని షేర్ చేసుకోండి. మీ బంధుమిత్రుల ఆశీస్సులు పొందండి.

1) ప్రకాశవంతం చేయండి..

1) ప్రకాశవంతం చేయండి..

నవరాత్రులు అయిన పవిత్రకాలంలో దుర్గాదేవి అమ్మవారు మీకు, మీ కుటుంబ సభ్యులను ఆశీస్సులు అందాలని, మీ ఇంట్లోని వారందరూ మంచి ఆరోగ్యంతో ప్రకాశించాలని కోరుతూ.. నవరాత్రి శుభాకాంక్షలు..

2) శరన్నవరాత్రులతో పాటు శాశ్వతంగా..

2) శరన్నవరాత్రులతో పాటు శాశ్వతంగా..

శరన్నవరాత్రులైన తొమ్మిది రోజులతో పాటు మీ జీవితంలో శాశ్వతంగా కాంతివంతంగా ఉండాలని కోరుకుంటూ.. నవరాత్రి శుభాకాంక్షలు..

3) కుటుంబమంతా ఆనందంగా..

3) కుటుంబమంతా ఆనందంగా..

నవరాత్రుల వేళల్లో పండుగ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇంత ప్రాముఖ్యత కలిగిన పండుగను కుటుంబమంతా కలిసి ఆనందంగా జరుపుకోవాలని మనసారా కోరుతూ.. మీకు నవరాత్రి శుభాకాంక్షలు..

4) చెడుపై మంచి విజయం..

4) చెడుపై మంచి విజయం..

ఈ నవరాత్రుల ద్వారా చెడుపై మంచి ఎప్పుడూ గెలుస్తుందని నిరూపించబడింది. అలాగే మీకు, మీ కుటుంబంలో కూడా ఎల్లప్పుడూ విజయం చేకూరాలని కోరుకుంటూ నవరాత్రి శుభాకాంక్షలు..

5) శక్తివంతంగా..

5) శక్తివంతంగా..

మీకు, మీ కుటుంబసభ్యులకు పేరు ప్రఖ్యాతలు, కీర్తి, ఆరోగ్యం, సంపద, ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, జ్ఞానంతో పాటు దుర్గామాత వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ అందజేసి మీరు నిత్యం శక్తివంతంగా ఉండేలా చూడాలని కోరుతూ నవరాత్రి శుభాకాంక్షలు..

6) ఎల్లప్పుడూ దుర్గమ్మ ఆశీస్సులు..

6) ఎల్లప్పుడూ దుర్గమ్మ ఆశీస్సులు..

ఈ నవరాత్రులే కాకుండా మీరు జీవించినంత కాలం మీకు దుర్గామాత ఆశీస్సులు ప్రసాదించాలని కోరుతూ నవరాత్రి శుభాకాంక్షలు..

7) సంతోషంగా వేడుకలు.

7) సంతోషంగా వేడుకలు.

ఈ నవరాత్రుల్లో ప్రతి ఒక్కరూ ప్రకాశవంతంగా ఉండాలని, అందరూ కలిసి సంతోషంగా వేడుకలు జరుపుకోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ నవరాత్రి శుభాకాంక్షలు..

8) కలర్ ఫుల్..

8) కలర్ ఫుల్..

ఈ నవరాత్రులు కలర్ ఫుల్ గా జరగాలని, కలర్ ఫుల్ లైటింగుతో మీ ఇంటిని అందంగా అలంకరించుకుని, ఆనందంగా పండుగను జరుపుకోవాలని కోరుతూ నవరాత్రి శుభాకాంక్షలు..

9) చిరునవ్వులతో నిండిపోవాలి..

9) చిరునవ్వులతో నిండిపోవాలి..

మన దుర్గామాత మీకు ఆశీర్వదించి, మీ జీవితంలో మీకు ఆశలను నెరవేర్చి, ఈ ఏడాదంతా చిరునవ్వులతో చిరంజీవులుగా జీవించాలని కోరుతూ.. నవరాత్రి శుభాకాంక్షలు..

10) మీకు శాంతి ప్రసాదించాలని..

10) మీకు శాంతి ప్రసాదించాలని..

ఈ నవరాత్రుల్లో దుర్గా దేవిని పూజించిన వారందరికీ శాంతి చేకూరాలని కోరుతూ అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు..

English summary

Navratri 2019: Wishes, Messages, Whatsapp and Facebook Status

During these nine days, the nine manifestations of Goddess Durga is worshipped with much grandeur. And on the tenth day (Dusshera/Vijayadashami), people burn huge effigies of Ravana that symbolizes good over evil.On the occasion of Navratri wish your friends and family by sending these heart-warming greetings and beautiful messages.
Desktop Bottom Promotion