For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మౌని అమావాస్య నాడు ఈ పనులు అస్సలు చేయకూడదట...

|

మరి కొన్ని గంటల్లో మౌని అమావాస్య మొదలవ్వబోతోంది. శుక్రవారం నాడు వచ్చే ఈ అమావాస్య రావడంతో ఇది శుభ సంఘటనగా పండితులు చెబుతున్నారు. హిందూ పురాణాల ప్రకారం ఈరోజు ఎంతో ప్రత్యేకమైనది. ఈ పర్వదినాన ఎక్కువ మంది భక్తులు గంగా నదిలో స్నానం చేసేందుకు లేదా వారికి దగ్గర్లోని నదీ ప్రాంతాల్లో స్నానం చేస్తారు.

అనంతరం శనిదేవుడిని పూజిస్తారు. నువ్వుల నూనెతో ఆ దేవుడిని పూజిస్తారు. అనంతరం పేదలకు అన్నదానం, వస్త్రాల దానం వంటివి చేస్తారు. దీని వల్ల గత జన్మలో చేసిన పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. అలాగే మహిళలు మౌనవ్రతం కూడా చేస్తారు. అయితే మౌనవ్రతం చేయలేని వారు మనసులోని కోరికను కాగితంపై తులసి లేదా పసుపు కొమ్మతో రాసి అరచేతుల్లో ఉంచి, దానినే కళ్లు ఆర్పకుండా చూడాలి.

ఇలా ఎంత సేపు చూడగలిగితే అంతవరకు చూసి కను రెప్పలు మూసే సమయంలో 'ఓ ప్రకృతి మాతా.. నేను కోరిన కోరికను తీర్చు' అని కోరుకోవాలి. తర్వాత ఆ కాగితాన్ని నోటితో ఊది మడవాలి. అనంతరం దానిని ఆ కాగితాన్ని పూజా మందిరంలో దేవుని వద్ద ఉంచితే మీ కోరికలు తప్పకుండా నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు. అయితే ఈ మౌని అమావాస్య నాడు కొందరు తెలియకుండా కొన్ని పొరపాట్లు చేస్తుంటారు? ఇంతకీ ఈరోజున ఎలాంటి పనులు చేయకూడదో తెలియాలంటే ఈ స్టోరీని పూర్తిగా చూడండి...

మౌని అమావాస్య రోజున ఆ నది నీళ్లు అమృతంలా మారిపోతాయా?

ఆలస్యం నిద్ర లేవడం..

ఆలస్యం నిద్ర లేవడం..

మౌని అమావాస్య నాడు తెల్లవారుజామున 4 నుండి 6 గంటల మధ్య అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి అని హిందూ శాస్త్రాలలో పేర్కొనబడింది. అయితే ఆలస్యంగా ఎట్టి పరిస్థితుల్లో లేవకూడదట. ఆలస్యంగా మేల్కొనడం రాక్షసుల లక్షణం అని పురాణాలలో పేర్కొనబడింది. ఇలాంటి అలవాట్లు ఉన్న వారిని ప్రతికూల శక్తులు ఆకర్షిస్తాయి. ఈ ప్రతికూల శక్తులు అమావాస్యపై కూడా ఎక్కువగా ప్రభావం చూపుతాయి. అందుకే మౌని అమావాస్యలో ఆలస్యంగా లేవకుండా, తెల్లవారుజామునే నిద్ర లేవాలి.

శారీరక సంబంధాలు..

శారీరక సంబంధాలు..

ఈ మౌని అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లో శారీరక సంబంధాలు పెట్టుకోకూడదట. దీని వల్ల ప్రతికూల శక్తులు ప్రధానంగా ఉంటాయట. ఒక వేళ కపుల్స్ కలయికలో పాల్గొని ఉంటే, వారికి పుట్టబోయే బిడ్డ శారీరక వైకల్యంతో పుడతాడని పురాణాలలో పేర్కొనబడింది. దీన్ని చాలా మంది హిందువులు నమ్ముతారు.

పూర్వీకులను ఇబ్బంది పెట్టొద్దు..

పూర్వీకులను ఇబ్బంది పెట్టొద్దు..

మౌని అమావాస్య అంటేనే మన పూర్వీకులను మెప్పించే రోజు అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈరోజున ఉద్దేశ పూర్వకంగా లేదా అనుకోకుండా మీరు ఏవైనా తప్పులు చేసి క్షమించమని మీ పూర్వీకులను కోరితే అందుకు నివారణలు పొందుతారట. అయితే ఈ విషయం గురించా చాలా మందికి తెలియదు. అలాగే ఈరోజు ఎవరిపైనా కోపం ప్రదర్శించకూడదు. అలాగే హింసను నివారించాలి. ప్రశాంతంగా ఉండాలి.

2020లో అమావాస్య ఏయే తేదీల్లో.. ఏయే వారాల్లో వస్తుంది.. ఆ సమయంలో మీరు ఎలాంటి పనులు చేయాలంటే...

పేదలను అగౌరపరచడం..

పేదలను అగౌరపరచడం..

ఈ మౌని అమావాస్య రోజున చాలా మంది పేదలకు అన్నదానం మరియు వస్త్రదానం వంటివి చేస్తుంటారు. అయితే మీరు ఈ పర్వదినాన పేదవారిని ఇబ్బంది పెడితే దేవుడు మీపై కోపం పెంచుకుంటాడట. అయితే అమావాస్య రోజున మాత్రమే కాకుండా ఎల్లప్పుడూ పేదలన అగౌరవపరచకుండా చూడండి.

2020 సంవత్సరంలో సంకష్ఠ చతుర్ధి ఏయే సమయంలో వచ్చిందంటే...

ఆ చెట్ల చుట్టూ ప్రతికూల శక్తులు..

ఆ చెట్ల చుట్టూ ప్రతికూల శక్తులు..

చాలా మంది హిందువులు మర్రి చెట్టుకు ప్రతికూల శక్తులు ఉంటాయని నమ్ముతారు. ఈ మౌని అమావాస్య రోజున వాటికి మరిన్ని శక్తులు వస్తాయని, ఈరోజున ఆ చెట్ల వద్దకు వెళ్లకూడదని చెబుతుంటారు.

English summary

Never Do These Things On Mauni Amavasya

Mauni Amavasya is considered a lucky day for performing various virtuous deeds. However, one should never do these five things on Mauni Amavasya. Read more.
Story first published: Thursday, January 23, 2020, 17:28 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more