For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వృశ్చిక రాశి వారితో ఈ మాటలు మాట్లాడకండి

|

ఒక వృశ్చిక రాశికి చెందిన వ్యక్తితో వ్యవహరించేటప్పుడు, మీరు పూర్తిగా పక్కన పెట్టాల్సిన కొన్ని ప్రత్యేకమైన అంశాలు ఉన్నాయి. లేనిచో, వీరి ఆగ్రహావేశాలకు బలికాక తప్పదు అంటున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.

వృశ్చిక రాశి వారు ఎందుకని అంత విచిత్రమైన ధోరణిని కలిగి ఉంటారు ? అంత తేలికగా అంశాలను ఎందుకు పక్కన పెట్టరు ? అంత ప్రతీకారేచ్చ కలిగి ఉండడానికి గల కారణాలు ఏమిటి ? ఇటువంటి అనేక ప్రశ్నలు వృశ్చిక రాశి వారి పరంగా ఉండడం సర్వసాధారణం. దీనికి కారణాలు కూడా అనేకం ఉన్నాయి.

ఈ కారణాల గురించిన అనేక విశ్లేషణలు కూడా ప్రచారంలో ఉన్నాయి.

ఈ కారణాల గురించిన అనేక విశ్లేషణలు కూడా ప్రచారంలో ఉన్నాయి.

ఒకవేళ మీరు వృశ్చిక రాశి వారితో ప్రేమలో లేదా వైవాహిక సంబంధాన్ని కలిగి ఉన్నట్లయితే, మీరు ఇక్కడ చెప్పబడిన విషయాలను అడగకుండా, లేదా చర్చించకుండా పరిహరించేలా చర్యలు తీసుకోవాలి. మీరు ఈ విషయాల పట్ల చర్చలు జరిపినా, లేదా వారిని నేరుగా అడిగినా, వాటిని, వారు తీవ్రంగా పరిగణించి తమకు వ్యతిరేకంగా తీసుకుని తిరిగి నిందించే అవకాశాలు ఉన్నాయి. పైగా వీరు ప్రతీకారేచ్చను కలిగి ఉంటారు. ఏదిఏమైనా కుటుంబం మరియు బాహ్య సమాజం దృష్ట్యా ఎవరికి తగ్గ న్యాయం వారికి చేస్తుంటారు. కానీ అవకాశాన్ని మాత్రం వదిలిపెట్టరు.

 నీకు క్షమించడమే రాదా ?

నీకు క్షమించడమే రాదా ?

వృశ్చిక రాశి వారితో మాట్లాడకూడని లేదా చర్చించకూడని విషయాల గురించిన సమగ్ర సమాచారం.

వృశ్చిక రాశి వారు ఏ ఇతర రాశుల వారి కన్నా, కఠినమైన ప్రతీకారేచ్చను కలిగి ఉంటారని చెప్పబడింది. ఎవరైనా తమను తప్పుగా భావించినప్పుడు వారిని ఎన్నటికీ క్షమించరు లేదా మర్చిపోరు. వారు ప్రత్యేకించి మాస్టర్ మానిప్యులేటర్ కూడా కావచ్చు. మరియు మీరు వారి నమ్మకాన్ని వమ్ము చేసిన పక్షంలో, వృశ్చిక రాశి వారు మరింత కఠినతరమైన ఆలోచనలను చేస్తుంటారు. ఆ దైవానుగ్రహం ఉంటే తప్ప, వీరు తమ ఆగ్రహావేశాలను పక్కన పెట్టరు. కానీ, సంబంధ భాంధవ్యాల పరంగా ఆలోచన కలిగి ఉంటారు కాబట్టి, వీరి కోపం ఎక్కువ కాలం ఉండబోదు కూడా. మరియు వీరికి ఓర్పు తక్కువ, క్రమంగా, పగ తీర్చుకోవడానికి ఎక్కువ కాలం తీసుకోరు కూడా.

నన్ను నమ్ము ప్లీజ్

నన్ను నమ్ము ప్లీజ్

వృశ్చిక రాశి వారి ముందు మాట్లాడకూడని మాటల్లో ఇది అన్నిటి కన్నా ముందు ఉంటుంది. పొరపాటున ఇలా అన్నారో, వారి కోపాన్ని చల్లార్చడం ఎవరి వలనా కాదు. వీరు నిజానికి ఎవరినీ నమ్మరు, పైగా సమగ్ర విషయానుభావం ఉండాలని భావించే వ్యక్తిత్వం వీరిది. వీరిని ఎవరైనా తమను నమ్మమని అడిగితే, వీరి కోపం నషాళానికి అంటుతుంది. ఈ కోణం కొంచం తులా రాశి వారిని పోలి ఉంటుంది. కావున వీరిని ఇలా అడగడం మానేసి, వారి పట్ల నమ్మకాన్ని పునర్నిర్మించుకునే ప్రయత్నాలు చేయడం మంచిది. పైకప్పు నుండి వీరిని అరవడం కన్నా, మీ విశ్వసనీయత లేదా నిబద్దతను నిరూపించుకోవడమే అన్నిటికన్నా ఉత్తమమని గుర్తుంచుకోండి!

Most Read : మా ఆయన రోజూ అందులోనే లీనమైపోతాడు, నన్ను పట్టించుకోడు, కోరికల్ని అణుచుకోలేకచస్తున్న

"ఎందుకలా కఠినంగా ఉన్నారు?"

ఈ వృశ్చిక రాశికి చెందిన వ్యక్తులు ఒక వ్యక్తిని ఎంతగా ప్రేమిస్తారో, తేడా వస్తే అంతే ద్వేషాన్ని ప్రదర్శిస్తుంటారు. ఏదిఏమైనా మానసికంగా స్పష్టతను కలిగి ఉంటారు. వారి అంతర్గత ఆలోచనలు, తీవ్ర స్థాయిలో ఉంటాయి. స్వీయ నియంత్రణ లోపం కారణంగా, ఇటువంటి వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తుంటారని జ్యోతిష్కుల అభిప్రాయం. వారు ఎటువంటి వృత్తిలో ఉన్నా, సంబంధిత అంశాల పట్ల పూర్తి అవగాహనను కలిగి ఉంటారు. క్రమంగా ఎన్నో రకాల పరిశోధనలు చేస్తూ, ఒక వివరణాత్మక సమాధానాన్ని మనసులో కలిగి ఉంటారు. తద్వారా ఫలితాలలో అనూహ్య మార్పులు, లేదా తప్పులు దొర్లిన పక్షంలో, వీరు ఖచ్చితమైన సమాధానాన్ని కలిగి ఉన్న కారణంగా వాదనలో ఎల్లప్పుడూ ముందుగా ఉంటారు. క్రమంగా వీరి ధోరణి కఠినాత్మకమైనదిగా కనిపిస్తుంటుంది. వీరిని తిరిగి ఎందుకలా కఠినంగా ప్రవర్తిస్తున్నారు అని అడగడం, వీరి సామర్ధ్యాలను ప్రశ్నించడమే అని వీరి ఆలోచనగా ఉంటుంది. ఇది వారి ఆగ్రహావేశాలకు కారణమవుతుంది.

"నేనే కరెక్ట్ !"

మీ దృష్టిలో మీరే కరెక్ట్ అయి ఉండవచ్చు. కానీ వారి దృష్టిలో మీరు చేసిందే తప్పు. వారొక స్వీయ రూపకాన్ని మనసులో కలిగి ఉన్న కారణంగా, పూర్తిగా అదే నిజం అన్న భ్రమలో ఉంటారు. ఎక్కువ శాతం వారు అనుకున్నదే నిజం కూడా అయి ఉండవచ్చు. కానీ ఎటువంటి విషయాలనైనా తమకు అనుకూలంగా మార్చుకోగల శక్తి కలిగిన వారిగా ఈ వృశ్చిక రాశి వారు ఉంటారు అనడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. ఒక విషయం గురించి వీరికి పూర్తిగా అవగాహన ఉన్నట్లుగా, తమకు తాము భావించిన ఎడల, ఎట్టిపరిస్థితుల్లో వేరొకరి సూచనలను పాటించడానికి కూడా సిద్దంగా ఉండరు. క్రమంగా ఎవరు తమకు సూచనలను ఇవ్వడానికి ప్రయత్నించినా, వారిని ద్వేషించడం మొదలు పెడుతారు. వీరు నమ్మిన వ్యక్తుల పట్ల మాత్రమే, కొంత సానుకూలతను కలిగి ఉంటారు. పోటీతత్వం, బిజినెస్ మైండ్, కఠినత్వం మొదలైనవి వృశ్చిక రాశి వారి వ్యక్తిత్వాన్ని సూచించేవిగా ఉంటాయి.

"మీరు ఇగోయిస్టిక్ " :

ఒక సామెత, వృశ్చిక రాశి వారి స్వభావం గురించి ఇలా చెబుతో౦ది : "మీరు ఒక వృశ్చిక రాశి వారిని కార్నర్ చేసి, తప్పించుకోవటానికి ఎటువంటి ఆస్కారం ఇవ్వని పక్షంలో, తాను మరణించడానికి కూడా సిద్దపడుతాడు కానీ, ఎట్టి పరిస్థితుల్లో తలొగ్గరు". అనగా తమను తాము నాశనం చేసుకునైనా, తమ పంతం నెగ్గించుకుంటారు కానీ, ఆలోచనలకు భిన్నంగా వ్యక్తిత్వాన్ని మార్చుకొనుటకు సిద్దంగా ఉండరు. అటువంటి స్వభావాన్ని అసూయ అని భావిస్తే, వీరి కోపం కట్టలు తెంచుకుంటుంది.

Most Read : ఆ సమయంలో కలయిక జరిగితే కచ్చితంగా గర్భం వస్తుంది, ఎలాంటి అమ్మాయినైనా నెలరోజుల్లో నెల తప్పించొచ్చు

"కాదు, లేదు అనే పదాలు వీరి వద్ద నిషిద్దం" :

వీరు అవహేళన (ఎగతాళి) చేయడంలో ముందు వరసలో ఉంటారు. ఒక్కోసారి వీరి అవహేళనలు ఎదుటివారి అహాన్ని సైతం దెబ్బతీస్తాయి. ముఖ్యంగా వీరు ఆశించిన విషయాలు, లేదా ఫలితాల నందు లేదు, కాదు అనే మాటలను విన్న పక్షంలో వీరికి చిర్రెత్తుతుంది. క్రమంగా ద్వేషభావం పెరిగి, అవహేళనలకు సైతం దిగుతారు. ఒక్కోసారి ఆ మాటలను విననట్లు నటిస్తారు కూడా. ఈ విషయంలో వారు విషపూరిత సంబంధాల ప్రభావాలు కూడా కారణమై ఉండవచ్చు. క్రమంగా వారి అహంకారం ఈ సంబంధాలను అంటి పెట్టుకుని ఉండేలా చేస్తుంది కూడా. అంతేకాకుండా, వారి వైపు నుండి ఎటువంటి తప్పు లేకుండా చూసుకునేలా చర్యలు తీసుకుంటూ ఉంటారు. క్రమంగా వీరిని కాదు అనడానికి కూడా ఆస్కారం లేకుండా చేయగలరు.

"మీకు అసూయగా ఉందా ?"

ఏదిఏమైనా వాస్తవం ఏదైననప్పటికీ, వీరి మనసును సంతృప్తి పరచని పక్షంలో అంగీకరించలేని స్వభావాన్ని ప్రదర్శిస్తుంటారు. వృశ్చిక రాశి వారికి, ఈర్ష్య అనేది వారి బలమైన లక్షణాల్లో ఒకటిగా ఉంటుంది. పగ, అసూయలతో కూడుకుని కనిపిస్తుంటారు. కావున., మీకు మానసిక ప్రశాంతతతో కూడిన జీవితం ఉండాలని భావిస్తున్న ఎడల, వృశ్చిక రాశి వారి పట్ల ఎటువంటి తప్పునూ చేయకండి. ముఖ్యంగా వారి లక్షణాలను ప్రశ్నించేలా మీ మాటలు ఉండకూడదు అని నిర్ధారించుకోండి.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర,ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, ఆరోగ్య, జీవనశైలి, మాతృత్వ, శిశు సంబంధ, ఆహార, లైంగిక, వ్యాయామ, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసం మీద మీ అభిప్రాయాలను క్రింది వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

Most Read : ఈ చిట్కాలు పాటిస్తే చర్మం ఎప్పుడూ కాంతివంతంగా ఉంటుంది, అందంగా కనిపిస్తారు

English summary

Never Tell These Things to a Scorpio

There are a few things that you should completely avoid telling a Scorpio as these individuals are known for their intense and fearless side that can kill people! From asking them why they are so intense or why they do not forget or forgive easily would make you see a different side of a Scorpio.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more