For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తిరుమల భక్తులకు గమనిక: వెంకన్న సన్నిధికి వెళ్లాలంటే.. ఇవి ఉండాల్సిందేనట...

తిరుపతి, తిరుమల వెళ్లే యాత్రికులకు కొత్త కోవిద్-19 మార్గదర్శకాలొచ్చాయి. అవేంటో చూసెయ్యండి.

|

మీరు తరచుగా తిరుపతి, తిరుమలకు వెళ్తుంటారా? వెంకన్న సన్నిధికి చేరుకుని స్వామిని దర్శించుకుంటూ ఉంటారా? ఇప్పటిదాకా తిరుమల వెళ్లాలంటే ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించి టికెట్ తో పాటు ఆధార్ కార్డు లేదా ఓటర్ కార్డు ఉంటే సరిపోయేది. అయితే ఇది వరికటిలా మామూలుగా ప్రత్యేక దర్శనం టికెట్ ను ఆన్ లైనులో బుక్ చేసుకుని వెళ్లడానికి కుదరదు.

New Covid-19 Guidelines for Tirupati Tirumala Pilgrims in Telugu

ఇప్పటినుండి తిరుమలలోకి ప్రవేశించాలంటే.. కరోనా వ్యాక్సిన్లు రెండు డోసులు వేసుకున్నట్టు సర్టిఫికెట్లు చూపించాలి. అవి కూడా మీ వెంట తీసుకెళ్లాలి. ఒకవేళ మీరు వ్యాక్సిన్ తీసుకోకపోతే మీరు మూడు రోజుల కరోనా నెగిటివ్ రిపోర్టును తప్పనిసరిగా చూపించాల్సిందే. లేదంటే మీకు స్వామి దర్శనం ఉండదని తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) స్పష్టం చేసింది. కరోనా వైరస్ విస్తరించకూడదనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు.

New Covid-19 Guidelines for Tirupati Tirumala Pilgrims in Telugu

ఈ నేపథ్యంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) అక్టోబర్ నెలకు సంబంధించిన ప్రత్యేక దర్శనం రూ.300 టికెట్ల (దాదాపు 20 వేలు)ను సెప్టెంబర్ 24వ తేదీ ఉదయం 9 గంటల నుండి అందుబాటులో ఉంచింది. రేపటి నుండి సర్వదర్శనం టికెట్లను కూడా అందుబాటులో ఉంచింది. అదే విధంగా 25వ తేదీ ఉదయం 9 గంటల నుండి సర్వ దర్శనం టికెట్లను(దాదాపు 8 వేల వరకు) కూడా అందుబాటులో ఉంచనుంది.

New Covid-19 Guidelines for Tirupati Tirumala Pilgrims in Telugu

అయితే అన్ని టికెట్లను అందుబాటులో ఉంచడం వల్ల ఆఫ్ లైనులో టికెట్లను ఇవ్వడాన్ని నిలిపివేయనున్నారు. సెప్టెంబర్ 26వ తేదీ నుండి తిరుపతిలో శ్రీనివాసం కాంప్లెక్స్ లో సర్వదర్శనానికి సంబంధించిన ఆఫ్ లైన్ టికెట్లను ఇవ్వడం ఆపివేయనున్నారు. తిరుపతి వాసులతో పాటు ఇతర రాష్ట్రాల ప్రజలు సర్వదర్శనం టికెట్ల కోసం ఎగబడుతూ ఉండటం వల్ల.. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా వేగంగా విస్తరించే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు టిటిడి ప్రకటించింది.

కోవిద్ నియంత్రణ కోసం తీసుకున్న ఈ నిర్ణయానికి భక్తులందరూ సహకరించాలని.. త్వరలోనే మరిన్ని చర్యలు చేపడతామని టిటిడి చైర్మన్ వివరించారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతోనే సర్వదర్శనానికి సంబంధించిన టికెట్లను కూడా జారీ చేస్తున్నామన్నారు. వీటి సంఖ్యను కూడా క్రమంగా పెంచుతామన్నారు.

ఇది వరకే చిత్తూరు జిల్లా వాసులకు మాత్రమే ప్రయోగాత్మకంగా సర్వదర్శనం టికెట్లను జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ జిల్లాకు చెందిన వారికి రోజుకు కేవలం రెండు వేల టోకెన్లు మాత్రమే జారీ చేశారు. ప్రస్తుతం అన్ని ప్రాంతాల వారికి రోజుకు ఎనిమిది వేల టోకెన్లకు పెంచి ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ సర్వదర్శనం అవకాశం కల్పించారు. అయితే దీనికి కూడా అనూహ్యంగా డిమాండ్ పెరగడంతో.. కరోనా సర్టిఫికెట్లు తప్పనిసరి అనే నిబంధనను తప్పనిసరి చేశారు.

అలాగే శ్రీవారి దర్శనానికి సంబంధించిన టికెట్లను 'Govinda'యాప్ లో గానీ లేదా టిటిడి వెబ్ సైటు https://tirupatibalaji.ap.gov.in/లో లాగిన్ అయి బుక్ చేసుకోవాలని విజ్ణప్తి చేశారు. కేవలం ఇందులో నుండి బుక్ చేసుకున్న వారికి మాత్రమే తిరుమల దర్శనానికి అనుమతి ఉంటుందని.. టికెట్ల విషయంలో బ్రోకర్లను నమ్మి మోసపోవద్దని.. ఇతర నకిలీ టికెట్లు చూపితే.. వారిపై చర్యలు తీసుకుంటామని టిటిడి స్పష్టం చేసింది. ఇప్పటికే కొందరు భక్తులు అలా మోసపోయారని.. వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని వివరించారు.

మరిన్ని పూర్తి వివరాలకు, ఏదైనా ఫిర్యాదులకు సంబంధించిన సమస్యల కోసం టిటిడి టోల్ ఫ్రీ నంబర్లను సంప్రదించగలరు.
ఆ నెంబర్లు ఇలా ఉన్నాయి.

1) 1800 4254141
2) 0877 2233333
3) 0877 2277777

English summary

New Covid-19 Guidelines for Tirupati Tirumala Pilgrims in Telugu

Here we are talking about the new Covid-19 Guidelines for Tirupati Tirumala Pilgrims in Telugu. Have a look
Story first published:Friday, September 24, 2021, 14:12 [IST]
Desktop Bottom Promotion