నవంబర్ 9 రేపు గురు పుష్యయోగం..చాలా పవిత్రమైన రోజు! అత్యంత శుభప్రదం!

Posted By: DEEPTHI T A S
Subscribe to Boldsky

పూర్ణిమ తిథి కృత్తిక‌ నక్షత్రంతో వచ్చిన కారణంగా ఈ మాసాన్ని కార్తీకం అంటారు. అయితే గురువారం నాడు పుష్యమి నక్షత్రం రావడాన్ని గురు పుష్యయోగంగా పేర్కొంటారు. జ్యోతిష గ్రహాలు, నక్ష్రత్రాల కలయికతో ఏడాదికి ఆరుసార్లు వరకు గురు పుష్య యోగం సంభవిస్తుంది. ఈ గురు పుష్య యోగం జరిగే సమయం విశేష శుభప్రదమైందిగా భావిస్తారు. ముఖ్యంగా వివాహ సంబంధిత అంశాలు తప్ప మిగతా వాటికి ఈ గురు పుష్య యోగం శుభప్రదమైంది. కానీ ఈ యోగం ధనుస్సు రాశిలో జన్మించిన వారికి అనుకూలం కాదు. మిగతా రాశులు వారు ఈ గురు పుష్యయోగం జరిగే సమయంలో భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించిన విషయాలపై నిర్ణయం తీసుకోవచ్చు.

కోరికలు తీర్చే హిందూ వ్రతాలు, ఉపవాస నియమాలు గురించి తెలుసుకోండి

'పుష్య’ అంటే పోషించబడేది లేక పెరిగేది అని అర్థం. గ్రహాల్లో పెద్దదైన గురుడు, పుష్యమి నక్షత్రంలో ప్రవేశించటాన్ని గురుపుష్య యోగంగా భావిస్తారు. జ్యోతిష్యంలో ఈ కాలానికి చాలా విశిష్టత ఉన్నది. ఈ కొద్ది పవిత్ర సమయాన్ని సరైన దిశలో వాడుకుంటే, మీ మనస్సులోని అన్ని కోరికలూ తీరతాయి. మరికొన్ని విశేషాలను తెలుసుకుందాం

నవంబర్ 9,2017 నాడు వచ్చే గురుపుష్య యోగం

నవంబర్ 9,2017 నాడు వచ్చే గురుపుష్య యోగం

ఈ ఏడాది మనకి గురుపుష్య యోగం అదృష్టవశాత్తూ 5 రోజుల పాటు వస్తోంది. జ్యోతిష్యంలో వివరించినట్లు, ఈ పవిత్రమైన కలయిక కేవలం పుష్య నక్షత్రం గురువారం (గురు గ్రహం పాలించే రోజు) నాడు వస్తేనే జరుగుతుంది.

గ్రహాల కలయిక మరియు స్థితులు

గ్రహాల కలయిక మరియు స్థితులు

వేదజ్యోతిష్యం ప్రకారం, ప్రతి సంవత్సరం, గ్రహాల మరియు నక్షత్రాల కలయిక స్థితులు 6 ( ఒకటి లేదా రెండు ఎక్కువ తక్కువలుగా) పవిత్రమైన రోజులుగా, గురు పుష్యయోగంగా పిలవబడతాయి.

హిందూమతం – పవిత్ర కార్యక్రమాలు

హిందూమతం – పవిత్ర కార్యక్రమాలు

ఈ 6 రోజులు ఎంత పవిత్రమైనవి అంటే ఏ పని అయినా, ఎలాంటి శుభకార్యాలైనా (పెళ్ళి తప్ప- పెళ్ళి గురించి పండితులను సంప్రదించండి) ప్రత్యేక ముహూర్త సమయంలో జరుపుకోవచ్చు.

జ్యోతిష్యంలో బృహస్పతి లేదా గురుడు

జ్యోతిష్యంలో బృహస్పతి లేదా గురుడు

గురువారాలను బృహస్పతి (గురు) గ్రహం పాలిస్తుంది. ఈ రోజు, గురుగ్రహం చెడు ప్రభావం ఉన్న వారు విష్ణుమూర్తినే తప్పక పూజించాలనే నియమం ఉన్నది.

గురువును పూజించటంలో విశిష్టత ఏమిటి

గురువును పూజించటంలో విశిష్టత ఏమిటి

గురు గ్రహం అదృష్టానికి సంకేతం కాబట్టి, ఎవరైతే ఈ గ్రహం వలన తమ జాతకచక్రంలో చెడు ప్రభావంతో ఉన్నారో వారు ప్రతి గురువారం విష్ణుమూర్తిని పూజించటం మంచిదని సూచిస్తారు.

ఎందుకు అది పవిత్రమైనది?

ఎందుకు అది పవిత్రమైనది?

అందుకని, ఎప్పుడైతే పుష్య నక్షత్రం గురువారం నాడు వస్తుందో, దాన్ని గురుపుష్య యోగంగా అంటారు. ఇది జ్యోతిష్యప్రకారం చాలా పవిత్రమైన,అదృష్ట సమయం.

ఓంకార నాదంగా పిలువబడే " ఓం " గురించి ఆసక్తికర విషయాలు !!

2017 లో పవిత్రమైన రోజులు

2017 లో పవిత్రమైన రోజులు

ఇప్పటివరకు, ఇలా 3 సార్లు జరిగింది. ఇక ఆఖరు నుంచి రెండవది అంటే నాలుగో గురుపుష్యయోగం కొన్నిరోజుల్లో వస్తుంది.

2017 లో గురుపుష్య యోగం

2017 లో గురుపుష్య యోగం

ఈ ఏడాది, గడిచిన మూడు గురుపుష్య యోగాలు వచ్చిన రోజులు ; జనవరి 12, ఫిబ్రవరి 09, మార్చి 09. వచ్చేది నవంబర్ 9, 2017 న వస్తుంది. కాకపోతే రాబోయే యోగం మూడేళ్ళ తర్వాత రాబోతోంది కాబట్టి మరింత పవిత్రమైనది.

నవంబర్ 9 న వచ్చే గురుపుష్యయోగం

నవంబర్ 9 న వచ్చే గురుపుష్యయోగం

నవంబర్ 9, 2017 న, గురుపుష్యయోగం 1.39 పిఎం కి మొదలై, (మరునాడు పొద్దున) 6.09 ఎ ఎం వరకూ కొనసాగుతుంది. అంటే ఈ ముహూర్తం 16 గంటల 30 నిమిషాల పవిత్ర సమయాన్ని ఇస్తుంది.

లక్ష్మీ అమ్మవారి జన్మదినం

లక్ష్మీ అమ్మవారి జన్మదినం

హిందూ జ్యోతిష్యంలో నక్షత్రాలలో పుష్యనక్షత్రం, దాని ఎదుగుదల స్వభావం వలన చాలా ముఖ్య, ప్రసిద్ధ నక్షత్రంగా భావిస్తారు. దీనికి ఇంత గొప్ప విశిష్టత, సముద్రమథన సమయంలో లక్ష్మీదేవి కూడా ఈ నక్షత్రంలోనే పుట్టింది కాబట్టి వచ్చింది.

లక్ష్మీదేవి ఆశీస్సులు

లక్ష్మీదేవి ఆశీస్సులు

అందుకని , ఈ యోగం రాగానే, స్వర్గంలో దేవతలు ఈ రోజును పండగలా లక్ష్మీదేవిని పూజించి జరుపుకుంటారు. పైగా ఆ రోజు గురువారమైతే, విష్ణుమూర్తి (ఆమె భర్త)కి అంకితమివ్వబడిన రోజు కాబట్టి హిందువులకి మరింత ముఖ్య సమయంగా మారిపోతుంది.

విష్ణు –లక్ష్మి

విష్ణు –లక్ష్మి

ఈ యోగ సమయంలో మొదలుపెట్టిన ఏ మంచిపనికైనా లక్ష్మీ అమ్మవారు, విష్ణుమూర్తుల ప్రత్యేక ఆశీస్సులు ఉండి, అన్ని మంచి ఫలితాలు, లాభాలు అందిస్తాయి. ఈ సమయంలో చేసే ఎలాంటి పని అయినా చాలా సంపద, కీర్తి, అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది.

English summary

November 9, will be the most auspicious day of 2017!

This year, we have had the fortune of having the 5 auspicious days of Guru Pushya Yoga. As explained in astrology, this sacred permutation only occurs when the Pushya Nakshatra befalls on a Thursday (ruled by Guru).
Story first published: Wednesday, November 8, 2017, 19:30 [IST]