For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కష్టాలు తీరాలన్నా, విదేశాలకు వెళ్లాలనుకున్నా అక్కడ విమానం బొమ్మ సమర్పిస్తే చాలు

ఆయన అందులో మంచి నేర్పరి. అలాగే నిహాల్ పై మరో నమ్మకం కూడా జనాలకు ఏర్పడింది. ఆయన ఏ బావికి గిలక అమర్చినా అది ఎప్పటికీ ఎండిపోదు అని జనాలు నమ్మేవారు. అందుకే ప్రతి బావికి తన చేతితోనే గిలకను కట్టించేవారు

|

మనకు ఏ చిన్న కష్టం వచ్చినా సరే దేవుణ్ని తలుచుకుంటాం. భగవంతుడికి అన్ని బాధలు చెప్పుకుంటాం. దేవుడిని నమ్మితే మన కష్టాలు తీరుతాయని మనం నమ్మకం. అయితే ఒక్కో దేవున్ని మనం ఒక్కోలా పూజిస్తుంటాం. ఒక్కోవిధంగా ఆరాధిస్తుంటాం. ఇక పంజాబులోని జలంధర్‌ కు సమీపంలోని ఒక గురుద్వారాలో దేవుడికి భక్తులు మొక్కులు చెల్లించుకునే తీరు కాస్త భిన్నంగా ఉంటుంది.

జలంధర్ కు పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉండే తల్హాన్‌ గ్రామంలో గురుద్వారా కొలువై ఉంది. ఇందులో బాబా షహీద్‌ నిహల్‌ సింగ్ కొలువై ఉన్నాడని భక్తుల నమ్మకం. నిహాల్‌ సింగ్‌ కు సంబంధించిన సమాధి గురుద్వారాలోనే ఉంది.

జనాల గుండెల్లో స్థానం

జనాల గుండెల్లో స్థానం

నిహాల్‌ సింగ్‌ బతికి ఉన్న రోజుల్లోనే జనాల గుండెల్లో స్థానం సంపాదించుకున్నాడు. ఈయన బావిలకు సంబంధించిన గిలకలు చేస్తూ జీవనం సాగించేవాడు. వాటిని బావులకి అమర్చేవాడు. ఆయన చేసిన గిలకలు ఇప్పటికీ బావులకు ఉన్నాయి.

 ఏ బావికి గిలక అమర్చినా

ఏ బావికి గిలక అమర్చినా

ఆయన అందులో మంచి నేర్పరి. అలాగే నిహాల్ పై మరో నమ్మకం కూడా జనాలకు ఏర్పడింది. ఆయన ఏ బావికి గిలక అమర్చినా అది ఎప్పటికీ ఎండిపోదు అని జనాలు నమ్మేవారు. అందుకే ప్రతి బావికి తన చేతితోనే గిలకను కట్టించేవారు. ఆయన గిలక అమర్చితే ఆ బావిలో నీరు కూడా తియ్యగా మారుతుందిన జనాల నమ్మకం.

బావికి గిలక అమర్చడానికి వెళ్లి

బావికి గిలక అమర్చడానికి వెళ్లి

అయితే ఒకసారి నిహాల్‌ సింగ్ ఒక బావికి గిలక అమర్చడానికి బయల్దేరాడు. దాన్ని అమర్చుతుండగా ప్రమాదవశాత్తూ బావిలో పడి మరణించాడు. ఇక స్థానికులంతా కన్నీరుమున్నీరయ్యారు. తల్హాన్‌ గ్రామంలో గురుద్వారాలో ఆయన్ని సమాధి చేశారు.

Most Read :తనివితీరా ముద్దాడి గట్టిగా అల్లుకుపోయింది, నా చేతులు తనని నలిపేశాయిMost Read :తనివితీరా ముద్దాడి గట్టిగా అల్లుకుపోయింది, నా చేతులు తనని నలిపేశాయి

విమానం బొమ్మను సమర్పిస్తే

విమానం బొమ్మను సమర్పిస్తే

ప్రతి సంవత్సరం నిహాల్ సింగ్‌ వర్ధంతిని పురస్కరించుకుని గ్రామంలో పెద్ద జాతర జరుగుతుంది. జాతర సందర్భంగా గ్రామంలో వివిధ పోటీలు నిర్వహిస్తారు. చాలా ప్రాంతాల నుంచి జనాలు కూడా వస్తారు. అయితే నిహాల్ సింగ్ కొలువైన గురుద్వారాలో విమానం బొమ్మను సమర్పిస్తే తాము కోరుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం.

వీసా వచ్చేసి

వీసా వచ్చేసి

విదేశాలకు వెళ్లాలనుకునేవారు ఎక్కువగా ఇక్కడ విమానం బొమ్మల్ని ముడుపుగా సమర్పిస్తుంటారు. అలా చేసిన వెంటనే వీసా వచ్చేసి విదేశాలకు వెళ్లిపోయిన వారు చాలా మందే ఉన్నారట. విదేశ ప్రయాణాలకు ఉన్న అడ్డంకులన్నీ ఈజీగా తొలిగిపోతాయంట. దీంతో గురుద్వారాకు రోజూ వేలాది మంది వెళ్లి మొక్కులు తీర్చుకుంటూ ఉన్నారు.

Most Read :నా భర్త ఆ విషయంలో బలవంతపెడుతుంటే నో చెప్పలేకపోతున్నా, నన్ను ఆయన దారిలోకి తెచ్చుకున్నాడుMost Read :నా భర్త ఆ విషయంలో బలవంతపెడుతుంటే నో చెప్పలేకపోతున్నా, నన్ను ఆయన దారిలోకి తెచ్చుకున్నాడు

English summary

Offer a Toy Aeroplane at Shaheed Baba Nihal Singh Gurdwara in Jalandhar to Get a Visa

It may sound strange but this Gurudwara has made people believe that if you wish to go abroad, you offer prayers along with a toy aeroplane and it will be answered. No surprise that the shrine is now popularly known as 'Hawaijahaj' (aeroplane) gurudwara.
Desktop Bottom Promotion