ఓనమ్ - పంటకోత సందర్భంగా కేరళలో జరుపుకొనే ఈ పండగ గురించి తప్పక తెలుసుకోవలసిన విషయాలు

Posted By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

కేరళలో జరుపుకొనే అతి ముఖ్యమైన పెద్ద పండుగలలో ఓనమ్ కూడా ఒకటి. రైతులు తాము పండించిన పంట కోతకు రావడంతో అందుకు ఆనందపడుతూ చేసుకునే పండగ ఇది. మన తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతిని ఎలా చేసుకుంటామో అంతే సందడిగా అక్కడ ఓనమ్ చేసుకుంటారు. మనకు సంక్రాతి ఎలాగో వారికి ఓనమ్ అలాగ. ఈ పండుగ సందర్భంగా వాళ్లలో ఎంతగా ఆనందం వెల్లువిరిస్తుందో మాటల్లో వర్ణించలేం.

అత్యుత్సాహంతో కూడిన ఆనందంతో వాళ్ళు ఈ పండగను జరుపుకునే తీరు గురించి మనం అందరం ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి.

ఓనమ్ స్పెషల్: అడ పాయసం: కేరళ స్వీట్ రిసిపి

పురాణాల ప్రకారం, ఓనమ్ పండగను గొప్ప మహా రాజైన మాహా బలిని ఆహ్వానించే సంజ్ఞగా జరుపుకుంటారు. ఓనమ్ సందర్భంగా ఆ గొప్ప రాజు యొక్క ఆత్మ ఆ రాష్ట్రానికి వస్తుందని వాళ్ల నమ్మకం.

things to know about harvest festival in Kerala

కేరళ ప్రజలు మలయాళం పంచాంగాన్ని ( క్యాలెండర్ ) అనుసరిస్తారు, దీనినే కొల్ల వర్షం అని కూడా అంటారు. చింగమ్ మాసం ఆరంభంలో ఈ పండుగను జరుపుకుంటారు, ఈ మాసం మళయాళ పంచాంగం( క్యాలెండర్ ) లో మొదటి మాసం.

గ్రోగోరియన్ క్యాలెండర్ ( ప్రపంచవ్యాప్తంగా అనుసరించే క్యాలెండరు) ప్రకారం ఈ పండగని ఆగష్టు నుండి సెప్టెంబర్ మాసం మధ్యలో జరుపుకుంటారు.

ఓనమ్ ని ఎలా జరుపుకుంటారంటే :

మొదటి రోజుని అతమ్ గా పరిగణిస్తారు. పదవ రోజు మరియు చివర రోజులను తిరు ఓనమ్ అని అంటారు. ఈ పండగ రోజులన్నింటిలో ఈ రెండు రోజులని, మిగతా రోజులతో పోల్చినప్పుడు ఎంతో ముఖ్యమైన రోజులుగా భావిస్తారు.

ఈ పండగ సందర్భంగా కేరళ ప్రజలు పది రోజుల పాటు వారసత్వంగా వారికి వచ్చిన గొప్ప సంప్రదాయాలను ప్రతిబింభించేలా, అవి ప్రపంచానికి తెలిసేలా ఎంతో అద్భుతంగా జరుపుకుంటారు. అంత బాగా జరుపుకుంటారు కాబట్టే, 1961 లో ఈ పండగకు కేరళ జాతీయ పండుగగా గుర్తించారు.

things to know about harvest festival in Kerala

భారీ విందులు, అందమైన మనస్సుకు ఉల్లాసపరిచే జానపద పాటలు, సొగసైన అబ్భురపరిచే నృత్యాలు, అత్యుత్సాహంతో కూడుకొని ఎంతో ఆతురతను పెంచే ఆటలు, పెద్ద ఏనుగులు, పడవలు మరియు రకరకాల పూలు ఇవన్నీ ఓనమ్ పండగ సందర్భంగా చోటు చేసుకొనే అతిముఖ్యమైన విషయాలు.

అవియల్ కేరళ స్పెషల్-మనకు కొత్త రుచి

క్రీయాశీల శక్తివంతమైన ఈ పండుగను భారత దేశ ప్రభుత్వం గుర్తించి గౌరవించింది. అందుకు అనుగుణంగా ఈ ఓనమ్ పండగను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చేందుకు ప్రచారం చేస్తోంది. ఈ పండుగ సందర్భంలో వచ్చే రోజులను 'పర్యాటక వారం' గా ప్రభుత్వం ప్రకటించింది. ఓనమ్ పండగ సందర్భంగా ఈ రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎంతో మంది పర్యాటకులు కేరళ రాష్ట్రాన్ని సందర్శించి పరవశించిపోతారు.

ఓనమ్ గురించి పురాణాలు ఏమి చెబుతున్నాయంటే :

భూత రాజు మహాబలి కేరళ రాష్ట్రాన్ని పాలిస్తున్న కాలంలో ఈ ప్రాంతం వైభవానికి ప్రతీకగా నిలిచింది. ఆ కాలాన్ని కేరళ స్వర్ణ యుగంగా భావిస్తారు. అప్పుడు నివసించిన ప్రతి ఒక్కరు ఆనందంతో బ్రతకడమే కాదు, ప్రజలు ఎంతో ధనవంతులుగా విలాసవంతమైన జీవితాన్ని గడిపేవారు. ఆ రాజుని ప్రజలందరూ అమితంగా ప్రేమించేవారు, గౌరవించేవారు.

things to know about harvest festival in Kerala

ప్రజలందరూ మహా బలిని అంతలా గుర్తించి గౌరవించడానికి గల కారణం, అతడు ఎంతో ధర్మబద్ధమైన పాలనను అందించేవాడు. కానీ అతడికి కూడా ఒక దుర్గుణం ఉంది. మహారాజు మహా బలి అహంభావి. ఇది ఆ రాజుకు ఉన్న అతిపెద్ద బలహీనత. ఈ దుర్గుణాన్ని ఆసరాగా తీసుకొని దేవతలు అతని పాలనను అంతమొందించారు.

ఈ మహారాజు ఎంతో కాలం నుండి ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తుండటంతో దేవతలకు సవాళ్లు ఎదురవ్వడం ప్రారంభం అయ్యింది. అయినప్పటికీ మహాబలి చేసిన మంచి పనులకు, ధర్మబద్ధమైన పాలనకు ఆయనను అందరూ గుర్తించేవారు. అందుకు గాను అ రాజుకు ఒక వరం ప్రసాదించడమైనది.

ఆ వరం ఏమిటంటే, ప్రతి సంవత్సరం మహారాజు మహాబలి తన అధీనంలో ఉన్న ప్రాంతాలకు వెళ్ళవచ్చు. అందుకే మహారాజు మహాబలి వచ్చి వెళ్లే సమయాన్ని కేరళ లో ప్రతి సంవత్సరం ఓనమ్ పండుగగా జరుపుకుంటారు. ఈ పండగను ఎంతో వైభవంగా జరుపుకోవాలని కేరళ ప్రజలు ఎంతగానో కృషి చేస్తారు. అంతేకాకుండా ఆ సమయంలో వచ్చిన రాజుని, ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.

వారసత్వంగా వచ్చిన గొప్ప సంప్రదాయాలు కలిగిన రాష్ట్రంగా కేరళ రాష్ట్రానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఓనమ్ పర్వదినాల్లో ప్రజలు తమ వారసత్వ సంప్రదాయాలను సాధ్యమైనంత ఉత్తమ మార్గాలలో చిత్రీకరరించడానికి కృషి చేస్తారు. ఈ పండగలో ఇప్పటికే పాలుపంచుకున్న ప్రజలు తమ జీవితంలో ఆ పండుగ సమయాన్ని ఒక మధురానుభూతిగా భావిస్తారు.

ఆ రాష్ట్ర ప్రజలందరూ ఓనమ్ పండగ కోసం భారీ ఏర్పాట్లు చేసి వైభవంగా, గొప్ప విజయం సాధించేలా నిర్వహిస్తారు. ఈ పండుగ సంబరాలు మొత్తం పది రోజులు పాటు కొనసాగుతాయి. దేశవిదేశాల నుండి ఎంతో మంది, ఈ గొప్ప పంటకోత పండుగ అయిన ఓనమ్ లో పాలుపంచుకోవడానికి ఆశక్తి చూపిస్తారు.

English summary

Onam - The Harvest Festival Of Kerala

Read to know all about the harvest festival in Kerala, Onam.
Story first published: Monday, August 28, 2017, 10:30 [IST]