For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Papmochani Ekadashi 2021: పాపమోచని ఏకాదశి ప్రత్యేకతలేంటో తెలుసా...

పాప మోచని తేదీ, శుభ ముహుర్తం, ప్రాముఖ్యత, వ్రత పూజా విధానం గురించి తెలుసుకుందాం.

|

హిందూ పంచాంగ ప్రకారం, ప్రతి నెలలో వచ్చే ఏకాదశికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ప్రతి మాసంలో శుక్ల పక్షం మరియు క్రిష్ణ పక్షంలో ఏకాదశి వస్తుంది. ఇలా సంవత్సరం మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. ఇక తెలుగు నూతన సంవత్సరానికి ముందు ఫాల్గుణ మాసంలో వచ్చే ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంది.

Papmochani Ekadashi 2021 Date, Shubh Muhurat, Significance, Puja Vidhi in Telugu

దీన్ని 'పాపమోచని ఏకాదశి' అంటారు. ఈ పవిత్రమైన రోజున పాపాల నుండి విముక్తి లభిస్తుందని చాలా మంది నమ్మకం. ఈ సందర్భంగా పాప విమోచని ఏకాదశి ఏ రోజు వచ్చింది.. శుభ ముహుర్తం ఎప్పుడు.. ఉపవాసం ఏరోజున ఉండాలి.. పాప మోచని ఆరాధన పద్ధతి, ప్రాముఖ్యత గురించి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం...

April 2021: ఏప్రిల్ లో ఉగాదితో పాటు ఏయే పండుగలు వచ్చాయో తెలుసా...April 2021: ఏప్రిల్ లో ఉగాదితో పాటు ఏయే పండుగలు వచ్చాయో తెలుసా...

శుభ ముహుర్తం..

శుభ ముహుర్తం..

2021 సంవత్సరంలో పాపమోచని ఏకాదశి ఏప్రిల్ 7వ తేదీన అర్థరాత్రి 2 గంటల తొమ్మిది నిమిషాలకు ప్రారంభమవుతుంది. తిరిగి మరుసటి రోజు అంటే.. ఏప్రిల్ 8వ తేదీ సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది. ఏకాదశి శుభ ముహుర్త సమయం ఏప్రిల్ 8వ తేదీ ఉదయం 8:40 గంటలకు. ఈ సమయంలో శ్రీమహా విష్ణువును ఆరాధించాలి.

పూజా విధానం..

పూజా విధానం..

పాప మోచని ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్ర లేచి స్నానం చేయాలి. ఈ పవిత్రమైన రోజున శ్రీ మహా విష్ణువు ఆలయానికి వెళ్లి ఆరాధించాలి. స్వామి వారికి ఈరోజు పసుపు రంగు దుస్తులను అర్పించాలి. దీని తర్వాత, 11 పసుపు పువ్వులు, 11 రకాల స్వీట్లను దేవునికి అర్పించాలి. శ్రీ మహా విష్ణువుకు పసుపు గంధపు చెక్కకు పసుపు రంగు పూసి పూజించాలి. అనంతరం మీరు పీఠంపై కూర్చొని విష్ణువు యొక్క మంత్రాలను జపించాలి. అదే విధంగా ఈరోజంతా ఉపవాసం ఉండాలి.

పాప మోచని ఏకాదశి ప్రాముఖ్యత..

పాప మోచని ఏకాదశి ప్రాముఖ్యత..

ఈ ఏకాదశి చాలా ప్రభావవంతమైనది పండితులు చెబుతుంటారు. ఈ రోజున ఉపవాసం ఉంటూ.. శ్రీ మహా విష్ణువు ఆరాధిస్తే మీ పాపాలన్నీ తొలగిపోతాయని శ్రీక్రిష్ణుడు అర్జునుడికి చెప్పాడని నమ్ముతారు. ఈరోజున నిజమైన మనసుతో ఉపవాసం మరియు విష్ణువును పూర్తి ఆచారాలతో ఆరాధించడం ద్వారా, ఒక మోక్షాన్ని పొందుతారు.

ఏకాదశి వ్రత కథ..

ఏకాదశి వ్రత కథ..

పురాణాల ప్రకారం, ఒకప్పుడు నారదుని తండ్రి అయిన బ్రహ్మతో చైత్ర మాసానికి చెందిన క్రిష్ణ పక్షానికి చెందిన ఏకాదశి గురించి వివరించమని కోరారట. అప్పుడు బ్రహ్మదేవుడు ఈ విధంగా వివరించారట. ‘ఓ నారద! చైత్ర మాసానికి చెందిన క్రిష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని పాప విమోచని ఏకాదశిగా జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున విష్ణుమూర్తిని పూజిస్తారు.

అందమైన అడవిలో..

అందమైన అడవిలో..

పూర్వం, చిత్రారాత అనే అందమైన అడవి ఉండేది. అందులో ఇంద్రుడు, అందమైన అమ్మాయిలు మరియు దేవతలు నివసించేవారు. ఒకరోజు ఒక రుషి అక్కడ తపస్సు చేస్తున్నాడు. అతను పరమేశ్వరుడిని ఆరాధించేవాడు. అప్పుడు మంజుగోషా అనే అప్సరస లాంటి ఓ యువతి రుషి వద్దకు వెళ్లి తనను బాగా ఆకర్షించింది. ఇలా తన మాయలో పడి సంవత్సరాల కాలం గడిచిపోయింది. అయితే ఓ రోజు తాను శివుని తలచుకుంటూ చేసిన తపస్సుకు తన వల్లే భంగం కలిగిందని.. కోపంతో ఆమెను పిశాచి అని శపిస్తాడు.

పాప విమోచని ఏకాదశి రోజున..

పాప విమోచని ఏకాదశి రోజున..

అయితే శాపగ్రస్తులైన ఆమె రుషి పాదాల మీద పడి, తనకు శాపం నుండి విముక్తి కల్పించాలని వేడుకొంది. దీంతో తన అభ్యర్థనను మన్నించి.. ఫాల్గుణ, ఛైత్ర మాసంలో క్రిష్ణ పక్షంలో వచ్చే ఏకాదశి రోజున కఠినమైన నియమ నిష్టలతో, ఉపవాసం ఉండి దేవుడిని ఆరాధించాలని ఆదేశించాడు. ఆ తర్వాత నీకు ఈ శాపం నుండి విముక్తి లభిస్తుంది.. అని చెబుతాడు. అప్పుడు ఆ రుషి చెప్పినట్టు తను చేయడం వల్ల తనకు పాపం నుండి విముక్తి లభిస్తుంది. తిరిగి తాను మళ్లీ అందమైన రూపాన్ని పొందింది. అంతేకాదు స్వర్గానికి కూడా బయలుదేరింది.

కష్టాలు తొలగిపోతాయి..

కష్టాలు తొలగిపోతాయి..

అప్పటి నుండి ఎవరైతే పాప మోచన ఏకాదశి రోజున ఉపవాసం ఉండి ఆ భగవంతుడిని ఆరాధిస్తారో.. వారంతా పాపాల నుండి విముక్తి పొందడం ఖాయం' అని బ్రహ్మదేవుడు, నారదునికి వివరించాడు. అంతేకాదు ఈ పవిత్రమైన రోజున ఎవరైతే ఈ వ్రత కథను వింటారో.. వారికి కష్టాల నుండి పూర్తి స్వేచ్ఛ లభిస్తుంది.

English summary

Papmochani Ekadashi 2021 Date, Shubh Muhurat, Significance, Puja Vidhi in Telugu

Know About the 2021 Papmochani Ekadashi Date, Time, Shubh Muhurat, Importance and Vrat Puja Vidhi in Telugu
Story first published:Tuesday, April 6, 2021, 2:27 [IST]
Desktop Bottom Promotion