For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పార్సీ నూతన సంవత్సర వేడుకలు, విశేషాలు, చరిత్ర గురించి తెలుసుకుందామా..

జానపథ కథల ప్రకారం పర్షియా రాజు జంషెడ్ పార్సీ క్యాలెండర్ ను ప్రారంభించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. అందుకే ఈ పురాణ రాజు తర్వాత రోజును 'జంషేడ్ నవ్రోజ్' అని పిలుస్తారు. నవ్రోజు అంటే 'కొత్త రోజు'.

|

పార్సీ నూతన సంవత్సరాన్ని ఇలా కూడా పిలుస్తారు. దాని పేరే 'జంషేడ్ నవ్రోజ్'. పార్సీ సమాజానికి ఎంతో ముఖ్యమైన రోజు. ప్రతి సంవత్సరం ప్రపంచ నలుమూలల ఉండే పార్సీలు ఆగస్టు 17న పార్సీ నూతన సంవత్సర వేడుకలను జరుపుకుంటారు. వారందరూ జొరాస్ట్రియన్ క్యాలెండర్ ను అనుసరించి దాని ప్రకారమే నడుచుకుంటారు. కానీ భారతదేశంలోని పార్సీలు షాహన్ షాహి క్యాలెండర్ ను అనుసరిస్తారు. వారు దాని ప్రకారమే నడుచుకుంటారు. పార్సీ సంఘంలోని సంవత్సరంలోని అతి పెద్ద వేడుకలలో ఒకటైన పార్సీ నూతన సంవత్సరం చరిత్ర, ప్రాముఖ్యత, విశేషాలను ఈరోజు స్టోరీలో తెలుసుకుందాం.

Parsi New Year 2019

పార్సీ నూతన సంవత్సర చరిత్ర :
ప్రముఖ ప్రవక్త జరాతుస్త్రా జొరాస్ట్రియనిజం అనే మతాన్ని స్థాపించారు. ఇది పురాతన ఏకధర్మ మతాలల ఒకటిగా నిలిచింది. మన దేశంలో ఇస్లాం మతం ఉద్భవించే వరకు ఈ పార్సియా (ప్రస్తుతం ఇరాన్) యొక్క అధికారిక మతంగా పరిగణించబడింది. ఇస్లామిక్ దాడి తర్వాత, జొరాస్ట్రియన్లు ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వచ్చింది. వారిలో చాలా మంది భారతదేశం నుండి పాకిస్థాన్ దేశానికి తరలివెళ్లారు. మిగిలిన కొంతమందికి మాత్రం మన దేశంలోని గుజరాత్ వంటి ప్రాంతాలలో కొన్ని నివాస ప్రాంతాలు దొరికాయి. దీంతో వారు అక్కడే ఇళ్లను నిర్మించుకుని జీవించడం మొదలు పెట్టారు. పెర్షియన్ సంవత్సరంలో మొదటి రోజు స్ప్రింగ్ ఈక్వినాక్స్, మార్చి 21వ తేదీన వచ్చినప్పటికీ, భారతదేశంలోని పార్సీలు షాహన్ షాహీ క్యాలెండర్ అనుసరించడంతో అది లీపు సంవత్సరానికి కారణమవుతోంది. అందువల్ల ఇది మార్చి 21వ తేదీ అసలు రోజు నుండి ఆగస్టు 17వ తేదీ మారింది.

జానపథ కథల ప్రకారం పర్షియా రాజు జంషెడ్ పార్సీ క్యాలెండర్ ను ప్రారంభించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. అందుకే ఈ పురాణ రాజు తర్వాత రోజును 'జంషేడ్ నవ్రోజ్' అని పిలుస్తారు. నవ్రోజు అంటే 'కొత్త రోజు'. ఇది దాదాపు 3000 సంవత్సరాల క్రితం ప్రారంభమైన కొత్త సంప్రదాయాన్ని సూచిస్తుంది. ఇది బైగోన్లను విడిచిపెట్టి, జీవితాన్ని కొత్తగా ప్రారంభించడానికి ప్రజలను ప్రేరేపిస్తుంది.

Parsi New Year 2019

పార్సీలు నూతన సంవత్సర వేడుకలను ఇలా జరుపుకుంటారు..
పార్సీ నూతన సంవత్సరం సందర్భంగా పార్సీలందరూ తమ ఇళ్లను శుభ్రం చేసుకుంటారు. వారి నివాసాలను రంగోలి, తోరణాల (తాజా పూల దండలు)తో అందంగా అలంకరిస్తారు. నూతన వస్త్రాలు ధరిస్తారు. వారి శ్రేయస్సు కోసం ప్రార్థించడానికి అజియరీ (అగ్ని దేవాలయాలు) సందర్శిస్తారు. అంతేకాదు రుచికరమైన డెజర్ట్లతో సహా మౌత్ వాటర్ వంటకాలను సిద్ధం చేసుకుంటారు. వారి కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి సకుటుంబ సపరివార సమేతంగా వేడుకలను జరుపుకుంటారు. అంతకంటే ముందు పార్సీలు వారి ఇంటికి వచ్చే అతిథులను స్వాగతించే ముందు రోజు వాటర్ ను చిలకరించే సంప్రదాయాన్ని పాటిస్తారు. అంతేకాదు వారు ఇదొక పవిత్రమైన రోజుగా పరిగణిస్తారు కాబట్టి పలు స్వచ్ఛంద సంస్థలకు కూడా విరాళాలు ఇస్తారు.

English summary

Parsi New Year 2019 - Significance, History And Celebrations

All Parsis clean their homes during Parsi New Year. Their dwellings are beautifully decorated with Rangoli and Varanas (fresh flower garlands). Wear new clothes. Visit the aziyari (fire temples) to pray for their well-being. Mouth water recipes are prepared including delicious desserts. Sakutumba along with their family and relatives celebrate the celebrations together.The Parsis follow the tradition of sprinkling water on the day before welcoming guests to their home.
Story first published:Saturday, August 17, 2019, 11:02 [IST]
Desktop Bottom Promotion