For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Pausha Putrada Ekadashi 2021: పుత్రదా ఏకాదశి ఎప్పుడు? ఈరోజున అలాంటి పనులు అస్సలు చేయకూడదు..

పుత్రదా ఏకాదశి ఎప్పుడు? ఈరోజున ఎలాంటి పనులు చేయకూడదనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

|

హిందూ క్యాలెండర్ ప్రకారం పుష్యమాసంలో శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ పవిత్రమైన చాలా మంది హిందువులు ఉపవాసం ఉంటారు.

Pausha Putrada Ekadashi 2021 : Dont do these mistakes on putrada ekadashi

ఈ పుష్య పుత్రదా ఏకాదశి ఈ నెల 24వ తేదీన వచ్చింది. దీనిని పవిత్ర ఏకాదశి అని కూడా అంటారు. ఇది జనవరి 23వ తేదీ రాత్రి 8:08 గంటలకు ప్రారంభమవుతుంది.

Pausha Putrada Ekadashi 2021 : Dont do these mistakes on putrada ekadashi

తిరిగి మరుసటి రోజు అంటే జనవరి 24వ తేదీన పది గంటల 58 నిమిషాల వరకు ఉంటుంది. ఈ సందర్భంగా ఈ పవిత్రమైన రోజున విష్ణు మూర్తిని ఎలా ఆరాధించాలి.. పుత్రదా ఏకాదశి రోజున ఎలాంటి పనులు అస్సలు చేయకూడదు.. ఈ పవిత్రమైన రోజున పాటించాల్సిన పద్ధతులు ఏంటి అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

పుత్రదా ఏకాదశి రోజున..

పుత్రదా ఏకాదశి రోజున..

ఈ పవిత్రమైన రోజున ఉదయాన్నే లేచి స్నానం చేయాలి. ఆ తర్వాత విష్ణుమూర్తిని పూజించాలి. ఈ సమయంలో లక్ఝ్మీ విగ్రహాన్ని పూజ గదిలో లేదా ఆలయంలో ఉండేలా చూసుకోండి. ఒక ప్రమిదను తీసుకుని అందులో స్వచ్ఛమైన నెయ్యి వేసి ఒక దీపం వెలిగించాలి. పూజ తర్వాత గంగా(నీటిని) జలం తీసుకుని మీ ఆత్మను శుద్ధి చేయండి. ఇక ఆ రోజంతా ఉపవాసం ఉండాలి. రాత్రంతా మేల్కొని విష్ణువును కీర్తించండి.

‘ఓం గోవింద, మాధవయ నారాయాణయ నమః' అనే మంత్రాన్ని జపించాలి. ఈ మంత్రాన్ని 108 సార్లు జపించాలి. పూజ ముగిసిన తర్వాత అందరికీ ప్రసాదం పంచిపెట్టాలి.

బియ్యం వినియోగించకూడదు..

బియ్యం వినియోగించకూడదు..

పుష్య ఏకాదశి రోజున బియ్యం వినియోగించకూడదంట. దీని వెనుక ఒక పెద్ద కారణం ఉందట. ఈ పవిత్రమైన రోజున బియ్యం తినడం ద్వారా, మనకు కొంత గందరగోళంగా ఉంటుంది.

కోపాన్ని నివారించాలి..

కోపాన్ని నివారించాలి..

ఈ పవిత్రమైన రోజున విష్ణువును ఆరాధించడం ఎంత ముఖ్యమో.. అదే విధంగా ఈరోజున కోపం రాకుండా ఉండాలి. ముఖ్యంగా ఎవరితోనూ వాదనకు దిగకూడదు. అలాగే ముఖ్యమైన చర్చలకు దూరంగా ఉండాలి.

బ్రహ్మచార్యం పాటించాలి..

బ్రహ్మచార్యం పాటించాలి..

ఈ పవిత్రమైన రోజున ఎవరితోనూ శారీరక సంబంధాలను పెట్టుకోకూడదు. ఈరోజంతా బ్రహ్మచార్యాన్ని అనుసరించాలి. ఏకాదశిన మనస్ఫూర్తిగా విష్ణుదేవుడిని ఆరాధించడం వల్ల ప్రత్యేక ఫలితాలు వస్తాయి.

వీటిని తీసుకోవద్దు..

వీటిని తీసుకోవద్దు..

ఈ పవిత్రమైన రోజున మాంసాహారం, మద్యపానం, పొగతాగడం వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. సాధారణ ఆహారాన్నే తినాలి, పెరుగన్నం లేదా ఏదైనా శాఖాహారాన్ని మాత్రమే తీసుకోవాలి.

అమ్మాయిలను అవమానించొద్దు..

అమ్మాయిలను అవమానించొద్దు..

పుష్య పుత్రదా ఏకాదశి రోజున ప్రతి ఒక్క అమ్మాయిని మనం గౌరవించాలి. ఈరోజున ఎలాంటి సందర్భాల్లోనైనా మహిళలను అవమానించడం మరియు అగౌరపరచడం వంటివి అస్సలు చేయకూడదు. ఇలా చేస్తే మీరు ఎన్ని పూజలు చేసినా, ఉపవాసాలు ఉన్నప్పటికీ ఎలాంటి ఫలితం ఉండదు. అంతేకాదు మీరు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

English summary

Pausha Putrada Ekadashi 2021 : Don't do these mistakes on putrada ekadashi

Don't Do These Mistakes On Putrada Ekadashi. Take a look
Story first published:Saturday, January 23, 2021, 12:12 [IST]
Desktop Bottom Promotion