For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Phalguna Masam 2022 :ఫాల్గుణంలో లక్ష్మీదేవి ఆశీస్సులు కావాలంటే ఇలా చేయండి...

ఫాల్గుణ మాసం 2022లో ముఖ్యమైన తేదీలు, పండుగలు మరియు వ్రతాలు వాటి ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం...

|

తెలుగు క్యాలెండర్ ప్రకారం, ఫాల్గుణ మాసం అంటే చివరి నెల. 12 నెలల్లో చివరిదైన ఈ మాసాన్ని ఆనందం, సంతోషానికి మార్గంగా భావిస్తారు. ఈ మాసం ప్రతి సంవత్సరం శీతాకాలం చివర్లో వచ్చి.. వేసవి కాలానికి స్వాగతం పలుకుతుంది.

Phalguna Masam 2022 Dates, Festivals and Vrats, Importance and Significance in Telugu

ఈ మాసంలోనే మహా శివరాత్రి, హోలీ వంటి ముఖ్యమైన పండుగలు వస్తాయి. ఈ నేపథ్యంలో మార్చి 1వ తేదీన మహా శివరాత్రి వేడుకలను ఘనంగా జరుపుకున్నాం. అయితే ఫాల్గుణ మాసం అంటే మాత్రం త్రిమూర్తులలో ఒకరైన శ్రీ మహా విష్ణువుకు అత్యంత ప్రీతికరమైనదని పండితులు చెబుతున్నారు.

Phalguna Masam 2022 Dates, Festivals and Vrats, Importance and Significance in Telugu

ఫాల్గుణ మాసంలో చాలా మంది ప్రజలు ముఖ్యంగా తొలి పన్నెండు రోజులు అంటే శుక్ల పక్ష పాడ్యమి నుండి ద్వాదశి వరకూ శ్రీ మహా విష్ణును అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధించాలి. ఈరోజులలో ప్రతిరోజూ తెల్లవారు జామునే నిద్ర లేవాలి. అనంతరం తలస్నానం చేయాలి.

Phalguna Masam 2022 Dates, Festivals and Vrats, Importance and Significance in Telugu

ఆ తర్వాత సూర్య భగవానుడికి ఆర్ఘ్యం సమర్పించాలి. తర్వాత శ్రీ మహా విష్ణువును అష్టోత్తరాలతో పూజించి పాలను నైవేద్యంగా సమర్పించాలి. ఈ సందర్భంగా ఫాల్గుణ మాసంలో చేయాల్సిన ముఖ్యమైన పనులు.. ప్రత్యేక పూజలు ఏంటనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Phalguna Amavasya 2022:ఫాల్గుణ అమావాస్య రోజున పొరపాటున కూడా ఈ పనులు చేయకండి...Phalguna Amavasya 2022:ఫాల్గుణ అమావాస్య రోజున పొరపాటున కూడా ఈ పనులు చేయకండి...

ఫాల్గుణ మాసంలో..

ఫాల్గుణ మాసంలో..

హిందూ మత విశ్వాసాల ప్రకారం, ప్రతి సంవత్సరం కొన్ని నెలల్లో ప్రత్యేక పూజలు చేస్తుంటారు. అలాగే ఫాల్గుణ మాసంలో కూడా కొన్ని ప్రత్యేక పూజలు నిర్వహించాలి. ఫాల్గుణ మాసంలోని తొలి 12 రోజుల్లో ఏదైనా ఒక రోజు లేదా ద్వాదశి రోజు వస్త్రాలు వివిధ రకాలైన ధాన్యాలను గురువులకు లేదా గోమాతకు దానమిస్తే చాలా మంచిదని పండితులు చెబుతున్నారు.

శివునికి ప్రత్యేక పూజలు..

శివునికి ప్రత్యేక పూజలు..

ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఇబ్బందులు పడుతుంటారో వారు ఫాల్గుణ మాసంలో పరమేశ్వరునికి ప్రత్యేక పూజలు చేయాలి. అదే విధంగా ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న వారు లక్ష్మీదేవిని భక్తి శద్ర్ధలతో ఆరాధిస్తే డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి.

విష్ణువు ఆరాధన..

విష్ణువు ఆరాధన..

మీ శక్తి, సామర్థ్యానికి తగ్గట్టు మీరు ఏదైనా విష్ణువు ఆలయానికి ఏదైనా గోమాతను దానమిస్తే మీకు విశేష ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. పౌర్ణమి నాడు ఈశ్వరుడిని, శ్రీక్రిష్ణుడిని, లక్ష్మీదేవిని పూజించి ‘లింగ పురాణా'న్ని దానంగా ఇవ్వాలి. ఫాల్గుణ మాసంలో వచ్చే అమల ఏకాదశి రోజున ఉపవాసం ఉండి విష్ణును ఆరాధిస్తే, కచ్చితంగా ఆయన అనుగ్రహం లభిస్తుందట.

Maha Shivratri 2022:శివ లింగానికి రుద్రాభిషేకం చేసే సమయంలో పాటించాల్సిన నియమాలివే...Maha Shivratri 2022:శివ లింగానికి రుద్రాభిషేకం చేసే సమయంలో పాటించాల్సిన నియమాలివే...

ఫాల్గుణ పూర్ణిమ రోజున..

ఫాల్గుణ పూర్ణిమ రోజున..

ఫాల్గుణ పూర్ణిమ రోజున శ్రీ క్రిష్ణుడి విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని ఉయ్యాలలో వేసి ఊపవలెను. దీనినే డోలోత్సవం అంటారు. మరి కొన్ని ప్రాంతాలలో డోలా పూర్ణిమ అంటారు. ఇలా ఉయాలలో ఊపితే భక్తులందరికీ వైకుంఠప్రాప్తి కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.

రంగు నీళ్లను చల్లుకోవాలి..

రంగు నీళ్లను చల్లుకోవాలి..

ఫాల్గుణ మాసంలో ఓ రోజున రంగునీళ్లను చల్లుకోవాలని శాస్త్రాలలో చెప్పబడింది. మామిడి పువ్వులను కచ్చితంగా ఆరగించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే రంగు పొడులను కూడా చల్లుకుంటారు. ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజున హోలీ పండుగను నిర్వహించడం అనేది ఆనవాయితీగా వస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఆ రోజు కూడా ఎంతో శక్తివంతమైనది. ఏ సంవత్సరమైనా పూర్ణిమ, ఉత్తర ఫాల్గుణి, కలిసి వస్తే ఆరోజున మహాలక్ష్మీని ఆరాధించి స్తోత్రాలను పారాయణం చేయడం మంచిది.

మామిడి చెట్టు కింద..

మామిడి చెట్టు కింద..

పురాణాల ప్రకారం.. మామిడి చెట్టు కింద పార్వతీ దేవి శివుడి యొక్క అనుగ్రహం పొందుతుందట. అప్పటి నుంచి కాంచీపురంలో ఫాల్గుణ పూర్ణిమ ఉత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవాన్ని చూసేందుకు దేశం నలుమూలల నుండి భక్తులు తరలివస్తుంటారు. ఫాల్గుణ మాసంలో ఈ విధమైన పూజలు చేసిన వారందరికీ అనంతమైన ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు.

FAQ's
  • ఫాల్గుణ మాసం ఎప్పుడొస్తుంది? ఈ మాసం యొక్క ప్రత్యేకతలేంటి?

    తెలుగు క్యాలెండర్ ప్రకారం, ఫాల్గుణ మాసం అంటే చివరి నెల. 12 నెలల్లో చివరిదైన ఈ మాసాన్ని ఆనందం, సంతోషానికి మార్గంగా భావిస్తారు. ఈ మాసం ప్రతి సంవత్సరం శీతాకాలం చివర్లో వచ్చి.. వేసవి కాలానికి స్వాగతం పలుకుతుంది. ఈ మాసంలోనే మహా శివరాత్రి, హోలీ వంటి ముఖ్యమైన పండుగలు వస్తాయి. ఈ నేపథ్యంలో మార్చి 1వ తేదీన మహా శివరాత్రి వేడుకలను ఘనంగా జరుపుకున్నాం. అయితే ఫాల్గుణ మాసం అంటే మాత్రం త్రిమూర్తులలో ఒకరైన శ్రీ మహా విష్ణువుకు అత్యంత ప్రీతికరమైనదని పండితులు చెబుతున్నారు. ఫాల్గుణ మాసంలో చాలా మంది ప్రజలు ముఖ్యంగా తొలి పన్నెండు రోజులు అంటే శుక్ల పక్ష పాడ్యమి నుండి ద్వాదశి వరకూ శ్రీ మహా విష్ణును అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధించాలి.

English summary

Phalguna Masam 2022 Dates, Festivals and Vrats, Importance and Significance in Telugu

Here we are talking about the Phalguna Masam 2022 dates, festivals and vrats, importance and signficance in Telugu. Read on
Story first published:Wednesday, March 2, 2022, 14:15 [IST]
Desktop Bottom Promotion