వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం సిరిసంపదలు, ఆర్ధిక పురోగతి కోసం లాల్ - కితాబ్ సూచనలు

Written By: ChaitanyaKumar ARK
Subscribe to Boldsky

లాల్ కితాబ్ అనునది సాముద్రిక శాస్త్ర ఆధారంగా రచింపబడ్డ జ్యోతిష్య శాస్త్రంగా గుర్తింపు పొందినది. ఇందులో జ్యోతిష్య శాస్త్రానికి సంబంధించిన అన్నీ రకాల సూచనలూ చేయబడి ఉంటాయి. దీనిలో జాతకం యొక్క సరికొత్త శైలిని ఆవిష్కరించడం జరిగినది. దీనిలో మీ జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం లో అనేక సూచనలు పొందుపరచబడ్డాయి. ఈ శాస్త్రం ప్రకారం సంపద పెరుగుదలకై చెప్పబడిన సూత్రాలు ఇచ్చట పొందుపరచబడినవి.

ముఖ్యంగా మానవుని మెదడు ఆర్ధికపరమైన సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. ఆర్ధిక స్థిరత్వం, పొదుపు, ఆర్ధిక అసమతౌల్యాలని అధిగమించడం వంటి ఆలోచనలతో కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. వీటన్నిటికీ పరిష్కారానికై లాల్ కితాబ్ సూచించబడుతుంది.

Lal Kitab remedies for wealth creation

మీ కలల సాకారానికై:

మీ ఆర్ధికపరమైన ప్రణాళికలకు మరియు కలల సాకారానికై లాల్ కితాబ్ లో అనేక విషయాలు పొందుపరచడం జరిగినది. వీటిలో మంచి తెలివితేటలు కలిగిన వ్యక్తిని సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా, లక్ష్మీ దేవి కృపా కటాక్షాలతో మీ జీవితాన్ని ఆర్ధిక స్థిరత్వం తో కళకళలాడేలా చేయవచ్చు. ఇక్కడ పొందుపరచిన వాటిలో కొన్నిటిని ఎంపిక చేస్కుని తర్వాత వచ్చే దీపావళి పండుగ నాటి నుండి చేయడం ద్వారా మీ కలలు నిజం చేసుకోవచ్చు.

మీ ఆదాయాన్ని పెంచుకోండిలా:

మీ ఆదాయాన్ని పెంచుకోండిలా:

ఒక పిట్చర్( జగ్ లాంటి వస్తువు) ను ప్రతి బుధవారం చొప్పున 6 బుధవారాలు నీటిలో జారవేయడం ద్వారా మీ వ్యాపారానికి ఆర్ధికాభివృద్ది జరుగుతుంది. ఈ చక్రం పూర్తవునంత వరకు ఆ జగ్ పగలకుండా చూసుకోవడం మీ భాద్యత. మీలో క్రమశిక్షణను, సమయపాలనను పెంచడం ఇందులోని గూడార్ధం.

బెల్లం తినడం మీ ఆర్ధిక పురోగతిని సూచిస్తుందా !

బెల్లం తినడం మీ ఆర్ధిక పురోగతిని సూచిస్తుందా !

ఏదైనా పని ప్రారంభించుటకు ముందు కానీ, వ్యాపారానికి వెళ్లబోవు సమయాన ప్రతిరోజూ ఒక చిన్న బెల్లం ముక్క తినడం ఎంతో మంచిదని లాల్ కితాబ్ సూచిస్తుంది. మనిషి ఉద్రేకాలకు లోనుకాకుండా మానసిక ప్రశాంతతతో వ్యాపారం ప్రారంభించాలని ఇందులోని గూడార్ధం . ఇది మీ ఆర్ధిక పురోగతి పెరుగుదలపై ప్రభావం చూపిస్తుంది.

పేదవాళ్ళకు పూరీ-భాజీ పంపిణీ

పేదవాళ్ళకు పూరీ-భాజీ పంపిణీ

శుక్ల పక్ష మొదటి శనివారం నుండి 11 శనివారాలు వరుసగా పేదలకు పూరీ - భాజీ పంపిణీ చేయడం ద్వారా మీ ఆర్ధిక పురోగతి రెట్టింపు అయ్యే అవకాశాలు ఉన్నాయి. పేదల ఆశీర్వాదాలు మరియు మీ దాన గుణం వలన మీకు వచ్చే పరపతి మూలంగా వ్యాపారాభివృద్ది జరుగుతుందని ఇందులోని గూడార్ధం.

ఆర్ధికపరమైన కష్టాలు:

ఆర్ధికపరమైన కష్టాలు:

మీరు రియల్ ఎస్టేట్ సమస్యలతో , ఇల్లు , సంపద , భూమి సమస్యలతో సతమతమవుతూ ఉంటే 40 రోజులు వరుసగా ఒక చతురస్రాకారపు రాగి ముక్కను పారుతున్న నీళ్ళలో వేయమని, తద్వారా ఉపశమనం లభిస్తుంది అని లాల్ కితాబ్ నందు చెప్పబడినది.

కష్టాలు కన్నీళ్లు సహజం అవి పారుతున్న నీళ్ళలోని రాగిముక్క వలె స్థిరంగా ఒకరి దగ్గర ఉండవు. చేతులు మారుతూ ఉంటాయి. చివరికి దక్కిందే భాగ్యం గా తమని తాము స్థిరపరచుకోవాలని , 40 రోజులు రాగి ముక్కని ప్రతిరోజూ నీళ్ళలో వదిలిన నీకు క్రమశిక్షణ అంకిత భావం ఉన్నట్లు, ఇది మరలా వ్యాపారంలో ప్రదర్శించినప్పుడు తిరిగి ఆర్ధిక పురోగతి సాద్యమవుతుంది అని గూడార్ధం.

ఒక రాగి పాత్రలు కూడా మీ ఆర్ధిక పురోగతికి కారణం :

ఒక రాగి పాత్రలు కూడా మీ ఆర్ధిక పురోగతికి కారణం :

మీరు నిద్రపోవు సమయంలో మీ తలపక్కన ఇనుప కుండను నీళ్ళతో నింపి ఉంచి, నిద్ర లేచిన వెంటనే ఆ నీటిని ఇంటిలో ఎవరూ ఉపయోగించకుండా పారవేయడం ద్వారా మీ ఆర్ధిక పురోగతి సాద్యమవుతుంది.

ఆవుల కోసం తాజా రొట్టెలు:

ఆవుల కోసం తాజా రొట్టెలు:

మీరు ఏదైనా ప్రభుత్వ మరియు వ్యాపార సంబంధ లావాదేవీలతో సతమతమవుతూ ఉంటే ప్రతిరోజూ ఆవులకు తాజా రొట్టెలను ఆహారంగా ఇవ్వడం సూచించడమైనది. తద్వారా ఆర్ధిక స్వావలంబనకు సాద్యమవుతుంది.

ఆవులను ఇంటిలో బిడ్డలవలె చూసుకోవడం ద్వారా ఇంటికి ఆర్ధికపరమైన లోటు ఎలాంటి సందర్భంలోనూ రాదని గూడార్ధం.

కొబ్బరికాయని పారే నీటిలో వదలడం ద్వారా:

కొబ్బరికాయని పారే నీటిలో వదలడం ద్వారా:

మీకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆర్ధికపురోగతి కనపడని పక్షం లో పారే నీరులో ప్రతిరోజూ 44 రోజులపాటు కొబ్బరికాయను వేయడం విధిగా చేయడం ద్వారా, మరియు లక్ష్మి దేవిని భక్తితో ఆరాధించడం మూలంగా ఆర్ధికపురోగతి సాద్యమవుతుందని చెప్పబడినది.

గుడికి వెళ్ళడం మంచిది:

గుడికి వెళ్ళడం మంచిది:

దీపావళి మొదలుకొని 44 రోజులు వరుసగా ప్రతి రోజూ పాదరక్షలు లేకుండా గుడిని సందర్శించడం , నేతి దీపారాధన మరియు భక్తులకు మిటాయిల పంపిణీ చేయడం మంచిదని లాల్ కితాబ్ సూచిస్తుంది. గంధపు చెక్కలను లేదా అగరబత్తీలను వెలిగించి లక్ష్మీదేవీ ప్రార్ధన చేయడం ద్వారా ఆర్ధిక పురోగతి చేకూరుతుందని చెప్పబడినది.

English summary

Lal Kitab remedies for wealth creation

The good news is that, there are many Lal Kitab remedies, which are so powerful that they can make your financial dreams come true. When done as prescribed by an expert and with the grace and blessings of Goddess Lakshmi, they promise to bring wealth and prosperity in a person’s life.Here is a list of techniques that one can adopt. Amongst them, perform a few during and around the festival of Diwali. You can make a note of them for the upcoming festival season.
Story first published: Tuesday, March 27, 2018, 19:00 [IST]