For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నవరాత్రులలో ప్రతిరోజున అమ్మవారికి ప్రత్యేక నైవేద్యాలు

నవరాత్రి పండగ దగ్గరపడుతుండటంతో నవదుర్గలకి ఇష్టమైన వివిధ ఆహార నైవేద్యాల గూర్చి మీకు తెలపాలనుకుంటున్నాం. మరింత తెలుసుకోడానికి పూర్తిగా చదవండి.

|

హిందువులు చేసుకునే అతిముఖ్య పండగలలో నవరాత్రి కూడా ఒకటి.అమ్మవారి భక్తులకు మరింత విశిష్టమైనది. ఈ పండగ తొమ్మిదిరోజులు సాగుతుంది. ప్రతిరోజు దుర్గా అమ్మవారి వివిధ రూపాలకు కేటాయించబడింది.

నవదుర్గలలో ప్రతిరూపానికి ఒక ప్రత్యేక వ్యక్తిత్వం, లక్షణాలున్నాయి. నవదుర్గలను ప్రసన్నం చేసుకోడానికి, భక్తులు ఒక్కొక్కరికి ఒక్కో ప్రత్యేక పదార్థం నైవేద్యంగా పెట్టాలి.వారు ప్రతిరూపంలో ఒక్కో ప్రత్యేక రంగు, ఆహరం, పువ్వులు ఇష్టపడతారు.

prasads for navratri

నవరాత్రి పండగ దగ్గరపడుతుండటంతో నవదుర్గలకి ఇష్టమైన వివిధ ఆహార నైవేద్యాల గూర్చి మీకు తెలపాలనుకుంటున్నాం. మరింత తెలుసుకోడానికి పూర్తిగా చదవండి.

శైలపుత్రి అమ్మవారి నైవేద్యం

శైలపుత్రి అమ్మవారి నైవేద్యం

నవరాత్రులలో మొదటిరోజు శైలపుత్రి అమ్మవారి రూపానిది. ప్రతి సంవత్సరం ప్రతిపాద శుక్లపక్షంలో దీన్ని జరుపుకుంటారు. అమ్మవారికి స్వచ్చమైన నెయ్యిని నైవేద్యంగా సమర్పిస్తారు. నేతిని అమ్మవారి పాదాలపై పోసి అభిషేకిస్తారు. ఇలా చేయటం వలన మీకున్న సకల రోగాలు,కష్టాలు తొలగిపోతాయి.

బ్రహ్మచారిణి అమ్మవారి నైవేద్యం

బ్రహ్మచారిణి అమ్మవారి నైవేద్యం

నవరాత్రి ఉత్సవాలలో రెండవరోజు అమ్మవారిని బ్రహ్మచారిణి రూపంలో కొలుస్తారు. అశ్విని నెలలో ద్వితీయ తిథినాడు ఇలా జరుపుకుంటారు. ఈ రూపం పార్వతి అమ్మవారి బ్రహ్మచారిణి రూపం. ఈ రూపంలో పార్వతి అమ్మవారు పరమశివుని తిరిగి భర్తగా పొందటానికి తపస్సు చేసారు. ఉపవాసం ఉండి ఈమెను పూజిస్తారు.

మీరు ప్రసాదంగా పంచదారను సమర్పించవచ్చు. ఇలా చేయటం వలన మీ కుటుంబంలో వారికి దీర్ఘాయువు కలుగుతుంది.

చంద్రఘంత అమ్మవారి నైవేద్యం

చంద్రఘంత అమ్మవారి నైవేద్యం

అమ్మవారిని చంద్రఘంత రూపంలో నవరాత్రులలో మూడవరోజున పూజిస్తారు. ఇది అశ్విన్ నెలలో శుక్లపక్షం తృతీయ తిథినాడు వస్తుంది. చంద్రుడు నెలవంకగా కన్పించి అమ్మవారి తలపై ఉన్నట్లు భావిస్తారు.

ఈ రూపాన్ని భక్తులు అన్ని లౌకిక బాధల నుంచి విముక్తికై పూజిస్తారు. పాలతో తయారుచేసిన తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తారు.బ్రాహ్మణులకి అన్నదానం చేసి దక్షిణ ఇస్తారు.ఇవన్నీ అమ్మవారిని మెప్పించి భక్తులకు సుఖసంతోషాలను వరంగా ఇస్తారు.

కూష్మాండ అమ్మవారి నైవేద్యం

కూష్మాండ అమ్మవారి నైవేద్యం

నవరాత్రుల నాలుగవ రోజున కూష్మాండ అమ్మవారిని పూజిస్తారు. ఒక నమ్మకం ప్రకారం కూష్మాండ అమ్మవారి కడుపులోంచే ఈ విశ్వం ఉద్భవించిందని అంటారు.

ఈరోజు భక్తులు ఉపవాసం ఉండి, అన్ని రోగాలు, బాధల నుంచి విముక్తి కావాలని ప్రార్థిస్తారు.

మల్పువా కూష్మాండ అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. ఈ మల్పువా స్వీటు భక్తులకి మేధస్సు, తెలివితేటలకి ఉపయోగపడుతుంది.

స్కందమాత అమ్మవారి నైవేద్యం

స్కందమాత అమ్మవారి నైవేద్యం

నవరాత్రులలో ఐదవరాత్రిన అమ్మవారు స్కందమాత రూపంలో కొలవబడతారు. స్కందమాత లేదా కార్తికేయుడి తల్లిగా ఆమె చాలా అందమైన రూపంలో ఉంటారు. ఈ రూపంలో ఆమె భక్తుల కోరికలన్నిటినీ తీరుస్తారు.

ఈమెకి అన్నిటికన్నా అరటిపళ్ళ నైవేద్యం ఎంతో ప్రీతికరం. ఈ నైవేద్యం మీకు అమ్మవారి ఆశీస్సులు, ఆరోగ్యకర జీవితం అందిస్తాయి.

కాత్యాయని అమ్మవారి నైవేద్యం

కాత్యాయని అమ్మవారి నైవేద్యం

అమ్మవారు కాత్యాయని రూపంలో ఆరవరోజున పూజించబడతారు. ఈ రూపంలో అమ్మవారు, కాత్యాయన్ అనే మహర్షికి ఆయన తపస్సు ఫలితంగా జన్మించింది.

కాత్యాయని అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి తేనెను ప్రసాదంగా పెట్టండి. ఇలా చేయటం వలన ఆమె భక్తులు మరింత అందంగా, ఆకర్షణీయంగా మారతారు.

కాళరాత్రి అమ్మవారి నైవేద్యం

కాళరాత్రి అమ్మవారి నైవేద్యం

కాళిక అమ్మవారి అన్నిరూపాలలోకెల్లా భయంకరమైనది. ఏడవరోజున ఆమెను పూజిస్తారు. అమ్మవారు అన్ని అవరోధాలను, దుష్టత్వాన్ని నిర్మూలిస్తుంది.

ఈమెను ప్రసన్నం చేసుకోవడానికి, బెల్లం నైవేద్యంగా పెట్టండి. బెల్లం పెట్టడం వలన మీకున్న ఏ బాధకైనా మీకు ఉపశమనం లభిస్తుంది.

మహాగౌరి అమ్మవారి నైవేద్యం

మహాగౌరి అమ్మవారి నైవేద్యం

నవరాత్రులలో ఎనిమిదవరోజున అమ్మవారిని మహాగౌరి రూపంలో పూజిస్తారు. అన్నిటిలో విజయం కోసం ఈమెని పూజిస్తారు.

మహాగౌరి అమ్మవారికి కొబ్బరికాయ నైవేద్యంగా పెడతారు. బ్రాహ్మణులకి కొబ్బరికాయను దానంగా ఇవ్వవచ్చు.ఇవన్నీ చేయటం వలన సంతానం లేని జంటలకి మంచి సంతానం కలుగుతుంది.

సిద్ధిధాత్రి అమ్మవారి నైవేద్యం

సిద్ధిధాత్రి అమ్మవారి నైవేద్యం

సిద్ధిధాత్రి అమ్మవారిని నవరాత్రుల ఆఖరిరోజున పూజిస్తారు. ఆమె భక్తుల కోరికలన్నిటినీ నెరవేరుస్తుంది.

ఈమెకి నువ్వులను ప్రధాన నైవేద్యంగా సమర్పిస్తారు. భక్తులు ఉపవాసం కూడా ఉంటారు. ఈ నైవేద్యం వలన భక్తుల మరణ భయం లేదా ఏదన్నా ప్రమాద భయం తొలగిపోతుంది.

English summary

prasads for navratri | prasads for mother goddess on navratri | నవరాత్రి ప్రసాదాలు । నవరాత్రులలో అమ్మవారికి నైవేద్యాలు

Here are some prasads to make for the Mother Goddess on each day of Navratri, check them out.
Story first published: Thursday, September 14, 2017, 18:05 [IST]
Desktop Bottom Promotion