For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రక్షా బంధన్ 2019: సోదరీ, సోదరుల అనుబంధాన్ని పెంచుతుందా?

|

ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం రోజున రక్షా బంధన్ పండగ రావడం విశేషం. ఒకేరోజు రెండు పండుగలు రావడం చాలా అరుదుగా జరుగుతుంది. రక్షా బంధన్ అనేది హిందూ మత పండుగలలో అత్యంత ప్రాచుర్యం పొందింది. మన భారతదేశంలో ఈ పండుగను శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఈ వేడుకను అన్నా చెల్లెలు లేదా అక్కా తమ్ముళ్ళ మధ్య బంధం, అనుబంధం, ప్రేమానురాగాలు కలకాలం ఉండాలని కోరుకునేందుకు జరుపుకుంటారు. ఈ రాఖీ పౌర్ణమి భారతదేశ పురాతన పండుగలలో ఒకటిగా పేర్కొనబడింది. అంతేకాదు ఈ పండుగ పురాణాలు, లెజెండ్స్ తో సంబంధం కలిగి ఉంది. మరో విశేషమేమిటంటే రక్త సంబందంతో నిమిత్తం లేకుండా యావత్ భారతదేశమంతా సోదర, సోదరీమణులు జరుపుకునే ఎంతో ప్రత్యేకమైన పండుగ.

రాఖీ పండుగ విశిష్టత :

రాఖీ పండుగ విశిష్టత :

శ్రావణ మాసం అంటే పండుగల మాసం అని అంటుంటారు. ఈ నెలలో ప్రతిరోజూ ఏదో ఒక ప్రత్యేకత కలిగి ఉంటుంది. అందులో ముఖ్యమైనది శ్రావణ పౌర్ణమి. శ్రావణ మాసం అంటే శ్రవణా నక్షత్రంలో పౌర్ణమి నాడు చంద్రుడు ఉన్నటువంటి నెల అని అర్థం.

శ్రవణం అంటే వినటం. ప్రాచీన కాలంలో చదువు అనేది ప్రారంభించబడలేదు. అందుకే అప్పట్లో శ్రవణం ప్రధానంగా ఉండేది. అంటే వేదాన్ని వినాలి. వేద అధ్యయనం మొదలుపెట్టేటువంటి రోజు అని పురాణాల్లో పేర్కొనబడింది. అందుకనే వేద అధ్యయనానికి అర్హత కలిగిన వారందరూ రాఖీ పౌర్ణమి రోజున ఉపాకర్మ అనే కార్యక్రమాన్ని చేస్తారు. ఉపా కర్మ అంటే మొదటిసారి ఒడుగు పూర్తి అయ్యి అంటే యజ్ఞోపవీతాన్ని మార్చుకుంటారు. అంటే మౌంజిత్ అనే చిన్న యజ్ఞోపవీతాన్ని తీసి పెద్ద యజ్ఞోపవీతాన్ని వేసుకుంటారు. అందుకే దీనికి జంధ్యాల పౌర్ణమి అనే పేరు కూడా వచ్చింది. కానీ కాలానుగుణంగా వచ్చిన మార్పులో ఈ పేరు మరుగున పడింది.

శ్రవణం అంటే వినటం.

శ్రవణం అంటే వినటం.

శ్రవణం అంటే వినటం. ప్రాచీన కాలంలో చదువు అనేది ప్రారంభించబడలేదు. అందుకే అప్పట్లో శ్రవణం ప్రధానంగా ఉండేది. అంటే వేదాన్ని వినాలి. వేద అధ్యయనం మొదలుపెట్టేటువంటి రోజు అని పురాణాల్లో పేర్కొనబడింది. అందుకనే వేద అధ్యయనానికి అర్హత కలిగిన వారందరూ రాఖీ పౌర్ణమి రోజున ఉపాకర్మ అనే కార్యక్రమాన్ని చేస్తారు. ఉపా కర్మ అంటే మొదటిసారి ఒడుగు పూర్తి అయ్యి అంటే యజ్ఞోపవీతాన్ని మార్చుకుంటారు. అంటే మౌంజిత్ అనే చిన్న యజ్ఞోపవీతాన్ని తీసి పెద్ద యజ్ఞోపవీతాన్ని వేసుకుంటారు. అందుకే దీనికి జంధ్యాల పౌర్ణమి అనే పేరు కూడా వచ్చింది. కానీ కాలానుగుణంగా వచ్చిన మార్పులో ఈ పేరు మరుగున పడింది.

పురాణాలలో విశేషాలిలా..

పురాణాలలో విశేషాలిలా..

పురాణాలలో రాఖీ పండుగ గురించి చాలా మంది చాలా రకాలుగా చెప్పారు. వాటిలో ఓ కథను తెలుసుకుందాం. అమరావతి (ఇంద్రుడు యొక్క నివాసం) మీద ఒక భూతం దాడి చేసి ఆక్రమించుకుంది. అప్పుడు ఇంద్రుడు భార్య శచీదేవి సహాయం కోసం విష్ణుదేవుని వద్దకు వెళ్లింది. అపుడు విష్ణువు ఇంద్రుడిని కాపాడేందుకు తన మణికట్టుపై పవిత్రమైన కాటన్ త్రెడ్ కట్టమని శచీదేవికి ఇస్తాడు. వెంటనే శచీదేవి కాటన్ త్రెడ్ కట్టేస్తుంది. దీంతో విష్ణువు ఆ భూతాన్ని ఓడిస్తాడు.

 శ్రీకృష్ణుని చేతికి ద్రౌపది రాఖీ

శ్రీకృష్ణుని చేతికి ద్రౌపది రాఖీ

ఆ విధంగా రాఖీ త్రెడ్ ఉనికిలోకి వచ్చింది అని చాలా మంది చెబుతుంటారు. మరో కథలో.. శ్రీకృష్ణుని చేతికి ద్రౌపది రాఖీ కట్టింది. అంతేకాదు పార్వతీ దేవి సైతం విష్ణువు మణికట్టు మీద రాఖీ కట్టి తనను సోదరీగా అంగీకరించినట్లు ఉందని వేదాలలో పేర్కొనబడింది. అందుకు బదులుగా ఒక సమయంలో పార్వతీదేవి ప్రమాదంలో ఉన్నప్పుడు విష్ణువు వచ్చి రక్షించాడు.

చరిత్రలో ఇలా చెప్పబడింది

చరిత్రలో ఇలా చెప్పబడింది

చారిత్రాత్మకంగా చూస్తే రాఖీ కథ ప్రకారం ది గ్రేట్ అలెగ్జాండర్ భారతదేశం మీద దండయాత్ర మొదలుపెట్టినప్పుడు పోరస్ రాజు అనే అతను నిలిపివేశాడు. అప్పటికే యుద్ధం జరిగింది. ఆ సమయంలో, అలెగ్జాండర్ భార్య రొక్షన, యుద్ధంలో తన భర్తను చంపొద్దని అభ్యర్థిస్తూ ఒక లేఖతో పాటు ఒక పవిత్ర త్రెడ్ (రాఖీ)ని పంపుతుంది. దీంతో ఆ యుద్ధం జరుగుతున్న సమయంలో పోరస్ అతని మణికట్టుపై ఉన్న రాఖీని గుర్తు పెట్టుకుని అలెగ్జాండర్ ను విడిచి పెడతాడు. ఇంకో ప్రస్తావనను పరిశీలించగా వితంతువుగా ఓ మహిళ చిత్తూరు రాణి కర్ణవతి. ఆమె హుమాయున్ అనే చక్రవర్తికి రాఖీ పంపుతుంది.

రాణి కర్ణవతి సహాయం..

రాణి కర్ణవతి సహాయం..

బహదూర్ షా సుల్తాన్ దాడి నుండి తన రాజ్యాన్ని రక్షిస్తారని ఆశిస్తూ, రాణి కర్ణవతి సహాయం కోరుతుంది. ఒక లేఖతో పాటు ఒక రాఖీని కూడా హుమాయున్ అనే చక్రవర్తికి పంపుతుంది. ఇందుకు స్పందించిన హుమాయున్ అనే చక్రవర్తి ఆమె రాజ్యానికి సహాయంగా తన దళాలను పంపుతాడు. కానీ ఆయన ఆదేశాలు అమలై దళాలు చిత్తూరు రాణి రాజ్యానికి చేరేందుకు చాలా ఆలస్యమైంది. అప్పటికే రాణి కర్ణవతి ఆమె పరువును కాపాడుకునేందుకు ఇతర మహిళలతో పాటు జౌహార్ కు పాల్పడ్డారు. అనంతరం హుమాయున్ చక్రవర్తి బహదూర్ షాను ఓడించి రాణి కర్ణవతి కుమారుడు విక్రమ్ జిత్ కు రాజ్యాన్ని అప్పగించి పునరుద్ధరణ చేయిస్తాడు.

మహారాష్ట్రలో నార్లీ పౌర్ణమి..

మహారాష్ట్రలో నార్లీ పౌర్ణమి..

మహారాష్ట్ర వంటి తీరప్రాంతాలకు వెళితే అక్కడ ఈ రాఖీ పౌర్ణమిని నార్లీ పౌర్ణమి అని అంటారు. నార్లీ అంటే నారికేళాలను సాగరంలో పడేస్తారు. అంటే సాగరానికి కొబ్బరికాయలు సమర్పిస్తే బాగా వర్షాలు కురిసి తామంతా సుఖ సంతోషాలతో, సుభిక్షంగా ఉంటామని వారు నమ్ముతారు. అందుకనే వారు అక్కడ అలా పిలుస్తారు.

దక్షిణ భారతానికి ఇదే సాంప్రదాయం..

దక్షిణ భారతానికి ఇదే సాంప్రదాయం..

ఉత్తర భారతదేశంలో చాలా ప్రాచుర్యంలో ఉండి ఇపుడు దక్షిణ భారతానికి ఇదే సాంప్రదాయం వచ్చి చేరింది. దీనినే రక్షా బంధన్ లేదా రాఖీ పౌర్ణమి అనే పేరు బాగా వ్యాప్తిలోకి వచ్చింది. రక్షా బంధన్ అంటే రాఖీ కట్టడం. ఒకప్పుడు ఎవరికి వారు రాఖీ కట్టుకునే వారు. అంటే నేను క్షేమంగా ఉండాలి అని తనకు సంబంధించినది దైవం దగ్గర ఒక తోరం పెట్టి ఆ తోరాన్ని తనకు రక్షగా ఉండేటట్టుగా ఒక సంవత్సరం పాటు ధరించేవారు.

ఉత్తర భారతంలో కజరి పౌర్ణమి..

ఉత్తర భారతంలో కజరి పౌర్ణమి..

భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో వివిధ ఆచారాలు, సాంప్రదాయాలను పాటించే సంగతి చాలా మందికి తెలిసిందే. అలాగే రాఖీ పౌర్ణమి రోజున అక్కడి ప్రజలు గోధుమ, బార్లీ వంటి పంటలను నాటుతారు. అందుకనే అక్కడ రాఖీ పౌర్ణమిని కజరి పౌర్ణమి అని అంటారు. అంతేకాదు ఆ రోజున భగవతి దేవిని ప్రత్యేకంగా పూజిస్తారు.

దక్షిణాన శ్రావణ పౌర్ణమి

దక్షిణాన శ్రావణ పౌర్ణమి

దక్షిణాదిన దీనిని శ్రావణ పౌర్ణమి అని అంటారు. ఈ పండుగలో ఒక ఆధ్యాత్మిక పాయింట్ ఉంది. స్వచ్ఛమైన ఆలోచనలతో ఒక మంచి జీవితాన్ని గడపటానికి ఆరోజున పవిత్ర ప్రతిజ్ఞ చేసేందుకు ఇది దోహదం చేస్తుంది. కుడి చేతికి వేసే రాఖీని ఒక యజ్ఞోపవీతం అని కూడా అంటారు. ఇది తాము ప్రపంచంలో దుర్గుణాలు, ఎటువంటి చెడు దుష్ప్రభావాలు తమపై పడకుండా ఆధ్యాత్మికంగా ఉండేందుకు మనల్ని రక్షించేందుకు ఉపయోగపడుతుందని నమ్ముతారు. రాఖీ అనే యజ్ఞోపవీతం సోదరీమణులు అభిమానం, ఆప్యాయతలతో సోదరుని యొక్క మణికట్టు మీద కడతారు. ఇది ఒక పరమ పవిత్రమైన ఆచారంగా భావిస్తారు. దీంతో వారు సోదరుల ఆధ్యాత్మిక యొక్క మార్గనిర్దేశం చేస్తుంటారని నమ్ముతారు.

English summary

Raksha Bandhan : Why Do We Celebrate Brother Sister Bonding?

This celebration is celebrated by Anna's younger sister or younger sister, who wants to be in a relationship, a romance. The Rakhi full moon is one of the oldest festivals in India. The festival is also associated with myths and legends. Another highlight is that it is a very special festival celebrated by brothers and sisters all over India irrespective of blood.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more