For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కరోనా వల్ల కోదండ రాముడి కోవెలకు వెళ్లకపోతే.. ఇంట్లోనే ఇలా పూజించండి....

|

శ్రీరామ నవమి పండుగ మన దేశంలోని హిందువులకు అత్యంత పవిత్రమైన పండుగ. చాలా మంది హిందువులు ఈ పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు.

కోదండ రాముడు త్రేతా యుగంలో వసంత కాలంలో ఛైత్ర శుద్ధి నవమి, గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో అంటే సరిగ్గా అభిజిత్ ముహుర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల సమయంలో జన్మించాడు.

అంతటి గొప్ప గుణవంతుడి పుట్టినరోజునే శ్రీరామ నవమి పండుగగా జరుపుకుంటారు. అంతే కాదు అదే రోజు 14 సంవత్సరాల పాటు వనవాసం, రావణుడిని మట్టుబెట్టిన అనంతరం అయోధ్యలో రాముడు పట్టాభిషిక్తుడైనాడు. అలాగే ఈ ఛైత్ర శుద్ధ నవమి రోజునే శ్రీసీతారాములోరి కళ్యాణం కూడా జరిగింది.

ఏప్రిల్ 2వ తేదీన శ్రీరామ నవమి పండుగ సందర్భంగా శ్రీరాముని యొక్క విశిష్టత, ప్రాముఖ్యత, ఆచారాల గురించి అనేక ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.

శ్రీరామ నవమి 2020 : రాముడిని మెప్పించే మంత్రాలను జపిస్తే కలిగే శుభాలెన్నో...!

పండుగ పరమార్థం..

పండుగ పరమార్థం..

ఈ శ్రీరామ నవమి పండుగ పరమార్థం ఏమిటంటే.. శ్రీ సీతారామ కళ్యాణం లోక జీవన హేతుకం, సకల దోష నివారణ, సర్వ సంపదలకు సకల నిలయం, సకల జన లోక సంరక్షణే అని పురాణాలు పేర్కొంటున్నాయి.

ఒంటిమిట్టలో..

శ్రీరామ నవమి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో ఒంటిమిట్ట కళ్యాణోత్సవ వేడుకలు ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుతారు. ఈ కళ్యాణ వేడుకలకు ప్రభుత్వం నుండి మంత్రులు లేదా అధికారులు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. శ్రీసీతారాములోరి కమనీయ కళ్యాణ వేడుకలను తిలకించేందుకు భక్తులు రాష్ట్ర నలుమూలల నుండి తరలివస్తుంటారు. అయితే ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో కేవలం అతి కొద్ది మందికే అనుమతి లభించడంతో అందరూ టివిలలో ప్రత్యక్ష ప్రసారాలను చూసి దర్శించుకోవాల్సిందే...

భద్రాద్రిలో..

భద్రాద్రిలో..

శ్రీరామ నవమి సందర్భంగా తెలంగాణలోని భద్రాచలంలోనూ శ్రీ సీతారాములోరి కళ్యాణ వేడుకలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ దేవాలయానికి కూడా అతికొద్ది మందికే అనుమతి లభించడంతో ఇక్కడి కళ్యాణ వేడుకలను కూడా టివిల్లో ప్రత్యక్ష ప్రసారంలో చూసి దర్శించుకోవాల్సిందే.

శ్రీరాముని నుంచి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన లక్షణాలివే...!

వనవాస జీవితం..

వనవాస జీవితం..

శ్రీరామచంద్రుని క్షేత్రాలలో అత్యంత వైశిష్ట్య ప్రాధాన్యత ప్రాశస్త్యముగల క్షేత్రం భద్రాచలం దివ్య క్షేత్రం. భద్రుడు అనగా రాముడు అని అచలుడు అంటే కొండ అని అందుకే రాముడు కొండపై నెలవై ఉన్న దివ్య ధామము కనుక ఈ క్షేత్రం భద్రాచలంగా ప్రసిద్ధిచెందిన పుణ్య క్షేత్రం. శ్రీరామచంద్రుడు తన వనవాస జీవితం ఇక్కడే గడపడమే ఈ పుణ్య క్షేత్రం యొక్క వైశిష్ట్యంగా పురాణాలు చెబుతున్నాయి.

సకల పాపాలు పోతాయని..

సకల పాపాలు పోతాయని..

శ్రీ రామ నామము సకల పాపాలను పోగొడుతుందని సకల శాస్త్రాలూ ఘోషిస్తున్నాయని పండితులు చెబుతున్నారు. భక్త రామదాసు చెరసాలలో ఉండిపోయిన కారణంగా పూర్వము సీతారాముల కళ్యాణము మార్గశిర శుద్ధ పంచమినాడు జరిగినట్లుగా, అయితే తాను చెరసాలనుండి తిరిగి వచ్చాక చైత్రశుద్ధ నవమినాడు శ్రీరామ చంద్రుని పుట్టినరోజు వేడుకలు, కళ్యాణ వేడుకలు ఒకేసారి జరిపించారు.

శ్రీరామ పట్టాభిషేకం..

శ్రీరామ పట్టాభిషేకం..

శ్రీ సీతారామ కళ్యాణం, రాముడు రావణున్ని సంహరించి అయోధ్యకు తిరిగి వచ్చింది శ్రీరామనవమి రోజే. ఆ మరునాడు దశమి శ్రీరామ పట్టాభిషేకం కూడా రామునికి జరిగింది. కోదండ రామ కళ్యాణాన్ని చూసేందుకు మనమే కాదు సకల లోకాల దేవతలు దివి నుంచి భువికి దిగివస్తారంటా....శ్రీరామచంద్రుని దివ్య దర్శనం మహనీయంగా, నేత్ర పర్వంగా పట్ట్భాషేక సమయాన తిలకించి పులకితులవుతారట.

హనుమ గుండెల్లో..

హనుమ గుండెల్లో..

ఆంజనేయుని పదభక్తికి మెచ్చి, హనుమ గుండెల్లో కొలువైన శ్రీరాముని భక్త పోషణ అనన్యమైనదై గ్రామగ్రామాన రామాలయం నెలకొని ఉన్నాయి. శ్రీరాముడు సత్యపాలకుడు ధర్మాచరణం తప్పనివాడు, ఏకపత్నీ వ్రతుడు, పితృ, మాతృ, భాతృ, సదాచారం, నిగ్రహం, సర్వ సద్గుణాలు మూర్త్భీవించిన దయార్ద హృదయుడు. శ్రీరామనవమి రోజున సీతారాముని, లక్ష్మణ, భరత, శతృఘ్న, ఆంజనేయ సమేతముగా ఆరాధించి, వడ పప్పు, పానకము నైవేద్యముగా సమర్పించుకుంటారు. ప్రతియేడు భద్రాచలంలో జరిగే శ్రీ సీతారామ కళ్యాణము చూసి తరించిన వారి జన్మ సార్థకం చెందుతందనేది భక్తుల విశ్వాసం.

ఇంట్లో ఇలా పూజిస్తారు..

ఇంట్లో ఇలా పూజిస్తారు..

శ్రీ సీతారామ లక్ష్మణ, ఆంజనేయుని పటము లేదా శ్రీ సీతారాములోరి ప్రతిమను గానీ పూజకు ఉపయోగిస్తారు. పూజలకు సన్నజాజి, తామర పువ్వులు, నైవేద్యానికి పానకం, వడపప్పు, కమలాకాయలు సిద్ధం చేసుకుంటారు. పూజకు ముందు శ్రీరామ అష్టోత్తరం, శ్రీరామ రక్షా స్తోత్రం, శ్రీరామాష్టకం, శ్రీరామ సహస్రం, శ్రీమద్రామాయణం వంటి స్తోత్రాలతో శ్రీరాముడిని స్తుతిస్తారు. వీటితో పాటు శ్రీరామ పట్టాభిషేకం అనే అధ్యాయాన్ని పారాయణం చేస్తే అందరికీ శుభ ఫలితాలు కలుగుతాయని అనేక మంది హిందువులు భావిస్తారు.

English summary

Ram Navami 2020: Here’s The Detail Rituals And Significance

Ram Navami the birth anniversary of Lord Rama is celebrated with great dedication and devotion among the Hindus. On this day various temples organise special puja. You can know about the date and timings of the festival by reading down
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more