For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Ram Navami 2021: శ్రీరాముని పట్టాభిషేకం ఎలా జరిగిందో తెలుసా...

|

హిందూ క్యాలెండర్ ప్రకారం, ఛైత్ర మాసాన్ని హిందువులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఛైత్ర శుద్ధ పాడ్యమి రోజు కొత్త ఏడాదిలో తొలి రోజుగా భావించి ఉగాది పండుగను జరుపుకుంటారు. ఛైత్ర శుద్ధ నవమిని మరింత ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున దేశవ్యాప్తంగా సీతారామాంజినేయ దేవాలయాల్లో శ్రీ సీతారాముల కళ్యాణం జరిపిస్తారు. ఇదిలా ఉండగా.. ఇదే రోజు శ్రీరామునికి పట్టాభిషేకం జరిగిందని మరికొందరు చెబుతుంటారు.. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

నవమి నాడే శ్రీ సీతారాములోరి కళ్యాణం జరిగిందా?

వనవాసం తర్వాత..

వనవాసం తర్వాత..

రామాయణం ప్రకారం పద్నాలుగు సంవత్సరాల పాటు వనవాసం ముగించుకుని, అయోధ్యకు రాముడు పుష్పక విమానంలో బయలుదేరాడు. రాముడు అక్కడికి చేరుకోగానే పరుగెత్తుకుంటూ వెళ్లి సోదరుని పాదాలకు పాదుకులు తొడిగాడు. ఇది చూసి సుగ్రీవ, విభీషణుల కన్నుల వెంట నీళ్లు కారాయి. ఆ వెంటనే భరతుడు సుగ్రీవుడు కౌగిలించుకుని ‘ఇంతకుముందు మేం నలుగురు అన్నదమ్ములం, ఇప్పటి నుండి ఐదుగురు అన్నదమ్ములం సుగ్రీవా' అన్నారు.

నీ పాదాల దగ్గర..

నీ పాదాల దగ్గర..

అదే సమయంలో భరతుడు మాట్లాడుతూ ఇలా అన్నాడు ‘మా అమ్మ ఆనాడు రెండు వరాలు అడిగింది. ఇక్ష్యా వంశంలో పెద్దవాడిగా పుట్టి, రాజ్యం పొందడానికి అన్ని అర్హతలు కలిగి ఉన్న నువ్వు, తండ్రి మాట జవదాటకుండా రాజ్యాన్ని త్రుణప్రాయంగా పెట్టి వనవాసానికి వెళ్లావు. నువ్వు వెళ్లేటప్పుడు నాకు రాజ్యాన్ని ఎలా ఇచ్చావో.. అలా రాజ్యాన్ని తీసుకొచ్చి నీ పాదాల దగ్గర పెట్టేస్తున్నాను' అన్నారు.

రాజ్యానికి వెళ్లే ముందు..

రాజ్యానికి వెళ్లే ముందు..

భరతుని మాటలకు రాముడు చాలా సంతోషపడ్డాడు. అనంతరం కౌసల్యదేవి సీతాదేవికి అభ్యంగన స్నానం చేయించి, మంచి వస్త్రాలు కట్టి చక్కగా అలంకరించింది. రాముడు కూడా మంగళ స్నానం చేసి అందమైన పట్టు వస్త్రాలు ధరించి, మంచి అంగరాగాలను పూసుకుని, దివ్యాభరణాలు ధరించి బయటికి వచ్చారు. అనంతరం సుగ్రీవునితో సహా వానరులందరూ అయోధ్యకి బయలుదేరారు.

శ్రీరామ నవమి 2021 : రాముడిని మెప్పించే మంత్రాలను జపిస్తే కలిగే శుభాలెన్నో తెలుసా...!

ఎవరెవరు ఏమి చేశారంటే..

ఎవరెవరు ఏమి చేశారంటే..

సూర్య మండల రథాన్ని రాముడు ఎక్కాడు. ఆ రథం సారథిగా భరతుడు మారాడు. లక్ష్మణుడు వంద తీగలు ఉన్న తెల్లటి గొడుగుని పట్టాడు. ఓవైపు శత్రఘ్నుడు, మరోవైపు విభీషణుడు వింజామర వీస్తున్నారు. అలా రథంలో అయోధ్యకి వెళ్తున్న రాముడు కనబడ్డ వారందరినీ పలకరించుకుంటూ వెళ్లాడు. ఆ వెళ్లేటప్పుడు ముందుగా మంగళ వాయిద్యాలు, మేళతాళాలతో సందడిగా మారింది..

పట్టాభిషేకం సమయంలో..

పట్టాభిషేకం సమయంలో..

అనంతరం వేదపండితులు రాముని వెంట నడిచారు. తర్వాత పెద్దలు, వారితో పాటు వశిష్టుడు, జాబిలి, కశ్యపుడు, గౌతముడు తదితర రుషులందరూ వచ్చారు. అలా అందరూ కలిసి అయోధ్య చేరుకున్నారు. రాముని పట్టాబిషేకానికి 4 సముద్ర జలాలు, 500 నదుల జలాలను వానరాలు తీసుకొచ్చాయి. వానరాలు తీసుకొచ్చిన ఆ జలాలని రాముడి మీద పోసి కీరిటాన్ని తీసుకొచ్చి రాముడి శిరస్సున అలంకరించారు. ఇంద్రుని వంద బంగారు పూసలు కలిగిన మాలని రాముడికి బహుకరించారు.

రామ రాజ్యంలో..

రామ రాజ్యంలో..

రాముని రాజ్యంలో ఎవ్వరికీ దొంగలు, దుష్టులు, శత్రువుల భయం అనేది ఉండేది కాదు. ప్రతి నెలా మూడు సార్లు వర్షాలు కురుస్తుండేవి. భూములన్నీ సస్యశ్యామలంగా ఉండేవి. సమయానికి పంటలు చేతికొచ్చేవి. అందరూ సంతోషంగా ఉండేవారు. అందుకే ప్రస్తుత కలియుగంలో కూడా అందరూ రామ రాజ్యం కావాలని కోరుకుంటారు.

English summary

Ram Navami 2021 Date, History, Significance and Importance in Telugu

Here we are talking about the Ram Navami 2021 date, history, significance and importance in Telugu. Read on
Story first published: Thursday, April 15, 2021, 13:42 [IST]