For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Ramakrishna Jayanti 2022:రామక్రిష్ణ జయంతి ఎప్పుడు? వివేకానందుని గురువు గురించి ఈ విషయాలు తెలుసా...

రామక్రిష్ణ జయంతి వార్షికోత్సవం మార్చి 4వ తేదీ సందర్భంగా రామక్రిష్ణ పరమహంస ప్రాముఖ్యత, విశిష్టత గురించి తెలుసుకుందాం.

|

భారతదేశంలోని గొప్ప గురువులలో రామక్రిష్ణ పరమహంస ఒకరు. ఈయన 19వ శతాబ్దంలో జీవించారు. అంతేకాదు ఈయన స్వామి వివేకానందకు గురువు కూడా. ఈయన ఒక గొప్ప ఆధ్యాత్మిక గురువు.

Ramakrishna Jayanti 2022: Know Date, History and Significance in Telugu

రామక్రిష్ణ పరమహంస ఫాల్గుణ మాసంలో క్రిష్ణ పక్షంలో రెండో రోజున జన్మించారు. 2022 సంవత్సరంలో మార్చి 4వ తేదీన అంటే శుక్రవారం నాడు రామక్రిష్ణ పరమహంస జయంతి వచ్చింది. గొప్ప ఆధ్యాత్మిక గురువు అయిన రామక్రిష్ణ జయంతిని దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. 186వ జయంతి సందర్భంగా వివేకానందుని గురువు రామక్రిష్ణ పరమహంస గురించి కొన్ని ఆసక్తిరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Phalguna Masam 2022 :ఫాల్గుణంలో లక్ష్మీదేవి ఆశీస్సులు కావాలంటే ఇలా చేయండి...Phalguna Masam 2022 :ఫాల్గుణంలో లక్ష్మీదేవి ఆశీస్సులు కావాలంటే ఇలా చేయండి...

రామక్రిష్ణ జననం..

రామక్రిష్ణ జననం..

రామక్రిష్ణ పరమహంస 1836వ సంవత్సరంలో ఫిబ్రవరి 18వ తేదీన హిందూ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. అయితే చారిత్రక రికార్డుల ప్రకారం, రామక్రిష్ణ పరమహంస హిందూ మాసంలో ఫాల్గుణంలో శుక్ల పక్షం ద్వితీయ రోజున జన్మించాడు. ఈ సంవత్సరం 2022లో మార్చి 4వ తేదీన వస్తుంది. శుక్ల పక్షం ద్వితీయ తిథి 3 మార్చి 2022న రాత్రి 9:36 గంటలకు ప్రారంభమవుతుంది. మరుసటి రోజు 4వ తేదీ మార్చి 2022న రాత్రి 8:45 గంటలకు ముగుస్తుంది.

రామక్రిష్ణ జయంతి చరిత్ర..

రామక్రిష్ణ జయంతి చరిత్ర..

* రామక్రిష్ణ పరమహంస పశ్చిమ బెంగాల్ లోని హుగ్లీ జిల్లాలో పేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు.

* ఆయన జన్మకు సంబంధించి కొన్ని విషయాలు ప్రాచుర్యం పొందాయి. అందులో ఒకటి విష్ణువు తన తండ్రికి కలలో కనిపించి కొడుకుగా పుట్టమని చెప్పాడు. అందుకే తనకు గదాధరుడనే పేరు వచ్చింది. ఆయన తల్లి కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది.

Phalguna Amavasya 2022:ఫాల్గుణ అమావాస్య రోజున పొరపాటున కూడా ఈ పనులు చేయకండి...Phalguna Amavasya 2022:ఫాల్గుణ అమావాస్య రోజున పొరపాటున కూడా ఈ పనులు చేయకండి...

కాళీ మాత భక్తుడిగా..

కాళీ మాత భక్తుడిగా..

* ఈయన కాళీ దేవి భక్తుడు. పశ్చిమ బెంగాల్ లోని ప్రసిద్ధ దక్షిణేశ్వర్ కాళీ దేవాలయానికి పూజారిగా పని చేశారు.

* తన సోదరుడు మరణించిన తర్వాత రామక్రిష్ణుడు కాళీ దేవిపై విశ్వాసం మరింత పెంచుకున్నాడు.

* కాళీ దేవిని తన తల్లిగా విశ్వసించేందుకు అనేక సందర్భాలు ఆయనను ప్రభావితం చేశాయి.

* శారద దేవికి కేవలం ఐదేళ్ల వయసులోనే తనకు వివాహం జరిగింది. 17 సంవత్సరాల తర్వాత ఆమె కోల్ కతాలో తనతో పాటు ఆశ్రమంలో చేరింది.

* రామక్రిష్ణుడు శారదా దేవిని కాళీ మాత అవతారంగా భావించి ‘శ్రీ మా'గా పరిచయం చేశాడు.

* ఆయన తన శిష్యులకు నిజమైన భగవంతుని విశ్వాసం ఉంచాలని మరియు మూఢనమ్మకాలన్నింటినీ విస్మరించాలని బోధించాడు.

రామక్రిష్ణ పరమహంస సందేశాలు..

రామక్రిష్ణ పరమహంస సందేశాలు..

* ‘‘ భక్తి కోసం భగవంతుని ప్రార్థించినట్లే, మీరు ఎవరిలోనూ తప్పులు కనుగొనకుండా ప్రార్థించాలి''

* ‘‘ అవసరమైనప్పుడు భగవంతుడే మనకు ఇతర విషయాలను ఇతర మార్గాలను వివరించును''

* ‘‘ఎదుగుదల కనపడటం లేదనే చింతన వద్దు.. మహా వృక్షమైనా సరే మౌనంగానే ఎదుగుతుంది.. నీ ప్రయత్నం నీవు చేయి.. ఫలితం మాత్రం భగవంతువునికి వదిలేయ్''

* ‘‘ఎవరికి సహాయం చేసినా నేను నిమిత్తమాత్రుడిని, ఈ మంచి పని భగవంతుడు నా చేత చేయిస్తున్నాడనే తలంపుతో చేయి''

* ‘‘అందరిలోనూ మంచిని చూడటం నేర్చుకుంటే, మనలోనూ మంచి పెరుగుతుంది''

* ‘‘నిజాలను మాట్లాడండి.. మాట్లాడే ముందు ఆలోచించండి.. ఆ తర్వాత లిఖించండి''

* ‘‘ఇవ్వడం నేర్చుకో, తీసుకోవడం కాదు.. అలాగే సేవ అలవరచుకో.. పెత్తనం కాదు''

FAQ's
  • రామక్రిష్ణ పరమహంస ఎప్పుడు జన్మించారు?

    రామక్రిష్ణ పరమహంస ఫాల్గుణ మాసంలో క్రిష్ణ పక్షంలో రెండో రోజున జన్మించారు. 2022 సంవత్సరంలో మార్చి 4వ తేదీన అంటే శుక్రవారం నాడు రామక్రిష్ణ పరమహంస జయంతి వచ్చింది. గొప్ప ఆధ్యాత్మిక గురువు అయిన రామక్రిష్ణ జయంతిని దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. 186వ జయంతి సందర్భంగా వివేకానందుని గురువు రామక్రిష్ణ పరమహంస గురించి కొన్ని ఆసక్తిరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

English summary

Ramakrishna Jayanti 2022: Know Date, History and Significance in Telugu

Ramakrishna Paramhansa is known as an important saint in India. Every year his birth anniversary is observed as Ramakrishna Jayanti. This year the day will be observed on 04 March 2022
Story first published:Thursday, March 3, 2022, 14:46 [IST]
Desktop Bottom Promotion