For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Ratha Saptami 2021 :రథసప్తమి రోజున ఈ మంత్రాలతో సూర్యుడిని ఆరాధిస్తే..ఎన్ని శుభఫలితాలో తెలుసా...

|

హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి నెలకు ఏదో ఒక ప్రత్యేకత అనేది ఉంటుంది. వీటిలో సూర్య ఆరాధనకూ ప్రధానమైన మాసం మాఘ మాసం. ఈ నెలలో శివుడు, విష్ణువు, వినాయకుడు, శక్తి ఉపాసనలకు ఎంతో విశిష్టత ఉంది.

ఈ మాసంలో చంద్రుడు మఖ నక్షత్రంతో కూడుకుని ఉంటాడు. అందుకే ఈ నెలకు మాఘ మాసం అనే పేరు వచ్చింది. మాఘ మాసంలో వచ్చే శుద్ధ సప్తమినే రథసప్తమి అంటారు. 2021 సంవత్సరంలో ఫిబ్రవరి 19వ తేదీ శుక్రవారం రథసప్తమి వచ్చింది.

ఈరోజున సూర్యదేవుడు పుట్టిన రోజు అని పురాణాల ద్వారా తెలుస్తోంది. సూర్య భగవానుడు ఏక చక్ర రథంలో ఆరు ఆకులు, ఏడు గుర్రాలు ఉన్న వాహనంపై ప్రయాణిస్తాడని పండితులు చెబుతున్నారు. ఇక్కడ చక్రం అంటే ఒక సంవత్సరం అని అర్థం. ఆరు ఆకులు అంటే ఆరు రుతువులు, ఏడు గుర్రాలు అంటే ఏడు కిరణాలు అని అర్థం. అంతే కాదు రథ సప్తమి అంటే శీతాకాలం ముగియడం. అలాగే రబీ పంట కాలం ప్రారంభాన్ని కూడా సూచిస్తుంది. ఈ సందర్భంగా రథసప్తమి యొక్క ఆచారాలు మరియు ప్రాముఖ్యత, సూర్య మంత్రాల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

రథ సప్తమి 2021 : ఈరోజున ఇలా చేస్తే ఏడు జన్మల పాపం పోతుందట...!రథ సప్తమి 2021 : ఈరోజున ఇలా చేస్తే ఏడు జన్మల పాపం పోతుందట...!

త్రిమూర్తుల స్వరూపంగా..

త్రిమూర్తుల స్వరూపంగా..

సూర్యభగవానుడు ఉదయం పూట బ్రహ్మ స్వరూపంగానూ, మధ్యాహ్నం వేళ మహేశ్వరునిగానూ.. సాయంకాలం వేళలో శ్రీమహావిష్ణువు స్వరూపంగా ఉంటూ ప్రతిరోజూ త్రిమూర్తుల స్వరూపంలో ఈ లోకాన్ని నడిపిస్తాడు. సూర్యమాన ప్రకారం మాఘ శుద్ధ సప్తమి రోజునే రథసప్తమిగా పండితులు చెబుతారు. సూర్యభగవానుడు పుట్టిన రోజే ఈ పుణ్య తిథి. ఈ మాఘమాసంలోని శుద్ధ సప్తమిని సూర్య సప్తమి, అచలా సప్తమి, మహాసప్తమి, సప్తసప్తి సప్తమి అని అనేక పేర్లతో జరుపుకుంటారు.

రథసప్తమి రోజున గంగా స్నానం..

రథసప్తమి రోజున గంగా స్నానం..

ఈ పవిత్రమైన రోజున తలపై జిల్లేడు ఆకులను, రేగి పళ్లను ఉంచుకుని ప్రవహిస్తున్న నీటిలో లేదా గంగా నదిలో స్నానం చేయాలి. ఇలా స్నానం చేసే సమయంలో ‘యద్యజ్జన్మక్రుతం పాపం మయా సప్తసు జన్మసు తన్మే రోగం చ శోకంచ మాకరీ హంతు సప్తమీ! అనే మంత్రాన్ని మూడుసార్లు ఉచ్చరిస్తూ.. స్నానం చేస్తే సూర్యగ్రహణ స్నానఫలం, గంగా స్నానఫలం కలుగుతాయని పురాణలు, ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి.

రథసప్తమి రోజున..

రథసప్తమి రోజున..

మాఘ శుద్ధ సప్తమి నాడే సూర్యభగవానుడు ఆవిర్భవించాడని.. పురాణాల ద్వారా తెలుస్తోంది. అందుకే ఈరోజున రథ సప్తమి అనే పేరు వచ్చిందని చాలా మంది భారతీయుల నమ్మకం. సకల జీవకోటికి వెలుగునిచ్చే సూర్యుడు రథంపై చేరి తన దిశ మార్చుకునే రోజు. అలాంటి పవిత్రమైన రోజున కొన్ని పనులు చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా, దీర్ఘకాల వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది.

Vasant Panchami 2021: విద్యలో విజయం సాధించాలంటే.. మీ రాశిని బట్టి ఈ సరస్వతి మంత్రాలను జపించాలి...Vasant Panchami 2021: విద్యలో విజయం సాధించాలంటే.. మీ రాశిని బట్టి ఈ సరస్వతి మంత్రాలను జపించాలి...

సూర్య మంత్రం..

సూర్య మంత్రం..

యదా జన్మకృతం పాపం

మయాజన్మసు జన్మసు తన్మీరోగంచ శోకంచ

మాకరీ హంతు సప్తమీ ఏతజ్ఞన్మకృతం పాపం

యచ్ఛ జనమంతరార్జితం మనోవాక్కాయజం

యచ్ఛ జ్ఞాతాజ్ఞాతేచ యే పున: సప్త విధం పాపం

స్నానామ్నే సప్త సప్తికే సప్త వ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమి

సూర్య మంత్ర ఫలితం..

సూర్య మంత్ర ఫలితం..

రథసప్తమికి ఒకరోజు ముందు అంటే ఆరోజు రాత్రి వేళలో ఉపవాసం ఉండి ఉదయం సూర్యోదయానికి ముందుగానే నిద్ర లేచి స్నానం చేయాలి. మగవారు ఏడు జిల్లేడు ఆకులు, స్త్రీలు ఏడు చిక్కుడు ఆకులు తల, భుజాలపై ఉంచుకుని పై మంత్రాన్ని జపించాలి. ఇలా చేయడం వల్ల సూర్యుని అనుగ్రహం లభిస్తుంది.

తూర్పు దిక్కున..

తూర్పు దిక్కున..

రథ సప్తమి నాడు ఆవు నేతితో దీపారాధన చేయడం వల్ల విశేష ఫలితాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు. సూర్యకిరణాలు పడే చోట తూర్పు దిక్కున తులసికోట పక్కగా ఆవు పేడను నేలపై అలికి, దానిపై పిండితో పద్మం వేసి, పొయ్యి పెట్టి, పిడకలను వెలిగించి పాలు పొంగించి ఆ పాలల్లో కొత్త బియ్యం, బెల్లం, నెయ్యి, యాలకులు వేసి పరమాన్నం తయారు చేస్తారు.

దేవునికి నైవేద్యంగా..

దేవునికి నైవేద్యంగా..

తులసి కోట ఎదరుగా చిక్కుడు కాయలతో రథం వేసి చిక్కుడు ఆకులపై పరమాన్నం ఉంచి దేవునికి నైవేద్యంగా సమర్పించాలి. రథసప్తమి నాడు భగవంతుడికి ఎర్రని పువ్వులతో పూజిస్తే మంచి ఫలితం వస్తుందని పండితులు చెబుతున్నారు.

సూర్య కిరణాలు పడేచోట..

సూర్య కిరణాలు పడేచోట..

మీ ఇంట్లో లేదా కాంపౌండ్ లో ఎక్కడైతే సూర్యకిరణాలు స్పష్టంగా పడతాయో లేదా తులసి చెట్టు ఉన్న ప్రాంతంలో ఒక పీటను పెట్టి దాన్ని పసుపుతో శుద్ధి చేయాలి. తర్వాత ముగ్గులు వేసి సూర్యభగవానుడి ఫొటోను అక్కడే ఉంచాలి. దానికి గంధం మరియు కుంకుమ పెట్టి, ఎర్రని పువ్వులతో అలంకరించాలి. కొబ్బరి పుల్లల సహాయంతో చిన్న రథం చేసి సూర్యుడి రథంగా భావించి పూజ చేసి, నేతితో చేసిన దీపాన్ని వెలిగించాలి.

English summary

Ratha Saptami 2021 Date and Time, Significance And Rituals of Surya Jayanti

Here we are talking about the Ratha Saptami 2021 date and time, significance and rituals of surya jayanti. Read on