For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Ratha Saptami 2022:ఈ ఏడాది రథ సప్తమి ఎప్పుడొచ్చింది? శుభ ముహుర్తం ఎప్పుడంటే...

|

హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి సంవత్సరం మాఘ మాసంలోని శుక్ల పక్షంలో ఏడో రోజున అంటే సప్తమి రోజు రథ సప్తమి వేడుకలను జరుపుకుంటారు. రథ సప్తమినే అచల సప్తమి అని లేదా సూర్య జయంతి అని కూడా అంటారు.

Ratha Saptami 2022 Date, Puja Vidhi, Sun Rising Time and Significnace in Telugu

పురాణాల ప్రకారం సూర్య భగవానుడు మాఘ శుక్ల పక్షమి రోజునే జన్మించాడు. అందుకే ఈరోజున సూర్య జయంతి అని పిలుస్తారు. అలాగే సూర్య దేవుడు ఈ పవిత్రమైన రోజునే తన ఏడు గుర్రాల రథంతో అందరికీ దర్శనమిచ్చాడు.

ఎంతో విశిష్టత కలిగిన ఈ పవిత్రమైన రోజున సూర్య భగవానుడిని నిష్టతో, భక్తిశ్రద్ధలతో పూజిస్తే ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతానం, ధాన్యాలతో పాటు సూర్యుని ఆశీస్సులు లభిస్తాయని చాలా మంది నమ్ముతారు. ఈ సందర్భంగా 2022 సంవత్సరంలో రథ సప్తమి ఎప్పుడొచ్చింది? శుభ ముహుర్తం ఎప్పుడు? రథ సప్తమి ప్రాముఖ్యత గురించి ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Ratha Saptami 2022 : ఏడు జన్మల పాపం పోవాలంటే.. రథసప్తమి రోజున ఇలా చేయండి...Ratha Saptami 2022 : ఏడు జన్మల పాపం పోవాలంటే.. రథసప్తమి రోజున ఇలా చేయండి...

శుభ ముహుర్తం..

శుభ ముహుర్తం..

హిందూ పంచాంగం ప్రకారం, ఈ ఏడాది మాఘ మాసంలోని శుక్ల పక్షంలో సప్తమి రోజున అంటే ఫిబ్రవరి 7వ తేదీన సోమవారం నాడు రథ సప్తమి వచ్చింది. ఈరోజు తెల్లవారుజామున 4:37 గంటలకు రథ సప్తమి పూజలను ప్రారంభించాలి. సోమవారం తెల్లవారుజామున సూర్య దేవాలయంలో ప్రారంభమైన వేడుకలు మరుసటి రోజున అంటే ఫిబ్రవరి 8వ తేదీన మంగళవారం నాడు ఉదయం 6:15 గంటలకు ముగుస్తాయి.

పూజా సమయం..

పూజా సమయం..

రథ సప్తమి రోజున అంటే ఫిబ్రవరి 7వ తేదీన సోమవారం నాడు ఉదయం తెల్లవారు జామున 5:22 గంటల నుండి ఉదయం 7:06 గంటల వరకు సూర్యభగవానుడికి పూజించడానికి ఉత్తమ సమయం అని పండితులు చెబుతున్నారు. ఈ పవిత్రమైన రోజున ప్రతి ఒక్కరూ గంగా నదిలో లేదా ప్రవహించే నదిలో స్నానం చేసి, సూర్యునికి నీటిని సమర్పించి.. సూర్య మంత్రాలను జపించాలి. మీరు పూజ చేసే సమయంలో ఆదిత్య సోత్త్రాన్ని తప్పనిసరిగా పఠించాలి. ఇలా చేయడం వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయట.

సూర్యోదయ సమయం..

సూర్యోదయ సమయం..

రథ సప్తమి రోజున సూర్యుడు ఉదయం 7:06 గంటలకు ఉదయించనున్నాడు. అదే రోజున సాయంత్రం 6:05 గంటలకు అస్తమించనున్నాడు. శుభ యోగం సాయంత్రం 4:44 గంటలకు ఉంటుంది. రవి యోగం ఉదయం 7:06 గంటల నుండి సాయంత్రం 6:59 గంటల వరకు ఉంటుంది. శుభ ముహుర్తం మధ్యాహ్నం 12:13 నుండి మధ్యాహ్నం 12:57 గంటల వరకు ఉంటుంది.

Basant Panchami 2022:వసంత పంచమి రోజున ఈ పనులు అస్సలు చేయకండి...Basant Panchami 2022:వసంత పంచమి రోజున ఈ పనులు అస్సలు చేయకండి...

సూర్యుడి పుట్టినరోజునే..

సూర్యుడి పుట్టినరోజునే..

ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం 2022 సంవత్సరంలో ఫిబ్రవరి ఏడో తేదీన అంటే సోమవారం నాడు రథ సప్తమి వేడుకలను జరుపుకోనున్నారు. ఈ సమయంలో ఒడిశాలోని కోణార్క్, ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మన నిత్య జీవితంలో సూర్యుడు ఎన్నో విధాలుగా సహాయపడతాడు. అలాంటి సూర్యుడు పుట్టినరోజే ఈరోజు. సూర్య భగవానుడు ఉదయం వేళలో బ్రహ్మ స్వరూపంగా ప్రకృతిలో జీవం నింపి, మధ్యాహ్నం వేళలో తన కిరణాల ద్వారా మహేశ్వరుడిలాగా దైవిక వికారాలను రూపుమాపి, సాయంకాలం సంధ్య వేళలో విష్ణుమూర్తి అవతారంలోలాగా భాసిల్లే కిరణాలను మనో రంజకంగా ప్రసరింపజేస్తూ మనల్ని ఆనందాన్ని ఇస్తాడు. అంతే కాదు ఈ లోకంలో అంధకారం తొలగించి, మనకు వెలుగుని ప్రసాదిస్తాడు. మనకు జీవనాధారానికి అవసరమైన పంటలను పండటానికి సహకరిస్తాడు. మనం ఉదయం, పగలు, రాత్రి, సాయంత్రం అని లెక్కించేది కూడా ఈ సూర్యభగవానుడి కదలికలను బట్టే. సూర్యుడు పుట్టిన రోజునే రథసప్తమి అని, మహా సప్తమి, మాఘ శుద్ధ సప్తమి అని రక రకాల పేర్లతో పిలుస్తుంటారు.

ఏడు జన్మల పాపాలు పోతాయట..!

ఏడు జన్మల పాపాలు పోతాయట..!

రథ సప్తమి రోజున స్నానం చేసిన అనంతరం సూర్య కిరణాలు ఎక్కడైతే స్పష్టంగా పడతాయో లేదా తులసి చెట్టు ఉన్న ప్రాంతంలో ఒక పీటను పెట్టి దాన్ని పసుపుతో శుద్ధి చేయాలి. తర్వాత ముగ్గులు వేసి సూర్యభగవానుడి ఫొటోను అక్కడ ఉంచాలి. దానికి గంధం మరియు కుంకుమ పెట్టి, ఎర్రని పువ్వులతో అలంకరించాలి. కొబ్బరి పుల్లల సహాయంతో చిన్న రథాన్ని చేసి, సూర్యుడి రథంగా భావించి పూజ చేసి, నేతితో చేసిన దీపాన్ని వెలిగించాలి. ఇలాంటి పవిత్రమైన రోజున ఉపవాసంతో పాటు పూజలు చేసి నైవేద్యం సమర్పిస్తే దీర్ఘాకాలిక వ్యాధుల నుండి ఉపశమనం లభించి మనం ఆరోగ్యంగా ఉండేందుకు సూర్యుడు సహాయపడతాడట. అలాగే రథ సప్తమి నాడు తలపై ఏడు జిల్లేడు ఆకులను ఉంచుకుని నీటితో తలస్నానం చేస్తే మనకు ఏడు జన్మల నుంచి వస్తున్న పాపాలన్నీ పోతాయని పండితులు చెబుతున్నారు.

ఈ మంత్రాలను..

ఈ మంత్రాలను..

యదా జన్మకృతం పాపం మయాజన్మసు జన్మసు

తన్మీరోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమీ

ఏతజ్ఞన్మకృతం పాపం యచ్ఛ జనమంతరార్జితం

మనోవాక్కాయజం యచ్ఛ జ్ఞాతాజ్ఞాతేచ యే పున:

సప్త విధం పాపం స్నానామ్నే సప్త సప్తికే

సప్త వ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమి

FAQ's
  • 2022 సంవత్సరంలో రథ సప్తమి ఎప్పుడొచ్చింది?

    హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి సంవత్సరం మాఘ మాసంలోని శుక్ల పక్షంలో ఏడో రోజున అంటే సప్తమి రోజు రథ సప్తమి వేడుకలను జరుపుకుంటారు. రథ సప్తమినే అచల సప్తమి అని లేదా సూర్య జయంతి అని కూడా అంటారు. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం 2022 సంవత్సరంలో ఫిబ్రవరి ఏడో తేదీన అంటే సోమవారం నాడు రథ సప్తమి వేడుకలను జరుపుకోనున్నారు. ఈ సమయంలో ఒడిశాలోని కోణార్క్, ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

English summary

Ratha Saptami 2022 Date, Puja Vidhi, Sun Rising Time and Significnace in Telugu

Here we are talking about the Ratha saptami 2022 date, puja vidhi, sun rising time and significance in Telugu. Have a look
Story first published:Saturday, February 5, 2022, 17:50 [IST]
Desktop Bottom Promotion