For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Ratha Saptami 2022 : ఏడు జన్మల పాపం పోవాలంటే.. రథసప్తమి రోజున ఇలా చేయండి...

గోవుల పిడకలను తీసుకుని, పొయ్యి మీద ఇత్తడి పాత్రను పెట్టాలి. అందులో ఆవు పాలను పోసి, మంటను కర్పూరంతో వెలిగించాలి. పాలు పొంగే సమయంలో కొత్త బియ్యం, బెల్లం వేసి చెరుకు గడతో తిప్పుతూ పరమాన్నం తయారు చేయాలి.

|

హిందూ క్యాలెండర్ ప్రకారం 2022లో ఫిబ్రవరి 7వ తేదీన సోమవారం నాడు రథసప్తమిని జరుపుకుంటారు. రథ సప్తమి సూర్యభగవానుడికి అంకితమివ్వబడింది. మన పురాణాలలో సూర్య దేవుడి గురించి అనేక కథలు ఉన్నాయి. మన నిత్య జీవితంలో సూర్యుడు ఎన్నో విధాలుగా సహాయపడతాడు. అలాంటి సూర్యుడు పుట్టినరోజే ఈరోజు.

ratha saptami

సూర్య భగవానుడు ఉదయం వేళలో బ్రహ్మ స్వరూపంగా ప్రకృతిలో జీవం నింపి, మధ్యాహ్నం వేళలో తన కిరణాల ద్వారా మహేశ్వరుడిలాగా దైవిక వికారాలను రూపుమాపి, సాయంకాలం సంధ్య వేళలో విష్ణుమూర్తి అవతారంలోలాగా భాసిల్లే కిరణాలను మనో రంజకంగా ప్రసరింపజేస్తూ మనల్ని ఆనందాన్ని ఇస్తాడు. అంతే కాదు ఈ లోకంలో అంధకారం తొలగించి, మనకు వెలుగుని ప్రసాదిస్తాడు.

Ratha Saptami Puja

మనకు జీవనాధారానికి అవసరమైన పంటలను పండటానికి సహకరిస్తాడు. మనం ఉదయం, పగలు, రాత్రి, సాయంత్రం అని లెక్కించేది కూడా ఈ సూర్యభగవానుడి కదలికలను బట్టే. సూర్యుడు పుట్టిన రోజునే రథసప్తమి అని, మహా సప్తమి, మాఘ శుద్ధ సప్తమి అని రక రకాల పేర్లతో పిలుస్తుంటారు.

Ratha Saptami Puja

ఇంతటి పవిత్రమైన ఈరోజున పూజను ఏ విధంగా చేయాలి. ఉపవాసంతో పాటు ఇంకా ఏయే పనులు చేస్తే మీరు అనుకున్న పనులన్నీ అవుతాయో తెలుసుకునేందుకు ఈ స్టోరీని చూడండి...

నేటి స్నానానికి విశిష్టత..

నేటి స్నానానికి విశిష్టత..

రథ సప్తమి నాడు చేసే స్నానానికి ఒక విశిష్టత ఉంది. ఈరోజు మన తలపై ఏడు జిల్లేడు ఆకులను ఉంచుకుని నీటితో తలస్నానం చేస్తే మనకు ఏడు జన్మల నుంచి వస్తున్న పాపాలన్నీ పోతాయని పండితులు చెబుతున్నారు.

రథసప్తమి వేళ ఈ మంత్రం..

రథసప్తమి వేళ ఈ మంత్రం..

యదా జన్మకృతం పాపం మయాజన్మసు జన్మసు

తన్మీరోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమీ

ఏతజ్ఞన్మకృతం పాపం యచ్ఛ జనమంతరార్జితం

మనోవాక్కాయజం యచ్ఛ జ్ఞాతాజ్ఞాతేచ యే పున:

సప్త విధం పాపం స్నానామ్నే సప్త సప్తికే

సప్త వ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమి

సూర్యభగవానుడి ఫొటోతో..

సూర్యభగవానుడి ఫొటోతో..

ఈరోజు స్నానం చేసిన అనంతరం సూర్య కిరణాలు ఎక్కడైతే స్పష్టంగా పడతాయో లేదా తులసి చెట్టు ఉన్న ప్రాంతంలో ఒక పీటను పెట్టి దాన్ని పసుపుతో శుద్ధి చేయాలి. తర్వాత ముగ్గులు వేసి సూర్యభగవానుడి ఫొటోను అక్కడ ఉంచాలి. దానికి గంధం మరియు కుంకుమ పెట్టి, ఎర్రని పువ్వులతో అలంకరించాలి. కొబ్బరి పుల్లల సహాయంతో చిన్న రథాన్ని చేసి, సూర్యుడి రథంగా భావించి పూజ చేసి, నేతితో చేసిన దీపాన్ని వెలిగించాలి.

నైవేద్య సమర్పణ..

నైవేద్య సమర్పణ..

గోవుల పిడకలను తీసుకుని, పొయ్యి మీద ఇత్తడి పాత్రను పెట్టాలి. అందులో ఆవు పాలను పోసి, మంటను కర్పూరంతో వెలిగించాలి. పాలు పొంగే సమయంలో కొత్త బియ్యం, బెల్లం వేసి చెరుకు గడతో తిప్పుతూ పరమాన్నం తయారు చేయాలి. ఇలా తయారైన పరమాన్నాన్ని చిక్కుడు ఆకుల్లో పెట్టి సూర్యభగవానుడికి నైవేద్యంగా సమర్పించాలి. అదే ఆకుల్లోనే అందరికీ ప్రసాదం పంచాలి.

వ్యాధుల నుండి ఉపశమనం..

వ్యాధుల నుండి ఉపశమనం..

మాఘ శుద్ధ సప్తమి నాడు సూర్యుడు రథాన్ని ఎక్కి తన దిశ నిర్దేశాన్ని మార్చుకునే రోజు. ఇలాంటి పవిత్రమైన రోజున ఉపవాసంతో పాటు పూజలు చేసి నైవేద్యం సమర్పిస్తే దీర్ఘాకాలిక వ్యాధుల నుండి ఉపశమనం లభించి మనం ఆరోగ్యంగా ఉండేందుకు సూర్యుడు సహాయపడతాడట.

సకల లాభాలు..

సకల లాభాలు..

రథ సప్తమి రోజున ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. ఈ విధంగా సూర్యభగవానుడికి పూజలు చేయడం వల్ల మనకు సకల శుభాలు, లాభాలు కలుగుతాయని పెద్దలు చెబుతున్నారు.

FAQ's
  • 2022లో రథ సప్తమిని ఎప్పుడు జరుపుకుంటారు?

    హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి సంవత్సరం మాఘ మాసంలోని ఏడో రోజున అంటే సప్తమి రోజు రథ సప్తమి వేడుకలను జరుపుకుంటారు. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం 2022 సంవత్సరంలో ఫిబ్రవరి ఏడో తేదీన అంటే సోమవారం నాడు రథ సప్తమి వేడుకలను జరుపుకోనున్నారు. ఈ సమయంలో ఒడిశాలోని కోణార్క్, ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

English summary

Ratha Saptami Puja Vidhi and Things to do

Every year Ratha Saptami is observed on the seventh day of the Magh month. This year the festival will be celebrated on 19 February 2021. therefore, we have brought the date, time, significance and benefits of the festival.
Desktop Bottom Promotion