Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
Ratha Saptami 2024 :రథసప్తమి నాడు స్నానం చేసే వేళ ఈ శ్లోకాలను పఠిస్తే సమస్త పాపాలు నశిస్తాయి...!
నేడు రథ సప్తమి. మన కంటికి కనిపించే ప్రత్యక్ష దైవం ఎవరైనా ఉన్నారంటే.. అందులో తొలి స్థానం సూర్యభగవానుడికే దక్కుతుంది. అందుకే ఆయన్ను 'ప్రత్యక్ష నారాయణుడు' అని సంభోదిస్తుంటారు.
హిందూ పురాణాలు, పంచాంగం ప్రకారం, మాఘ మాసంలోని శుద్ధ సప్తమి నాడు వేయి కిరణాలు గల సూర్యభగవానుడు జన్మించాడని.. ఆరోజునే సూర్యుడు పుట్టిన తిథిగా భావించారు. అందుకే ఆరోజు రథసప్తమిగా భారతీయులంతా భావిస్తారు. సకల జీవకోటి రాశులందరికీ వెలుగును ప్రసాదించే సూర్యుడు రథాన్ని ఎక్కి తన దిశ నిర్దేశాన్ని మార్చుకునే రోజు కూడా ఈరోజేనని నమ్ముతారు.

* రథ సప్తమి 2024 తేదీ: శుక్రవారం 16 ఫిబ్రవరి 2024
* రథ సప్తమి 2024 తిథి ప్రారంభం: ఫిబ్రవరి 15, 2024 గురువారం ఉదయం 10:12 నుండి
* రథ సప్తమి 2024 తిథి గడువు: శుక్రవారం 16 ఫిబ్రవరి 2024 ఉదయం 8:53 వరకు
* రథ సప్తమి 2024 శుభ ముహూర్తం: శుక్రవారం 16 ఫిబ్రవరి 2024 ఉదయం 5:18 నుండి 6:58 వరకు
అలాంటి రథసప్తమి 2024 సంవత్సరంలో ఫిబ్రవరి 16వ తేదీన శుక్రవారం వచ్చింది. ఇంతటి పవిత్రమైన రథసప్తమి రోజున కొన్ని పనులు చేయడం వల్ల మీ ఆరోగ్యం మెరుగుపడటమే కాదు.. దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం కూడా లభిస్తుంది. కాబట్టి రథసప్తమి ముందు రోజు అంటే గురువారం నాడు రాత్రి ఉపవాసం ఉండి శుక్రవారం రోజున ఉదయం అనగా సూర్యోదయానికి ముందుగానే స్నానం చేయాలి.

ఇలా చేసే సమయంలో కొన్ని మంత్రాలను జపిస్తూ స్నానం చేస్తే మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని పండితులు చెబుతున్నాయి. ఈ సందర్భంగా ఆ ముఖ్యమైన మంత్రాలేవి.. సూర్యోదయానికి ముందు స్నానం చేసేటప్పుడు ఏయే పనులు చేయాలనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ఇలా చేయాలి..
రథసప్తమి రోజున సూర్యోదయానికి ముందు తలస్నానం చేయాలి. అలా చేయడానికి ముందు మగవారు ఏడు జిల్లేడు ఆకులు, మహిళలు ఏడు చిక్కుడు ఆకులు తల, భుజాలపై ఉంచుకుని ఈ కింద మంత్రాన్ని చదువుతూ స్నానం చేయాలి.

ఈ మంత్రం చదువుతూ..
‘జననీ త్వం హి లోకానం
సప్తమీ సప్తసప్తికే, సప్తవ్యాహృతికే దేవి!
సమస్తే సూర్యమాతృకే'
‘సప్తాశ్యముల గల ఓ సప్తమీ!
నీవు సకల లోకాలకు, భూతాలకు, జననివి.
సూర్యుడికి తల్లివైన నీకు వందనాలు' అని ఈ మంత్రం యొక్క అర్థం.

ఏడు జన్మల పాపం..
రథ సప్తమి రోజున ఇలా జిల్లేడు, చిక్కుడు ఆకులను తల, భుజాలపై ఉంచుకుని స్నానం చేస్తూ.. అదే సమయంలో ఈ మంత్రాన్ని జపిస్తూ తలస్నానం చేయడం వల్ల మీకు ఏడు జన్మల నుండి వస్తున్న పాపాలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.

మరో మంత్రం..
యదా జన్మకృతం పాపం మయాజన్మసు జన్మసు
తస్య రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమీ
ఏతజ్ఞన్మకృతం పాపం యచ్ఛ జనమంతరార్జితం మనోవాక్కాయజం యచ్ఛ జ్ఞాతాజ్ఞాతేచ యే పున:
సప్త విధం పాపం స్నానామ్నే సప్త సప్తికే
సప్త వ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమి

ఎర్రని పువ్వులతో..
రథసప్తమి రోజున మంత్రాలు చదువుతూ స్నానం చేసిన తర్వాత ఎర్రని రంగులో ఉండే పువ్వులతో సూర్యభగవానుడికి ప్రత్యేక ప్రార్థనలు చేయాలి. సూర్యదేవుని చిత్రపటానికి ఎర్రని కుంకుమ, గంధంతో పూజలు చేయాలి. అలాగే ఆవు నేతితో చేసిన దీపాన్ని వెలిగించాలి.

సూర్యుడిని పూజిస్తే..
రథసప్తమి రోజున ఆదిత్యుడిని ఇలా పూజించడం వల్ల అష్టైశ్వర్యాలూ సిద్ధిస్తాయని చాలా మంది నమ్మకం. అంతేకాదు ఈరోజున సూర్యోదయానికి ముందే స్నానం చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా లభించనున్నాయి. మీకు చర్మ రోగాల నుండి విముక్తి లభిస్తుంది. పురాణాల ప్రకారం, శ్రీరాములు కూడా ఆదిత్య హృదయాన్ని పఠించి రావణ వథకు బయలుదేరారట. సూర్యునికి ఇష్టమైన ఈ పండుగ రోజున ఈ మంత్రాలను పటించి. సూర్యుడిని పూజించడం వల్ల విశేష ఫలితాలు రానున్నాయి.



Click it and Unblock the Notifications