For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దేవాలయాల్లోనూ, గృహాల్లోనూ పూజా కార్యక్రమాల్లో రాగిపాత్రలనే ఎందుకు వాడుతారు?

దేవాలయాల్లోనూ, గృహాల్లోనూ పూజా కార్యక్రమాల్లో రాగిపాత్రలనే వాడుతుంటారు. దీనికి సంబంధించి వివరాలను భూదేవికి సాక్షాత్తు ఆదివరాహస్వామి వివరించినట్టు వరాహ పురాణం పేర్కొంటుంది.

|

ఈ రోజుల్లో కూడా పూజాది కార్యక్రమాలకి వెండి, బంగారు పాత్రలు ఉపయోగించే వారు లేకపోలేదు. అయితే ఒకప్పటికంటే ఇప్పుడు అలాంటివారి సంఖ్య తగ్గిందనే చెప్పాలి. ఇక మధ్యతరగతి వారు కూడా ఇత్తడి - రాగి పాత్రలను వాడటం చాలావరకు తగ్గించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎవరి ఇంట్లో చూసినా స్టీలు పాత్రలే దర్శనమిస్తున్నాయి. పూజకి ఉపయోగించే అన్ని రకాల పాత్రలు నేడు స్టీలులోనే కనిపిస్తున్నాయి. నగిషీ కారణంగా స్టీలు ... ఇనుము అనే భావన కలగనీయదు. ఈ కారణంగానే దీని వాడకం అంతకంతకూ పెరుగుతూపోతోంది.అయితే ఇటు ఆరోగ్యపరంగాను ... అటు ఆధ్యాత్మిక పరంగాను స్టీలు పాత్రలను వాడకూడదని శాస్త్రం చెబుతోంది.

Reason Behind Why Hindus Use Copper Things To Worship God

దేవాలయాల్లోనూ, గృహాల్లోనూ పూజా కార్యక్రమాల్లో రాగిపాత్రలనే వాడుతుంటారు. దీనికి సంబంధించి వివరాలను భూదేవికి సాక్షాత్తు ఆదివరాహస్వామి వివరించినట్టు వరాహ పురాణం పేర్కొంటుంది. బంగారు వెండి వస్తువులను దేవుళ్ళకు అలంకరించిన, పూజల్లో మాత్రం ఎక్కువగా రాగిపాత్రలనే వాడుతుంటారు. ఇలా పూజకు రాగి పాత్రలను ఎందుకు వాడుతుంటారన్న సందేహం చాలా మందికి కలగవచ్చు? అయితే రాగి పాత్రల వాడకం వెనుక గల కారణాలను భూదేవికి సాక్షాత్తు ఆదివరాహస్వామి వివరించినట్టు వరాహ పురాణం చెబుతోంది. పూర్తివివరాల్లోకి వెళ్తే...

గుడాకేశుడు అనే రాక్షసుడు మహావిష్ణువుని నిత్యం కొలిచేవాడు.

గుడాకేశుడు అనే రాక్షసుడు మహావిష్ణువుని నిత్యం కొలిచేవాడు.

కొన్ని వేల యుగాలకు పూర్వం గుడాకేశుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతను మహావిష్ణువుని నిత్యం కొలిచేవాడు. వైకుంఠధారి అంటే అతనికి ఎంతో భక్తి. ఒక ఆశ్రమంలో రాగి రూపంలో స్వామి కటాక్షం కోసం కఠోరమైన తపస్సు ఆచరించాడు.

 శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై

శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై

కొంత కాలం అనంతరం శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమన్నాడు. తనకు ఎలాంటి వరాలు వద్దని తన దేహాన్ని సుదర్శన చక్రంతో ఖండించి భగవంతునిలో ఐక్యం చేసుకోవాలని గుడాకేశుడు కోరుతాడు.

అతని కోరిక నెరవేరుతుందని వరమిస్తాడు.

అతని కోరిక నెరవేరుతుందని వరమిస్తాడు.

తన శరీరం ద్వారా తయారు చేసిన పాత్రలు పూజలో ఉండాలని ప్రార్థిస్తాడు. అందుకు అనుగ్రహించిన పరంధాముడు వైశాఖ శుక్ల పక్ష ద్వాదశి రోజున అతని కోరిక నెరవేరుతుందని వరమిస్తాడు.

నారాయణుడి పూజలో రాగిపాత్రలకు ప్రాధాన్యత ఏర్పడింది.

నారాయణుడి పూజలో రాగిపాత్రలకు ప్రాధాన్యత ఏర్పడింది.

కొన్నాళ్లకు ద్వాదశి వచ్చింది. సుదర్శనచక్రం అతని శరీరాన్ని ముక్కలు చేస్తుంది. గుడాకేశుని ఆత్మ వైకుంఠానికి చేరుకుంది. శరీరం రాగిగా రూపొందింది. ఈ రాగి పాత్రలను తన పూజలో ఉపయోగించాలని లక్ష్మీపతి భక్తకోటిని ఆదేశించాడు. అప్పటి నుంచి నారాయణుడి పూజలో రాగిపాత్రలకు ప్రాధాన్యత ఏర్పడింది.

స్వామి అనుగ్రహం కోసం

స్వామి అనుగ్రహం కోసం

మానవజీవితం బంధనాలమయంగా ఉంటుంది. అశాశ్వతమైన వస్తువులను శాశ్వతంగా పరిభ్రమించి మానవులు అనేక పాపాలకు పాల్పడుతుంటారు. కానీ సకలా చరాచర జగత్తు ఆ స్వామి సృష్టేనని స్వామి అనుగ్రహం కోసం నిత్యం ప్రార్థనలు చేయాలన్న జ్ఞానం ఉండదు.

నిశ్చలమైన మనస్సుతో పూజిస్తే శేషశయనుడు అందరిని అనుగ్రహిస్తాడు

నిశ్చలమైన మనస్సుతో పూజిస్తే శేషశయనుడు అందరిని అనుగ్రహిస్తాడు

నిశ్చలమైన మనస్సుతో పూజిస్తే శేషశయనుడు అందరిని అనుగ్రహిస్తాడు అనేందుకు ఉదాహరణ గుడాకేశుని కథ ఉదాహరణగా చెబుతారు.

పూజలకు స్టీల్‌ పనికిరాదు:

పూజలకు స్టీల్‌ పనికిరాదు:

స్తోమత వుంటే వెండి - బంగారం, లేదంటే ఇత్తడి - రాగి పాత్రలను వాడటమే అన్ని విధాలా మంచిదని చెబుతోంది. స్టీలు ( ఇనుము) శని సంబంధమైన లోహం కనుక, దానికి బదులుగా ఇతరలోహాలతో చేసిన పాత్రలను మాత్రమే పూజకు వాడాలనీ, అప్పుడే ఎలాంటి దోషాలు లేని పరిపూర్ణమైన ఫలితాలను పొందవచ్చని స్పష్టం చేస్తోంది.

మరోవైపు ఆరోగ్యపరంగా చూస్తే

మరోవైపు ఆరోగ్యపరంగా చూస్తే

మరోవైపు ఆరోగ్యపరంగా చూస్తే కూడా రాగిపాత్రల్లో జలం సేవించడం మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. రాగిపాత్రల్లోని తీర్థాన్ని తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తి, రక్తశుద్ధి ఉంటుందని భారతీయ సంప్రదాయ వైద్య శాస్త్రాలు పేర్కొంటున్నాయి.

రాగితో ఆరోగ్యం బోలెడు:

రాగితో ఆరోగ్యం బోలెడు:

గతంలో రాగి చెంబు, రాగి బిందె, రాగి గ్లాసు, రాగి ప్లేటు ఇలా ఎక్కువగా రాగి వస్తువులనే వాడే వారు. కాని నేడు ఫ్యాషన్‌ ఎక్కువయ్యి ప్లాస్టిక్‌ వచ్చిపడింది. దాంతో రాగి పాత్రల వాడకం బాగా తగ్గిపోయింది. నీళ్ళు తాగాలంటే ప్లాస్టిక్‌ బాటిల్స్‌, లంచ్‌ బాక్సులు కూడా ప్లాస్టికే. నేటి ఇళ్ళు మొత్తం ప్లాస్టిక్‌ సామానుల మయమైపోయాయి. అయితే రాగి పాత్రలు వాడడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

రాగితో ఆరోగ్యం బోలెడు:

రాగితో ఆరోగ్యం బోలెడు:

రాగిలో యాంటి బ్యాక్టిరియల్‌ నేచర్‌ ఉంటుంది. రాగితో చేసిన పాత్రలలో సూక్ష్మ క్రిములు చేరే అవకాశం ఉండదు. కాబట్టి ఇందులో నిల్వచేసే పదార్థాలు చెడిపోయే అవకాశాలు చాలా తక్కువ.

రాగితో ఆరోగ్యం బోలెడు:

రాగితో ఆరోగ్యం బోలెడు:

మనకి వచ్చే చాలా రోగాలకి నీటి కాలుష్యం ముఖ్యమైన కారణం. రాగి పాత్రలలో నీళ్ళు ఉంచితే అందులో క్రిములు చేరే అవకాశం చాలా అరుదు. అందుకే పాత రోజుల్లో రాగి బిందెలు వాడేవారు.

రాగితో ఆరోగ్యం బోలెడు:

రాగితో ఆరోగ్యం బోలెడు:

చెవులు కుట్టినప్పుడు కూడా చిన్న పిల్లలకి కొన్ని చోట్ల మొదటిసారి రాగి తీగలు చుడతారు. ఎందుకంటే పుండు పడకుండా ఉండటానికి. రాగికి వున్న ఆంటి బ్యాక్టిరియల్‌ లక్షణం పిల్లలకు ఆ ప్రమాదం రాకుండా చేస్తుంది.

రాగితో ఆరోగ్యం బోలెడు:

రాగితో ఆరోగ్యం బోలెడు:

గతంలో నీళ్ళు వేడి చేసుకోవడానికి రాగితో చేసిన బాయిలర్లు వాడే వాళ్ళు. ఇందులో వేడి చేసిన నీరు వాడడం వల్ల చర్మ సంబంధిత రోగాలు కూడా తగ్గేవని రుజువు చెయ్యబడ్డాయి.

రాగితో ఆరోగ్యం బోలెడు:

రాగితో ఆరోగ్యం బోలెడు:

రాగి చెంబులో రాత్రి నీరు వుంచి పగలు నిద్ర లేవగానే తాగితే చాలా చాలా మంచిది. అలా తాగితే కడు పులో వున్న చెడు అంతా మూత్రం ద్వారా బయటకి వచ్చేస్తుందట. ఈ అలవాటు వల్ల గ్యాస్‌, కిడ్నీ, లివర్‌ సమస్యలు కూడా తగ్గిపోతాయి.

రాగితో ఆరోగ్యం బోలెడు:

రాగితో ఆరోగ్యం బోలెడు:

బ్రిటిష్‌కి చెందిన ఒక యూనివర్సిటీ వాళ్ళు కూడా రాగిపాత్రలలో ఉంచిన నీటిపై పరిశోధన జరిపి పైన పేర్కొన్న విషయాలు నిజమని నిరూపించారు.

పరగడుపున రాగి పాత్రలో నీళ్లు:

పరగడుపున రాగి పాత్రలో నీళ్లు:

రాత్రి రాగి చెంబులో మంచి నీళ్ళు వుంచి పరగడుపున తాగితే హాయిగా జీవించవచ్చు. రాత్రి నిద్ర పోయేముందు అర లీటర్‌ నుండి లీటర్‌ ఉండే రాగి చెంబు నిండా మంచినీళ్ళు పోసి మంచం పక్కనే పెట్టుకోవాలి ఉదయం నిద్ర లేచి లేవగానే రెండు సార్లు పుక్కిలించి ఊసి ఆ రాగి చెంబులోని నీళ్లు తాగాలి . దీనివల్ల 15 నిమిషాల నుండి అర గంటలోపు సుఖ విరోచనం అవుతుంది. గ్యాస్‌, కడుపుబ్బరము, కడుపులో మంట, మలబద్ధకం, తేపులు, మొదలైన బాధలన్నీ ఈ అలవాటుతో ఎటువంటి ఔషదాలు వాడే పని లేకుండా పూర్తిగా తగ్గిపోతాయి. మలబద్ధకం అనేది అన్ని వ్యాధుల్ని కలిగించడానికి మూలకారణం కాబట్టి ఈ అలవాటు తో మలబద్ధకం నివారించుకుంటే హాయిగా జీవించవచ్చు.

English summary

Reason Behind Why Hindus Use Copper Things To Worship God

The Reason Why Hindus Use Copper Things To Worship God,Amazing Scientific Reasons Behind Hindu Traditions
Desktop Bottom Promotion